హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nalgonda : 19 మంది మహిళలను మోసం చేసిన ఫ్రాడ్.. రెండో భార్య ఫిర్యాదులో వెలుగులోకి..

Nalgonda : 19 మంది మహిళలను మోసం చేసిన ఫ్రాడ్.. రెండో భార్య ఫిర్యాదులో వెలుగులోకి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Nalgonda : ఒకరు ఇద్దరు కాదు ఏకంగా పందోమ్మిది మంది మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు చర్చిలో వాయెలిన్ వాయించే ఓ వ్యక్తిపై అతని రెండో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తమ కష్టాలను దేవుడికి చెప్పుకుని బయటపడతామని భావించే భక్తులపై ఓ వ్యక్తి దుర్మర్గంగా వ్వహరించాడు.. వారి మానసిక పరిస్థితిని ఆసరా చేసుకుని చర్చికి వచ్చే మహిళలను పదుల సంఖ్యలో లోబరుచుకుని మోసానికి తెర తీశాడు.. అదికూడా తన రెండు భార్య ఫిర్యాదుతో విషయం వెలుగులోకి రావడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే..నల్గొండ జిల్లా కేంద్రంలోని ఓ చర్చిలో విలియమ్స్ అనే వ్యక్తి వాయోలిన్ వాయిస్తాడు.. ప్రార్థనలు సమయంతో పాటు పలు సంధర్బాల్లో చర్చికి వచ్చే యువతులతో పాటు పలువురు మహిళలను తన మాయ మాటలతో లోబరుచుకున్నాడు. ఇలా చర్చివచ్చే 19 మందితో తన అవసరాలు తీర్చుకుని మోసం చేశాడు. అయితే విలియమ్స్‌పై తన రెండో భార్య స్థానిక పోలీసుకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేసి విలియమ్స్‌ను అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగారు.. ఇది గమనించినా విలియమ్స్ స్మార్ట్‌గా ఎస్కెప్ అయ్యాడు.. తనకు గుండెనొప్పి వచ్చింటూ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. దీంతో పోలీసులు విలియమ్ ఆగడాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

ఇది చదవండి : వలలో చిక్కిన జలకన్య -మైపాడు బీచ్‌లో గిలగిలా కొట్టుకుంటూ -అసలేం జరిగిందంటే..


పంజాగుట్ట బాలిక మృతిపై ఆటో డ్రైవర్ అరెస్ట్..

ఇక పంజాగుట్టలో రోడ్డుపై లభించిన నాలుగేళ్ల చిన్నారీ మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలోనే బాలికను తీసుకువచ్చిన ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాట్టు సమాచారం. కాగా ఆ బాలికను తెల్లవారుజామున తీసుకువచ్చి అక్కడ వేశారని.. అలా పాపను తీసుకువచ్చిన వారు ఉత్తరాధి రాష్ట్రాలకు చెందిన నిందితులుగా ఆటో డ్రైవర్ చెప్పినట్టు తెలుస్తోంది. మరో వైపు ఆ బాలికను తీవ్రంగా కొట్టడడం వల్లే చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. అయితే ఆ టైంలో చౌరస్తాలో ఎందుకు పడేయాల్సి వచ్చింది. వారు ఎక్కడి నుండి వచ్చారు. ఆ పాప ఎవరు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Crime news, Nalgonda, Telangana

ఉత్తమ కథలు