Home /News /telangana /

ILLEGAL REGISTRATIONS ARE NOT STOPPING IN MAHBUBNAGAR DESPITE THE AVAILABILITY OF THE DHARANI WEBSITE MBNR PRV

Dharani Portal: ధరణి వచ్చింది భూ అక్రమాలు ఆగిపోతాయనుకుంటే.. ఆ జిల్లాలో వింత పరిస్థితి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ధరణి. తెలంగాణ ప్రభుత్వం భూ ఆక్రమణలు, నకిలీ రిజిస్ట్రేషన్లు ఆపడానికి తగాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకొచ్చిన పథకం. అయితే ఈ ధరణి వచ్చినా చాలా ప్రాంతాల్లో అక్రమాలు ఆగడం లేదు.

    (Sayyad Rafi, News18, Mahbubnagar)

    ధరణి. తెలంగాణ ప్రభుత్వం భూ ఆక్రమణలు, నకిలీ రిజిస్ట్రేషన్లు ఆపడానికి తగాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకొచ్చిన పథకం. అయితే ఈ ధరణి వచ్చినా చాలా ప్రాంతాల్లో అక్రమాలు ఆగడం లేదు.  ఉమ్మడి పాలమూరు జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్ (Land Registration) వివాదాలు తలెత్తుతున్నాయి.  ఈ మధ్యలో మహబూబ్​నగర్​ (Mahbubnagar) జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో భూ యజమాని పేరుతో ఉన్న మరో వ్యక్తిని తీసుకొచ్చి స్లాట్ బుక్ చేసి రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించారు. రిజిస్ట్రేషన్ కన్నా ముందే విషయం వెలుగులోకి రావడంతో ప్రక్రియ ఆగింది. సర్వే చేసిన 2017 లో ప్రభుత్వం ఎల్ ఆర్ యు పి భూముల శుద్ధికరణ ను తీసుకొచ్చింది.

    భూముల సర్వే నిర్వహించి ఏ సర్వే నంబర్లు ఎన్ని ఎకరాలు భూమి ఉంది?. ఎవరి పేరు మీద ఉంది. ఎంత విస్తీర్ణంలో ఉంది?. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటిని విస్తీర్ణం ఎంత తదితర వివరాలు సర్వే చేసి లబ్ధిదారులకు కొత్త పాస్ పుస్తకాలను అందించింది. వివరాలను ధరణి (Dharani) పోర్టల్ లో పొందుపరిచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ను తహసిల్దారులకు అప్పగించింది. అయినా అక్రమ రిజిస్ట్రేషన్లు ఆగకపోవడంతో నిజమైన పట్టాదారులు లబోదిబోమంటున్నారు.

    ఉదాహరణకు వనపర్తి (Vanaparti) జిల్లా అమరచింత మండలంలోని వామిరెడ్డిపల్లిలో 43 ఏళ్ల కిందట మృతి చెందిన ఓ వ్యక్తి భూమిని నకిలీ పత్రాలతో ఇతరులకు పట్టా చేశారని వివాదం చెలరేగి కేసు వరకు వెళ్ళింది. రెవెన్యూ పోలీసు అధికారుల మధ్య ఈ వ్యవహారంలో వాదోపవాదాలు జరిగాయి. రెవెన్యూ అధికారులపై షోకేస్ నోటీసులు కూడా జారీ అయ్యాయని సమాచారం. మరొకటి నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లా కోడేరులో ఇటీవల ఓ రైతుకు తెలియకుండానే మరో వ్యక్తికి రెవెన్యూ అధికారులు పట్టా చేశారు. మొత్తం 11. 17 ఎకరాల భూమిని ఓటీపీతో స్లాట్ బుక్ చేసి రిజిస్ట్రేషన్ జరిపారు. విషయం తెలిసిన ఆ రైతు జిల్లా కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసిన తహసిల్దార్ కు మెమో జారీ చేయగా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. లింగాల మండలంలోని మరో రిజిస్ట్రేషన్ వ్యాపారం వివాదాస్పదమైంది. ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలాచోట్ల అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి.



    నేతలు, మధ్యవర్తుల పాత్రతోనే..

    పట్టాదారు లేకుండా రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు. వేలిముద్ర ఐరిస్ ద్వారా వారిని అధికారులు గుర్తుపట్టవచ్చు. ఆయన కూడా రిజిస్ట్రేషన్ జరిగిందంటే అందులో సిబ్బంది ప్రమేయం కచ్చితంగా ఉన్నట్లే భావించాలి. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ వెనుక రాజకీయ పార్టీలు మధ్యవర్తులు పాత్ర ఉంటుంది. పలు రెవెన్యూ కార్యాలయంలో వేరే తిష్ట వేసి అక్రమ రిజిస్ట్రేషన్ చేయడంలో కీలక భూమిక వహిస్తున్నారు. అమాయకులు, చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన భూముల వివరాలు సేకరించి వీరే అధికారుల ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు..

    కఠిన చర్యలు లేకే..

    ఉన్నత అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ధరణి రిజిస్ట్రేషన్ (Dharani registration) లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని పలువురి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయ అధికారులు సిబ్బంది పాత్ర పై అనుమానాలు వ్యక్తం అవుతున్నా చూసి చూడనట్లు ఉండటమే ఇందుకు కారణం అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంత మంచి కార్యక్రమాన్ని పక్కదారి పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Dharani Portal, Lands, Mahbubnagar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు