అక్రమ కట్టడాలపై (Illegal construction) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కొరాఢ ఝలిపించింది. అయితే ఈసారి ఏకంగా హెచ్‌ఎమ్‌డిఏ పరిధిలో అక్రమ కట్టడాలపై దృష్టి సారించింది. గత కొద్ది రోజులుగా అక్రమ కట్టడాలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో నేడు సీఎస్ సోమేష్ కుమార్ అధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. (Illegal construction) దీంతో నగర కార్పోరేషన్ల పరిధిలోనే కాకుండా ఏకంగా హెచ్‌ఎమ్‌డిఏ పరిధిలో అక్రమ నిర్మాణలపై రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్రచేసింది. ఈ క్రమంలోనే ఈనెల ముప్పైవరకు అక్రమ నిర్మాణాలను గుర్తించాలని ఆయా మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు.(Illegal construction) వాటిని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఒక వేళ నిర్మాణాలు ఉంటే... వాటిని కూల్చి వేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. మరోవైపు 30 తర్వాత కూడా అక్రమ నిర్మాణాలు ఉంటే వాటి బాధ్యత ఆయా కమిషనర్లదేనని స్పష్టం చేశారు.
దీంతో మరోసారి అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు, కమిషనర్‌లతో సహా విజిట్ చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా హెచ్‌ఎండీఎ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు అవతల ప్రాంతంలో కూడా ఉండడంతో అనేక వందల నిర్మాణాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.(Illegal construction) దీంతో ఆ నిర్మాణాలను గుర్తించిన తర్వత ప్రభుత్వం ఎలాంటీ నిర్ణయం తీసుకుంటుంతో వేచి చూడాలి. ఆదేశాలు జారీ చేసినట్టుగా కూల్చివేతలకు పూనుకుంటుందా లేక జరిమానాలతో సరిపెట్టుకుంటుందా అనేది వేచి చూడాలి.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad