Eetala Rajendar : ఈటెల బిజెపి లో చేరితే..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిజెపి పరిస్థితి ఏంటి..?

Eetala Rajender :స్పీకర్‌కు రాజీనామా లేఖ అందించనున్న ఈటల ..పదకొండు గంటలకు ముహుర్తం ఫిక్స్

Eetala Rajendar : ఈటల రాజేందర్ బీజేపీ లో చేరితే రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుంది..ముఖ్యంగా కరీంనగర్‌లో ఆ పార్టీ పుంజుకుంటుందా..అటు పార్టీ అధ్యక్షుడు, ఇటు సీనియర్ మంత్రి మధ్య సయోధ్య ఎలా ఉంటుంది..క్రింది స్థాయి క్యాడర్ సర్ధుకుపోతుందా..?

  • Share this:
    న్యూస్ 18తెలుగు. కరస్పాండెంట్. శ్రీనివాస్.
    కరీంనగర్ జిల్లా..

    టీఆర్ఎస్ నుండి ఈటెల బర్తరఫ్ తరువాత ఉమ్మడి కరీంనగర్ జిల్లలో రాజకీయం ఎన్నొ మలుపులు తిరుగుతుంది. ఈటెల దారెటు అంటూ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. పార్టీ పెడుతారా.. లేక కాంగ్రెస్, లేదా బిజెపి పార్టీ లో చేరుతారా అన్న సందిగ్ధం నిన్నటితో తేరదింపారు. ఈటల మాత్రం అందరిని కలుస్తానని చెబుతున్నా.. బీజేపీ పార్టీ లో చేరుతున్నారని, ఈటెల అనుచరులతో పాటు బీజేపీ సైతం చెప్పకనే చెపుతున్నారు.

    దీంతో ఒకవేళ ఈటెల బిజెపి పార్టీ లో చేరితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిజెపి పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందనే ఉహాగానాలకు కూడ తెర లేచింది. ముఖ్యంగా బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పావులు కదుపుతున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జిల్లా వాసి కావడంతో మరింత ప్రాధాన్యత పెరిగింది.

    ఇక ఈటల కూడ బీజేపీలో చేరితే కరీంనగర్‌లో బీజేపీ మరింత పట్టు సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఒక అడుగు ముందుకు వేసి బీజేపీ రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తుందని జోరుగా ఉహాగానాలు వెలువడుతున్నాయి. ఇలాంటీ పరిస్థితిలో ఈటలకు ఎలాంటీ పదవిని కట్టబెడతారనే ప్రచారాం కూడ కొనసాగుతోంది. మరోవైపు సీఎం పదవిపై కూడ అప్పుడే జోరుగా ఉహాగానాలు కూడ చెలరేగుతున్నాయి..ఈటల ఏకంగా సీఎం రేసులోనే ఉంటారని ఆయన అనుచరులు చెబుతున్నట్టు సమాచారం.

    అయితే ఇప్పటికే బండి సంజయ్ కరీంనగర్‌లో పాగ వేసిన నేపథ్యంలోనే ఈటల వర్గంతో ఎలా ఉంటుందనే చర్చలు కొనసాగుతున్నాయి.ముఖ్యంగా కరీంనగర్ పట్టణంలో గంగుల కమాలాకర్‌తో పాటు ఎంపీ బండి సంజయ్ ‌ల మధ్య రాజకీయ వైరం నెలకొనగా ఇప్పుడు ఈటల రాజేందర్ మరియు గంగుల కమాలాకర్ మధ్య రాజకీయ వైరం ఏర్పడుతోంది. దీంతో ఇద్దరు బడా నాయకులు ఏకమై గంగులకు చెక్ పెట్టేందుకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఈటల బీజేపీలో చేరితే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జిల్లాలో కూడ ప్రకంపనలు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
    Published by:yveerash yveerash
    First published: