తెలంగాణ (telangana) బైపోల్ వేడి రోజురోజుకు పెరుగుతుంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkata Reddy) తలనొప్పిగా మారారు. తమ్ముడు రాజగోపాల్ రెడ్డిపై (Komatireddy Rajagopal Reddy) ప్రచారానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విముఖత వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు బైపోల్ షెడ్యూల్ వచ్చినప్పటి నుండి వెంకట రెడ్డి (Komatireddy Venkata Reddy) వ్యవహారం కాంగ్రెస్ కు చుక్కలు చూపిస్తుంది.
ఇక తాజాగా మునుగోడులో ప్రచారంపై కోమటిరెడ్డి వెంకట రెడ్డి (Komatireddy Venkata Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. నేను హోంగార్డును. మునుగోడు ప్రచారానికి హోంగార్డులు వెళ్లరు ఎస్పీలే వెళ్తారని ఎద్దేవా చేశారు. 100 కేసులు పెట్టిన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) ను ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి తెస్తామని ఓ నాయకుడు అన్నారు. ఇప్పుడు అదే వ్యక్తి మునుగోడులోను గెలిపిస్తాడని వెంకటరెడ్డి (Komatireddy Venkata Reddy) అన్నారు. ఇక కడియం శ్రీహరి గురించి మాట్లాడే స్థాయి నాది కాదు..రాజయ్యను అడగాలన్నారు. ఇక నేను విదేశాలకు ఎప్పుడు వెళ్ళాలి అనేది కేటీఆర్ ను అడగాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా గాంధీభవన్ లో ఓటు వేసేందుకు వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక మునుగోడు బైపోల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతికి టికెట్ కేటాయించారు. ఇప్పటికే ఇంటింటికి ప్రచారం నిర్వహించి ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరపున బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో అన్నీ పార్టీలు ప్రచార రంగంలోకి దిగాయి. ప్రతి అభ్యర్ధి తరపున ఆయా పార్టీల నేతలు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. అయితే కొన్ని గ్రామాల్లో అధికార పార్టీకి నియోజకవర్గ ఓటర్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది. ఓ గ్రామంలో ఇంటి గేటుకు దయచేసి మా ఇంటికి ఓట్లు అడగటానికి రావొద్దని బోర్డులు పెట్టడం, ఇంటి యజమానులు మేం టీఆర్ఎస్కే ఓటేస్తామని చెబుతున్నారు. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకునేందుకు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పాల్వాయి స్రవంతి నామినేషన్ వేసిన మరుక్షణం నుంచి గడపగడపకు తిరిగి నేను మీ ఇంటి బిడ్డను మీ ఓటు నాకే వేయండి..మీ బిడ్డను గెలిపించండి అంటూ అడుగుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Komatireddy venkat reddy, Munugodu By Election, Telangana