ఈ గ్రామస్తులు తాజాగా తమ గ్రామంలో ఉపాధి హామీ పనులకు శ్రీకారం చుట్టారు. కరోనా వైరస్ నేపధ్యంలో ముఖానికి మాస్క్ లు, దస్తీలు, తువ్వాళ్ళు కట్టుకొని భౌతిక దూరాన్ని పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆదిలాబాద్: కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు గ్రామీణులు. ఇందుకు నిదర్శనమే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా-కే గ్రామానికి చెందిన జాతీయ ఉపాధి హామీ కూలీలు. లాక్ డౌన్ నేపధ్యంలో ఉపాధి లేక పనులు చేయక ఖాళిగా ఉన్న ఈ గ్రామస్తులు తాజాగా తమ గ్రామంలో ఉపాధి హామీ పనులకు శ్రీకారం చుట్టారు. కరోనా వైరస్ నేపధ్యంలో ముఖానికి మాస్క్ లు, దస్తీలు, తువ్వాళ్ళు కట్టుకొని భౌతిక దూరాన్ని పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ వెంట శానిటైజర్లు ఉంచుకుంటూ అప్రమత్తంగా ఉంటున్నారు. కరోనా వైరస్ పట్ల వీరి అవగాహనకు పలువురు అభినందిస్తున్నారు. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వీరని ప్రశంసించారు. వీరి చైతన్యానికి హ్యాట్సాఫ్ అంటూ ఈ కూలీలు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు...అంటూ ట్విట్టర్ ట్విట్ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గడ్గే సుబాష్ మాట్లాడుతూ వ్యవసాయ కూలీల పనులు లేక ప్రజలు ఇళ్ళ వద్దే ఉంటున్నారని, అయితే జాతీయ ఉపాధి హామీ అధికారులతో మాట్లాడి గ్రామంలో ఉపాధి హామీ పనులు ప్రారంభించామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి, కూలీలు భౌతిక దూరం పాటిస్తూ, పనులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
Published by:Venu Gopal
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.