Home /News /telangana /

I WILL NEVER ENTER POLITICS BECAUSE I HAVE MY DREAMS TO PURSUE AND GOALS TO ACHIEVE HIMANSHU RAO SAYS VRY HYD

Himanshu Rao : సీఎం కేసీఆర్ ముద్దుల పట్టి హిమాన్షు రావుకు రాజకీయాల మీద ఆసక్తి లేదట...! ఎందుకంటే...

Himanshu Rao : సీఎం కేసీఆర్ ముద్దుల పట్టి హిమాన్షు రావుకు రాజకీయాల మీద ఆసక్తి లేదట...!

Himanshu Rao : సీఎం కేసీఆర్ ముద్దుల పట్టి హిమాన్షు రావుకు రాజకీయాల మీద ఆసక్తి లేదట...!

Himanshu Rao : సీఎం కేసీఆర్ ముద్దుల మనవడు.. మంత్రి కేటీఆర్ తనయుడు అప్పుడే రాజకీయాలపై అనాసక్తి కనబరిచాడు.. తనకు భవిష్యత్‌లో కొన్ని లక్ష్యాలు ఉన్నాయని వాటిని సాధించడమే తన లక్ష్యమని.. అందుకే తాను రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు హిమాన్షు రావు...

ఇంకా చదవండి ...
    ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు,మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షురావు గురించి రాజకీయ పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు.. అయితే హిమాన్షు ఓ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు..సాధారణంగా తెలంగాణ పితామహుడుగా పార్టీ కార్యకర్తల చేత కీర్తింపబడుతున్న సీఎం కేసీఆర్‌కు వారసుడిగా హిమాన్షు రాజకీయాల్లోకి రావడం ఖాయమని కార్యకర్తలు భావిస్తున్నారు. తమ భవిష్యత్ నాయకుడు హిమాన్షు రావు అనే కోణంలో చాలామంది పార్టీ కార్యకర్తలు భావించడం సహజం.. అయితే హిమాన్షు మాత్రం తన రాజకీయ భవిష్యత్‌పై ఇప్పుడే క్లారీటి ఇచ్చాడు.. తాను భవిష్యత్‌లో ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశాడు. తనకంటూ ప్రత్యేక లక్ష్యాలు ఉన్నాయని, వాటిని చేరుకోవడమే తన ధ్యేయమని తెలిపాడు.

    I just wanted to clear something, I will never enter politics because I have my dreams to pursue and goals to achieve.



    అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం హిమాన్షు తీసుకున్న నిర్ణయాన్ని ప్రంశంసించారు..ముందు చదువు మీద ఆసక్తి కనబరచాలని సూచించారు. అయితే తాను రాజకీయాల్లోకి రానంటునే రాజకీయంగా ప్రకటన చేశాడని మరో నెటిజన్ రీ ట్వీట్ చేశాడు. ఇక ఆయన మాటలన్ని సీఎం కేసీఆర్ దళిత సీఎం పై ఇచ్చిన హమీ లాగా ఉన్నాయని చెప్పారు. కాగా భవిష్యత్ అనేది మన చేతుల్లో ఉండదు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది..పరిస్థితులను బట్టి మారాల్సి ఉంటుందంటూ మరి కొంతమంది సలహా ఇచ్చారు. సో మొత్తం మీద హిమాన్షు రాజకీయాల్లోకి రానంటూనే రాజకీయంగా సోషల్ మీడియా పాపులారిటిని సొంతం చేసుకుంటున్నారనే కామెంట్స్ కూడా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

    అయితే ఇప్పటి నుండే కేసీఆర్ కుటుంబంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న హిమాన్షు రావుపై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేసిన పరిస్థితి నెలకొంది.. చాలా సంధర్బాల్లో సీఎం కేసిఆర్‌తో పాటు హిమాన్షు పేరును కూడా ప్రతిపక్ష పార్టీలు తెరమీదకు తెచ్చాయి..దీంతో హిమాన్షు సైతం రాజకీయాల్లోకి రాకున్నా... చిన్నవయస్సులోనే ప్రత్యేక ముద్ర వేసుకున్నాడనంలో అతిశయోక్తి లేదు..

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: CM KCR, KTR, Ktr son himanshu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు