IF YOU WANT TO UNITE INDIA WATCH RRR MOVIE SAID MLA SEETAKKA VRY
MLA Seetakka on RRR : ఇలా అనుకుంటే RRR ..లేదంటే కశ్మీర్ ఫైల్స్ చూడండి.. ఎమ్మెల్యే సీతక్క
mla SEETAKKA
MLA Seetakka on RRR : RRR సినిమాపై కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ఎమ్మెల్యే సీతక్క తనదైన స్టైల్లో స్పందించారు. సీనిమా చూసిన ఆనంతరం ఆమె బీజేపీకి చురకలు అంటించారు.
అప్పుడప్పుడు సినిమాలు కూడా రాజకీయాలను ప్రభావితం చేస్తాయి.. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు రాజకీయ దుమారం కూడా రేపుతాయి.. ఈ క్రమంలోనే ఇటివల వచ్చిన కశ్మీర్ ఫైల్స్ సినిమాను బీజేపీ రాజకీయాంగా ప్రచారం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలు ఆ సినిమాకు టాక్స్ మినహాయింపు కూడా ఇచ్చాయి. కాగా ఇటివల దర్శకుడు రాజమౌళీ దర్శకత్వం వహించిన RRR సినిమా కలెక్షన్లలో రికార్డులు బద్దలు కొడుతున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే తనదైన స్టైల్లో స్పందించారు. బీజేపీ చేస్తున్న ప్రచారానికి ఆమె చెక్ పెట్టారు.
ఈ క్రమంలోనే RRR సినిమాపై ఓ ట్వీట్ చేశారు. ఆ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ సంధర్భంగా ఒకవేళ భారత దేశాన్ని విడదీయాలంటే కశ్మీర్ ఫైల్స్ చూడాలని, లేదంటే. భారత దేశాన్ని యునైటైడ్గా ఉంచాలనుకుంటే RRR సినిమా చూడాలని ఆమే ట్వీట్ చేశారు. ఈ సంధర్బంగా దర్శకుడు రాజమౌళికి అభినందనలు తెలిపారు. దీంతోపాటు హీరోలు రామ్చరణ్, ఎన్టీఆర్ లపై ప్రశంసలు కురిపించారు.
— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) March 28, 2022
కాగా ఈ రెండు సినిమాలు దేశవ్యాప్తంగా అనేక సంచలనాలకు నిలయంగా నిలిచిన విషయం తెలిసిందే.. నెమ్మదిగా కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ప్రజలు ఆసక్తి కనబరుస్తుంటే... గత నాలుగు రోజుల క్రితమే విడుదలైన
RRR 500 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.