నిజామాబాద్‌ను వీడే ప్రసక్తే లేదు... బీజేపీకి కవిత వార్నింగ్...

ఆవేదన వ్యక్తం చేస్తున్న కవిత

Telangana News : కార్యకర్త మరణంతో ఆవేదన చెందిన మాజీ ఎంపీ కవిత, ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.

  • Share this:
నిజామాబాద్ జిల్లా లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కవిత మళ్లీ గెలవకపోవడంతో... మూడ్రోజులుగా తీవ్ర మనస్థాపం చెందిన ఆ పార్టీ కార్యకర్త కిషోర్ ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై ఆవేదన వ్యక్తం చేసిన కవిత... ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. కార్యకర్తలెవరూ ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపు-ఓటములు సహజమన్న ఆమె... కిషోర్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతని కుటుంబాన్ని టీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. పదవిలో ఉన్నా, లేకపోయినా... ప్రజల కోసం పాటుపడతామన్న ఆమె... తెలంగాణ ఉద్యమం నుంచీ తమ కుటుంబం బంగారు తెలంగాణ కోసమే పనిచేస్తోందని అన్నారు.

mp kavitha, kavita, bjp, nizamabad, trs, telangana news, telangana updates, bjp mp, కిషోర్, కవిత, నిజామాబాద్, ఎంపీ, టీఆర్ఎస్, తెలంగాణ వార్తలు, తెలంగాణ న్యూస్, తెలుగు వార్తలు,
కిషోర్ కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న కవిత


కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో... నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థిని ప్రజలు గెలిపించుకున్నట్లు కనిపిస్తోందన్న కవిత... ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు.

mp kavitha, kavita, bjp, nizamabad, trs, telangana news, telangana updates, bjp mp, కిషోర్, కవిత, నిజామాబాద్, ఎంపీ, టీఆర్ఎస్, తెలంగాణ వార్తలు, తెలంగాణ న్యూస్, తెలుగు వార్తలు,
కిషోర్ కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న కవిత


నిజామాబాద్ అభివృద్ధికి టీఆర్ఎస్ కట్టుబడి ఉందన్న ఆమె... తాను నిజామాబాద్‌కి చెందిన దాన్ని అనీ, నిజామాబాద్ వీడే ప్రసక్తే లేదనీ అన్నారు. మరోవైపు త్వరలో జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కవిత... అసెంబ్లీ స్థానానికి పోటీ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

 

ఇవి కూడా చదవండి :

కులం పేరుతో ర్యాగింగ్... ముంబైలో లేడీ డాక్టర్ ఆత్మహత్య...

టీడీపీలో 'కుల'కలం.. వైసీపీకి జైకొట్టిన బీసీలు... దెబ్బకొట్టిన జనసేన...

టీడీపీలో చంద్రగ్రహణం... ఇంట్లోంచీ బయటకు రాని చంద్రబాబు... మహానాడు వాయిదా....

గతాన్ని తవ్వుతారా... భవిష్యత్తును రచిస్తారా... జగన్ గురి ఎటు?
First published: