నిర్దిష్టమైన అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు, గోదాములు వంటి అక్రమ నిర్మాణాలపై కూల్చివేత చర్యలు కొనసాగుతున్నాయి.
మున్సిపల్ చట్టం పరిధికి లోబడి అక్రమ నిర్మాణాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ బృందాలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ) ప్లానింగ్ అధికారులు, హెచ్ఎండీఏ ఎన్ ఫోర్స్ మెంట్ యంత్రాంగం సంయుక్తంగా నిర్వహిస్తున్న కూల్చివేత చర్యల్లో భాగంగా గురువారం నాల్గవ రోజు ఐదు(5) మున్సిపాలిటీల పరిధిలో పన్నెండు(12) పెద్ద అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు.
మొత్తంగా గత నాలుగు (4) రోజుల్లో నలభై ఐదు(45) అక్రమ నిర్మాణాలను డిస్టిక్ టాస్క్ఫోర్స్ బృందాలు కూల్చివేశాయి. గురువారం కొంపల్లి, తుర్కయంజాల్, నార్సింగి, శంషాబాద్, కొత్తూరు మున్సిపాలిటీల పరిధిలో డిస్టిక్ టాస్క్ ఫోర్స్, హెచ్ఎండిఎ బృందాలు విధులను నిర్వహించాయి.
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఐదు(5)అక్రమ నిర్మాణాలు, నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో మూడు (3) అక్రమ నిర్మాణాలను, తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో రెండు (2)అక్రమ నిర్మాణాలను, శంషాబాద్, కొత్తూరు మున్సిపాలిటీల పరిధిలో ఒకటి చొప్పున మొత్తం పన్నెండు(12)అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.