Illegal business: ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో రెమిడెసివర్‌ దందా.. గుట్టు రట్టు చేసిన పోలీసులు..

అక్రమంగా విక్రయిస్తున్న రెమిడెసివర్ ఇంజక్షన్లను పట్టుకున్న పోలీసులు

Illegal business: ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి చెందిన రెమిడెసివర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్ విక్రయిస్తున్న ఆసుపత్రి సిబ్బందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు ఆసుపత్రి సబ్బందిని అదుపులోకి తీసుకొని.. వారి వద్ద ఆరు రెమిడెసివర్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.

  • Share this:
    ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరుగుతున్న రెమిడెసివిర్‌ ఇంజెక్షన్ల అక్రమ అమ్మకాలను పోలీసులు గుట్టు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ రామానుజం ఆధ్వర్యంలో సిఐ వేణు మాధవ్ , ఎస్సై సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి చెందిన రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్ విక్రయిస్తున్న ఆసుపత్రి సిబ్బందిని ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సమీపంలో నిఘా పెట్టి రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను పట్టుకున్నారు. వీరిలో ఓ స్టాఫ్‌నర్స్‌, మరో ఇద్దరు పేషంట్‌ కేర్‌ సిబ్బంది ఆస్పత్రి నుంచి రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు బయటకు తెచ్చి కరోనా రోగుల బంధువులకు విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.

    ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు ఉపయోగించాల్సిన (06)రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను ప్రభుత్వ ఆసుపత్రిలోని స్టాఫ్ నర్స్ మరో ఇద్దరు ఔట్ సోర్స్ ఉద్యోగులను బ్లాక్ మార్కెట్ రూ. 38 వేలకు ఇంజెక్షన్ విక్రయిస్తున్న సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అకస్మాత్తుగా దాడి చేసి పట్టుకున్నారు.  వాటిపై ప్రభుత్వం సప్లై నాట్ ఫర్ సేల్ అని కూడా ఉందన్నారు. తదుపడి చట్టపరమైన చర్యల నిమిత్తం ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ తెలిపారు.
    Published by:Veera Babu
    First published: