Home /News /telangana /

IDENTIFICATION OF ANTIQUITIES OF SATAVAHANA PERIOD IN SIDDIPET DISTRICT SNR MDK

Telangana : బయటపడుతున్న శాతవాహన కాలం నాటి వస్తువులు .. ఆ జిల్లా టూరిస్ట్ ప్లేస్‌గా మారడం ఖాయం

(Antiques)

(Antiques)

Antiques: తెలంగాణలో శాతవాహనుల కాలంనాటి చారిత్రక అనవాళ్లు బయటపడ్డాయి. వేల సంవత్సరాల క్రితం మానవ మనుగడ, నాగరికతను గుర్తు చేసే విధంగా ఉన్న కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి. ఆ జిల్లాలో గతంలో కూడా ఇలాంటి ఆనవాళ్లను గుర్తించారు.

  తెలంగాణ(Telangana)లో శాతవాహనుల(Satavahana)కాలంనాటి చారిత్రక అనవాళ్లు బయటపడ్డాయి. వేల సంవత్సరాల క్రితం మానవ మనుగడ, నాగరికతను గుర్తు చేసే విధంగా ఉన్న కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి. వాటిని పరిటిని పరిశీలించిన పురావస్తువేత్తలు(Archaeologists)పురాతన కాలంలో మానవులు ఎర్రబంక మట్టితో పూసలు, లాకెట్లు, బొమ్మలు చేసే వారని తెలుస్తోంది. అయితే తాజాగా సిద్దిపేట(Siddipet)జిల్లాలో బయటపడ్డ చరిత్రను గుర్తు చేసే వస్తువులపై పూర్తిగా అధ్యాయనం చేస్తున్నారు.

  Telangana : 8వ తరగతి స్టూడెంట్స్‌ని చితకబాదిన గవర్నమెంట్ స్కూల్ టీచర్ .. కారణం అదేనంట..!  శాతవాహనుల కాలం నాటి సామాగ్రి..
  సిద్దిపేట జిల్లా నంగునూరులో పురాతన కాలానికి చెందిన శాతవాహనుల కాలం నాటి వస్తువులు వెలుగుచూశాయి. నంగునూరులోని పాటిగడ్డ మీద వస్తు ఆధారాలు, పూరాతన వస్తువులను పరిశీలించిన పురావస్తువేత్తలు నాటి మానవులు ఎర్ర బంకమట్టితో పూసలు,ఇతర వస్తువులు, బొమ్మలు తయారు చేసేవారు. ఆ బొమ్మల్లో అమ్మదేవతలు, వివిధ జంతువుల రూపాలుండేవి. మట్టిపూసలు, పెండెంట్లను శాతవాహనుల మహిళల మెడలో అలంకారాలుగా నగలుగా ధరించేవారు. ప్రపంచమంతటా దొరికిన టెర్రకోట బొమ్మలు పురామానవుల జీవన సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి.  పాటిగడ్డ పురాతన వస్తువులు..
  సిద్ధిపేట జిల్లాలోని నంగునూరు గ్రామ శివారులోని పాటిగడ్డమీద ఎంతోకాలం నుంచి పురాతన వస్తువులు బయటపడుతున్నాయని వస్తు ఆధార పరిశీలకుడు, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ పరిశీలనలో తేలినట్లుగా శ్రీనివాస్ తెలిపారు. గతంలో ఇక్కడ లభించిన ఎద్దుతల, టెర్రకోటబొమ్మ మధ్య ఆసియాతో సంబంధాలను స్థాపించే రుజువులని వివరించారు. ఇప్పుడు లభించిన టెర్రకోట బొమ్మల్లో గుర్రం తల, రాజుబొమ్మ కొండాపూర్ కోటిలింగాల వంటి, శాతవాహనులనాటి చారిత్రక ప్రదేశాల్లో దొరికినటువంటివే. గుర్రపు బొమ్మ తలతో పాటు లభించే నూనె ముంత, నీళ్ల ముంతలు శాతవాహనులకాలం నాటివేనిని వివరించారు.

  Crime news : కొత్తగా పెళ్లి చేసుకొని భర్తతో వెళ్లిన యువతి కిడ్నాప్ .. 23మంది అరెస్ట్ .. ఎందుకు చేశారంటే..  ఉక్కు పరిశ్రమ ఆనవాళ్లు..
  పాటిగడ్డ మీద నలుపురంగు మట్టిపాత్ర ముక్క, నలుపు, ఎరుపు రంగుల పాత్రల పెంకులు శాతవాహనుల కాలం కంటే ముందు కాలంనాటివని గుర్తు చేస్తున్నాురు. పాటిగడ్డ మీద దొరికిన మట్టి గొట్టాల ముక్కలకు అంటుకున్న ఇనుము చూస్తుంటే అప్పట్లో ఇక్కడ ఇనుము తయారీ పరిశ్రమ ఉండేదనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయని వివరించారు. ఇవన్నీ ఒకేచోట లభించడం ఆ గ్రామం యొక్క చారిత్రక ప్రాధాన్యాన్ని, విశిష్టతని తెలియజేస్తున్నాయంటున్నారు. నంగునూరుకు చెందిన కొత్తతెలంగాణ చరిత్రబృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ క్షేత్ర పరిశోధనలో బయటపడినట్లుగా గురువారం వెల్లడించారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: History, Siddipet, Telangana News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు