Garbage is sent home: అక్కడ చెత్త వేస్తే.. తిరిగి మన ఇంటి ముందుకే వస్తుంది.. అదెలా అంటే..

ప్రతీకాత్మక చిత్రం

Garbage is sent home: సాధారణంగా ఇంట్లో చెత్తను తీసుకెళ్లి డస్ట్ బిన్ లో పడేస్తాం. డస్ట్ బిన్ నిండిపోతే మున్సిపాలిటీ వాళ్లు వచ్చినప్పుడు వాళ్లకు అప్పగిస్తాం. కానీ చాలామంది అక్కడ ఇలా చేయడం లేదంటా.. వారి కోసం అక్కడి అధికారులు వినూత్నంగా ఆలోచించారు. అదేంటంటే..

  • Share this:
    గోడకు బంతిని కొడితే తిరిగి మన దగ్గరకే వస్తుంది. బురదలో రాయి వేస్తే తిరిగి ఆ బురద మన మీదే పడుతుది. ఇలా పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక్కడ చెత్త కూడా ఎక్కడ పడితే అక్కడ వేస్తే తిరిగి మన ఇంటి వద్దకే వచ్చి చేరుతుంది. ఇదేంటి అనుకుంటున్నారా.. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది ఇంటిలోని చెత్తను డస్ట్ బిన్ వద్దకు వెళ్లి పడేయలేక ఇంటి ముందు ఉన్న ఉన్న ఖాళీ ప్రదేశంలో పడేస్తున్నారు. ఖాళీ జాగలో పడేసేందుకు చెత్తను చాటుగా తీసుకెళ్లి మరీ పడేస్తున్నారు. ఇక నుంచి అలాంటివేమి పని చేయవని.. ఎక్కడిక్కడ నిఘా కెమెరాలతో మిమ్మల్ని ఫోటోలు తీస్తుంది. అంతేకాకుండా మీకు తెలియకుండా వ్యక్తులు కూడా ఫోటోలు తీస్తారు. వెంటనే అక్కడ వేసిన మొత్తం చెత్తను మున్సిపల్ సిబ్బందితో తీయించి సంబంధిత యజమాని ఇంటి ముందు వేసి నిరసన వ్యక్తం చేస్తారు. కుత్బుల్లాపూర్‌ మున్సిపాల్టీలో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సూరారం కాలనీ కి చెందిన సామాజిక కార్యకర్త రవీందర్ ముదిరాజ్.

    ప‌బ్లిక్ ప్రదేశాల్లో చెత్త వేస్తూ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్న ప్రజలకు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. ఖాళీ ప్రాంతాలలో చెత్త వేస్తున్నవారిని గుర్తించి, వారితోనే తిరిగి ఆ చెత్తని చేతి సంచులలో నింపి‌ పంపించారు. సూరారంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడంతో కాలనీ అంతా అపరిశుభ్రంగా తయారైంది.

    ప్రతీకాత్మక చిత్రం


    దీంతో ఎవరు వేసిన చెత్తను వారే ఎత్తివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా సమయంలో పరిశరాలను అపరిశుభ్రంగా తయారు చేయోద్దని అవగాహన కల్పిస్తున్నారు. ఏంచక్కా ప్రభుత్వం అందించి తడి, పొడి డబ్బాలను ఉపయోగించి వాటిలో చెత్త వేసి మున్సిపాలిటీ సిబ్బందికి అప్పగించాలని అవగాహన కల్పిస్తున్నారు.
    Published by:Veera Babu
    First published: