తెలంగాణ

  • Associate Partner
  • diwali-2020
  • diwali-2020
  • diwali-2020

Hyundai Elite i20: దీపావళికి లాంచ్ అవుతున్న హ్యూందయ్ ఎలైట్ ఐ20... ఇవీ ఫీచర్లు

Hyundai Elite i20 Car: స్టైలిష్ లుక్ విషయంలో హ్యూందయ్ కార్లు ఎప్పుడూ ముందుంటాయి. ఎలైట్ i20 కూడా స్పోర్టీ లుక్‌తో వస్తోంది. దీనిపై కొనుగోలుదారులు ఆసక్తిగా ఉన్నారు.

news18-telugu
Updated: October 27, 2020, 12:37 PM IST
Hyundai Elite i20: దీపావళికి లాంచ్ అవుతున్న హ్యూందయ్ ఎలైట్ ఐ20... ఇవీ ఫీచర్లు
దీపావళికి లాంచ్ అవుతున్న హ్యూందయ్ ఎలైట్ ఐ20... ఇవీ ఫీచర్లు (photo credit - twitter)
  • Share this:
Hyundai Elite i20 Car: హ్యూందయ్ కంపెనీ తయారుచేసిన ఎలైట్ i20 ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇప్పటికే ఈ కారుపై చాలా అంచనాలున్నాయి. ఫస్ట్ లుక్ తర్వాత... క్యూరియాసిటీ మరింత పెరిగింది. దీపావళి లేదా... అంతకంటే ముందే దీన్ని లాంచ్ చేస్తామని కంపెనీ తెలిపింది. ప్రధానంగా ఈ కారు స్టోర్టీ లుక్‌తో ఉంటుంది. అందువల్ల ఫీచర్లు కూడా అదిరే రేంజ్‌లోనే ఉంటాయి. అందువల్ల ధర కూడా ఎక్కువగానే ఉంటుందనే అంచనా ఉంది. ఇప్పటివరకూ కంపెనీ ఈ కారు ధర ఎంత ఉండొచ్చన్నది చెప్పలేదు. ఐతే... చిన్నకార్ల సెగ్మెంట్ కాబట్టి... దీని ధర రూ.6 లక్షలకు దగ్గర్లో ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ హ్యూందయ్... రిలీజ్ చేసిన కార్ల ఫీచర్లు, డిజైనింగ్, సైల్స్ విషయంలో కొత్తదనం చూపించింది. అందువల్లే ఎలైట్ i20 కూడా అంచనాలను అందుకోగలదంటున్నారు.

Hyundai Elite i20 ఫీచర్లు:

ఈ కొత్త ఎలైట్ i20 ఫొటోలను చూస్తే... హ్యాచ్‌బ్యాక్ స్టోర్టీ లుక్‌తో ఉన్నట్లు స్పష్టమవుతుంది. దీనికి స్లీక్ LED DRLs ఉన్నాయి. హెడ్‌లైట్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఏర్పాటు చేశారు. ట్రయాంగ్యులర్ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌తో షార్క్ ఫిన్ యాంటెన్నా ఉంది. అలాగే డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. టైల్ ల్యాంప్స్, రిప్లెక్టర్స్, క్రోమ్ స్టెప్స్ ఫీచర్లుగా ఉన్నాయి. కారు క్యాస్‌కేడ్ డిజైన్, ఫ్రంట్ గ్రిల్స్ చూడటానికి షార్ప్‌గా స్పోర్టీలుక్‌తో ఉన్నాయి. అదే సమయంలో... వెనకవైపు అదిరిపోయే వైపర్స్ ఉన్నాయి. ఫలితంగా వానాకాలంలో వెనక వచ్చే వాహనాలకు ఇబ్బంది కలుగకుండా చెయ్యవచ్చు.

The Interior of Hyundai Elite i20:
ఈ సరికొత్త ఎలైట్ i20 ఇంటీరియర్ చూస్తే... క్యాబిన్ లేఅవుట్... ఇంటర్నేషనల్ స్పెసిఫికేషన్లతో అద్భుత మోడల్‌తో ఉంది. కంపెనీ ఈ కారులో వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ సిస్టం, 17.17cm టచ్ స్క్రీన్, IPS డిస్‌ప్లే, AVN సిస్టం ఏర్పాటు చేసింది. సెక్యూరిటీ ఫీచర్ చూస్తే... దీనికి పార్కింగ్ సెన్సార్ ఆప్షన్ ఉంది. అలాగే... వెనకవైపు రియర్ వ్యూ కెమెరా, ABS, EBD ఉన్నాయి.

Engine of Hyundai Elite i20:
ఇంజిన్ విషయానికి వస్తే... న్యూ జనరేషన్ హ్యూందయ్ i20కి... వెన్యూ కారుకు ఉన్నంత పవర్‌నే దీనికీ ఇస్తున్నట్లు తెలిసింది. అంటే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్... ఇది... 83hp పవర్, 113NM టార్క్ ఇస్తుంది. దీనికి 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది. అది 120 hp పవర్, 172NM టార్క్ ఇస్తుంది. అలాగే... డీజిల్ మోడల్‌కి 1.5 లీటర్ల ఇంజిన్ ఆప్షన్ ఉంది. అది 100 hp పవర్, 240 Nm టార్క్ ఇస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, AMT, iMT, 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటింగ్ వంటివి మోడల్‌ని బట్టీ ఉన్నాయి.
Published by: Krishna Kumar N
First published: October 27, 2020, 12:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading