భద్రాచలం (Bhadrachalam) ముంపుకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పోలవరం ప్రాజెక్ట్ (Polovaram project) వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ (Telangana Irrigation Department Special Chief Secretary Rajat Kumar) స్పందించారు. బుధవారం రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరంతో లక్ష ఎకరాల వరకు మునిగిపోతాయన్నారు. బ్యాక్ వాటర్‌తో పంట నష్టంతో పాటు చారిత్రాత్మక ప్రాంతాలకు ముప్పని రజత్ కుమార్ (IAS Rajat Kumar) హెచ్చరించారు. భద్రాచలం, పర్ణశాల (Parnashala) వంటివి మునిగిపోతాయని ఆయన పేర్కొన్నారు. పోలవరం బ్యాక్ విషయంలో స్టడీ చేసేందుకు కేంద్రానికి ఎన్నోసార్లు నివేదించామని రజత్ కుమార్ గుర్తుచేశారు. బ్యాక్ వాటర్ (Back water)నష్టం, ఇతర అంశాలపై కేంద్రం ఇప్పటికీ స్పందించలేదన్నారు రజత్ కుమార్. పంప్ హౌజ్ మరమ్మత్తుల ఖర్చులు రూ. 300 కోట్లు దాటుతాయని అంటున్నారని.. వాస్తవానికి రిపేర్ చేయడానికి రూ. 20 కోట్లకు మించి కావని రజత్ కుమార్ అన్నారు.
ఈ ఖర్చు కూడా ప్రాజెక్ట్ కట్టిన వాళ్లే భరిస్తారని రజత్ కుమార్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ లోపు మళ్లీ పంప్ హౌజ్ (Pump House)లు నడుస్తాయని, ప్రస్తుతం పవర్ రీ స్టోర్ అయ్యిందన్నారు. కేంద్రంలో ఉన్న 18 సంస్థలు అనుమతి ఇచ్చిన తర్వాతే ప్రాజెక్ట్ కట్టడం జరిగిందని వివరించారు. 100 ఏండ్ల తరువాత భారీ వర్షాలు కురిశాయని వెల్లడించిన ఆయన కడెం ప్రాజెక్టుకు ఇటీవలే మరమ్మత్తులు చేశాం కాబట్టే ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు.
క్లౌడ్ బరస్ట్ అనేది టెక్నికల్ పదం కాదని..
ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని నాలుగు మండలాలు, కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షం పడిందన్నారు. కడెం, కాళేశ్వరం వద్ద జరిగిన పరిస్థితులపై కమిటీ విచారణ చేస్తోందని వెల్లడించారు. IMD డేటా, యూరో శాటిలైట్ తో వాతావరణ పరిస్థితులను గమనిస్తున్నట్లు తెలిపారు. క్లౌడ్ బరస్ట్ అనేది టెక్నికల్ పదం కాదని.. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పు జరిగిందని నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెంచడం వల్ల తెలంగాణలోని పలు పాంత్రాలకు వరద ముంపు ఉందని.. వెంటనే ఏపీలో విలీనం చేసిన 7 మండలాలు.. భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ డిమాండ్ చేయడంతో ఈ అంశం తెరపైకి తీసుకొచ్చారు. ఈ వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పువ్వాడ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bhadrachalam, Floods, Irrigation Projects, Polavaram, Telangana