(సయ్యద్ రఫి, న్యూస్ 18 తెలుగు, మహబూబ్ నగర్)
ఉమ్మడి మహబూబ్ నగర్ (Mahbubnagar) జిల్లాలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలున్నాయి. వాటిని మరింతగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వ భావించినా.. ఇప్పటికీ పనులు జరగడం లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 34 ప్రాంతాలు పర్యటకానికి అనుకూలంగా ఉన్నాయని పర్యాటకశాఖ గుర్తించింది. నల్లమల్ల ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, చారిత్రక వారసత్వ సంపదకు నెలవుగా పాలమూరును పర్యాటక సమూహంగా ఏర్పాటు చేయాలని 2019లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో ఎక్కువ ఎకో రివర్ టెంపుల్ టూరిజం (Eco river temple tourism) అభివృద్ధి చేస్తామని, ఇందుకు ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తామని హామీలు ఇచ్చింది. కానీ అవి కార్యరూపం దాల్చాకపోవడంతో నిరాశే మిగిలింది.
ఐతే మహబూబ్నగర్లో మాత్రం కొంత వరకు పనులు జరుగుతున్నాయి. రూ. 8 కోట్లతో మినీ శిల్పారామాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ అభివృద్ధిలో భాగంగా మినీ ఐలాండ్, తీగల వంతెన ఏర్పాటు చేస్తున్నారు. ఇక నల్లమల్ల ప్రాంతంలో ఏకో టూరిజం అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావించింది. సోమశిల నుంచి ఈగల పెంట వరకు శ్రీశైలానికి కృష్ణా నది లాంచీ ప్రయాణాన్ని ఏర్పాటు చేసింది. మధ్యలో అక్క మహాదేవి గుహలు ఆక్టోపస్ వంటి ప్రాంతాలను చూసిన తరువాత.. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శన వసతికి ప్రణాళిక ఏర్పాటు చేశారు. సోమశిల వద్ద రూ.2 కోట్లతో ఏర్పాటుచేసిన ఆధునిత లాంచీ గత ఏడాది ఐదారు ట్రిప్పులకే పరిమితమైంది.ఏకో టూరిజం అభివృద్ధికి నల్లమల్లలో రూ.91.62 కోట్లతో పనులు పూర్తయినా.. సరైన ప్రచారం లేక పర్యాటకులు అనుకున్న స్థాయిలో రావడం లేదు.
మహబూబ్ నగర్ సమీపంలోని మయూరి పార్కు టూరిజంకు అనుకూలంగా ఉంటుందని గత ఏడాది గుర్తించారు. ఆ దిశగా పర్యటకులు కావలసిన ప్రత్యేక ఏర్పాట్లు మాత్రం ఇంకా చేయలేదు. 700 ఏళ్ల చరిత్ర ఉన్న పిల్లల మరి సంరక్షణకు చర్యలు చేపట్టిన అక్కడ సౌకర్యాలు లేవు. కోయిలకొండ కో.ట జడ్చర్ల మండలంలోని గుల్లత గుడి నిర్లక్ష్యం నీడలోనే ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేస్తే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి, అలంపూర్ జమ్మిచేడు, బీచుపల్లి, రంగాపూర్, సోమశిల, ఉమామహేశ్వరం, సలేశ్వరం, సింగోటం గంగాపురం, మన్యంకొండ, శ్రీ కురుమూర్తి ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజం సమూహాన్ని అభివృద్ధి చేయాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఆలయాల్లోనూ అభివృద్ధి చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించాల్సి ఉండగా ఇప్పటివరకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోలేదు.
Bhadradri: నష్టాల సుడిగుండంలో బంతి పూల రైతులు.., కనీస పెట్టుబడి దక్కేనా
ఎకో రివర్ టెంపుల్ టూరిజం సమూహాల ఏర్పాటు అనుకున్నట్లే జరిగితే పాలమూరు పర్యటక రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. మౌలిక వసతులు కల్పించి ప్రణాళికలను అభివృద్ధి చేస్తే రాష్ట్రంలో నలుమూలల నుంచి పర్యాటకులు పాలమూరు బాట పడతారు. ఐదు జిల్లాల్లోని పర్యాటక ప్రదేశాలు రెండు రోజుల్లో సందర్శించేలా బస్సు వసతి భోజనము సదుపాయాలను కల్పించి.. ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాల్సి ఉంది. వీరికి గైడ్లను కూడా నియమించాలి. తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
పాలమూరులో ఏకో రివర్ టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్ తెలిపారు. సోమశిల నుంచి శ్రీశైలానికి ఏర్పాటుచేసిన లాంచీని పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకొస్తామని వెల్లడించారు. దేవాలయాలను కలుపుతూ ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నామని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahabubnagar, Mahbubnagar, Telangana tourism