Home /News /telangana /

I WONT SEE REVANTH FACE CONGRESS SENIOR LEADER KOMATIREDDY VENKATAREDDY SLAMS TPCC CHIEF REVANTH REDDY SK

Komatireddy Venkata Reddy: ఇకపై రేవంత్ ముఖం చూడను.. వెంకటరెడ్డి ఆగ్రహం.. కాంగ్రెస్‌లో కొత్త రచ్చ

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Munugodu Politics: ఇప్పటికే  రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత.. కాంగ్రెస్ పార్టీలో రచ్చ జరుగుతోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి మధ్య కూడా గ్యాప్ పెరగడంతో పార్టీలో మరింత గందరగోళం నెలకొంది. ఈ ప్రభావం మునుగోడు ఉపఎన్నికపైనా పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India
  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) రాజీనామాతో హస్తం పార్టీకి బిగ్ షాక్ తగలగా.. తాజాగా మరో కొత్త ఇబ్బంది వచ్చి పడింది. ఆయన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy)కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ని  కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తాను ఓడించేందుకు ప్రయత్నాలు చేసిన సుధాకర్‌ని పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి  (Revanth Reddy)పెద్ద తప్పు చేశారని.. ఇకపై ఆయన ముఖం కూడా చూడబోనని తెగేసిచెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడీ వ్యవహారం పార్టీలో కొత్త రచ్చకు దారితీస్తోంది.

  Huzurabad: రాజకీయ రణరంగంగా హుజురాబాద్..! ఫ్లెక్సీలతో TRS, BJP సవాళ్లు

  ''పార్లమెంట్ సమావేశాల తర్వాతే మునుగోడుకు వెళ్తా. రేవంత్ రెడ్డి చాలా పెద్ద తప్పు చేశారు. నన్ను ఓడించాలనుకున్న చెరుకు సుధాకర్‌ను పార్టీలో ఎలా చేర్చుకుంటారు. ఇకపై రేవంత్ రెడ్డి ముఖం కూడా చూడను. '' అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

  • కాంగ్రెస్​లో చేరిన చెరుకు సుధాకర్​.. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సంచలన నిర్ణయం.. 


  కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే.. ఆయన ఒక్కడినే కాకుండా.. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటూ రేవంత్ రెడ్డి మండిపడిన విషయం తెలిసిందే. ఆయన తీరుపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. మా తమ్ముడు పార్టీని వీడితే.. తననెందుకు టార్గెట్ చేశారని విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే కోమటిరెడ్డికి కోపం తెప్పించేలా.. మరో కీలక అడుగు వేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడి చెరుకు సుధాకర్‌ని కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో చెరుకు సుధాకర్ కండువా కప్పుకున్నారు. దీనిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. తన ఓటమి కోసం పనిచేసిన ఆయన్ను పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ రేవంత్ రెడ్డిపై దుమ్మెత్తిపోస్తున్నారు.  మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడంతో.. మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు.. చండూరులో బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. ఈ పార్టీకి రేవంత్ రెడ్డితో పార్టీముఖ్య నేతలంతా హాజరవుతున్నారు. ఐతే చండూరు సభకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరుకావడం లేదు. పార్లమెంట్ సమావేశాలున్నందున సభకు హాజరుకావడం లేదని స్పష్టం చేశారు.  స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ఆయనే సమావేశానికి రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే  రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత.. కాంగ్రెస్ పార్టీలో రచ్చ జరుగుతోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి మధ్య కూడా గ్యాప్ పెరగడంతో పార్టీలో మరింత గందరగోళం నెలకొంది. ఈ ప్రభావం మునుగోడు ఉపఎన్నికపైనా పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Congress, Komatireddy venkat reddy, Telangana Politics, TS Congress

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు