IF EETALA RAJENDER JOINS IN BJP WHAT WOULD BE THE OFFER VRY HYD
Eetal Rajender : ఈటలకు బిజేపీ ఇచ్చిన బంఫర్ ఆఫర్ ఇదేనా? అందుకే ఆయన కాషాయ కండువా కప్పుకుంటున్నారా?
Eetala Rajender :స్పీకర్‌కు రాజీనామా లేఖ అందించనున్న ఈటల ..పదకొండు గంటలకు ముహుర్తం ఫిక్స్
Eetal Rajender : తెలంగాణలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న ఈటల రాజేందర్ బిజేపీనే ఎందుకు ఎంచుకున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుండి సీఎం కేసిఆర్‌తో పాటు కలిసి నడిచిన ఆయనకు పార్టీ పెట్టె అవకాశం ఉన్నా.. ఎందుకు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.. ? బీజేపీ,ఈటలకు ఇచ్చిన ఆఫర్ ఏవిధంగా ఉండబోతుంది..?
తెలంగాణలో ఈటల రాజేంద్ర ఎపిసోడ్ ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ నుండి అన్యూహా రీతిలో పార్టీకి దూరమైన తర్వతా తెలంగాణ రాజకీయ పరిణామాలపై చాలా ఉత్కంఠ నెలకుంది. దీంతో తెలంగాణలో మరో పార్టీ రాబోతుందనే ప్రచారం కూడా జోరుగా జరిగింది. అయితే కేడర్ తో సుదీర్ఘ చర్చలు జరిపిన తరువాత ఈటెల తన రాజకీయ భవిష్యత్ పై ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయన బిజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఈటెల బిజేపీ పెద్దలను కలిసి లైన్ క్లియర్ చేసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈటెల కషాయం కండువా కప్పుకోవడం ఖాయమని చెప్పుకోవాలి.
అయితే పార్టీ పెడతారనే ప్రచారం జరిగినా... అన్యూహారీతిలో బీజేపిలో చేరాలనే నిర్ణయం తీసుకోవడం పట్ల భిన్న అభిప్రాయాలు వినిపిస్తోన్నాయి. తొలుత టీఆర్ఎస్ మంత్రివర్గం నుండి తొలగించిన తర్వాత ఈటల రాజేందర్‌కు అన్ని వర్గాల వైపుల నుంచి విశేష మద్దతు వచ్చింది. అయితే ఈటల రాజేందర్ సొంత పార్టీ పెడతారనే ప్రచారాలు జోరుగా జరిగి పోయాయి. ఒకనోక దశలో ఆయన కూడా ఈ వార్తలు కూడా ఖండించలేదు. అయితే అన్యూహాంగా ఇప్పుడు ఆయన బిజేపీలో చేరడం చాలా మందికి మింగుడుపడకపోవడంతోపాటు ఇప్పటి వరకు అన్ని వర్గాల నుంచి ఆయనపై వచ్చిన సానుభూతి కాస్త మరుగున పడిందనే వాదనలు వినిపిస్తోన్నాయి.
తనను తాను రక్షించుకోవడానికే ఈటెల బిజేపీ చెంత చేరారని మరిన్ని వాదనలు కూడా వినిపిస్తోన్నాయి. అయితే ఈటెల బిజేపీలో చేరడానికి బలమైన కారణమే ఉందని అంటున్నారు ఆయన సన్నిహితులు.... బిజేపీ నుంచి ఆయనకు భారీ ఆఫర్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలోనే కేంద్ర క్యాబినేట్లో ఈటెలకు చోటు తోపాటు...ఆయన సతీమణికి హూజూరాబాద్ నుంచి బరిలో దించుతారనే వార్తలు హాల్ చల్ చేస్తోన్నాయి. ఒక వేళ అదే జరిగితే ఆశ్చర్యకరమైన రాజకీయ పరిణామామే అంటున్నారు, రాజకీయ విశ్లేషకులు.
బిజేపీ ఒక వేళ ఈటలను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలంటే రాజ్యసభకు పంపి అక్కడ నుంచి కేబినేట్ లోకి తీసుకోవాలి. ఇతర రాష్ట్రాల నుంచి ఆయన్ను రాజ్యసభకు పంపి కేబినేట్ మంత్రిని చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే పార్టీలో చాలా మంది బలమైన నేతలు ఉన్న బిజేపీ కేవలం ఈటెల ఒక్కరి కోసం ఇంత ప్రాధాన్యత ఇస్తోందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఒక వేళ అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో పార్టీ ఈటెపైనే ఆధాపడిందనే సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని అభిప్రాపడుతున్నారు రాజకీయ నిపుణులు. అయితే ప్రస్తుతం తనకు అన్నివిధాలుగా అనుకూల పరిస్థితులు ఉన్నా.. ఆయన బిజేపీలో చేరుతున్నారంటే బలమైన కారణమే ఉంటుందని అంటున్నారు ఆయన అభిమానులు. దీంతో రాబోయే రో్జుల్లో ఈటెల పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.