Home /News /telangana /

HYDROGEN GAS LEAKAGE IN KTPS THERMAL PLANT OF TELANGANA AK

Gas Leak: తెలంగాణలోని థర్మల్ ప్లాంట్‌లో హైడ్రోజన్ గ్యాస్ లీక్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gas Leak: కేటీపీఎస్‌లో గ్యాస్ లీక్ కావడంతో అక్కడున్న సిబ్బంది ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు.

    తెలంగాణలోని పాల్వంచలో ఉన్న కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (కేటీపీఎస్‌)లోని 9వ యూనిట్‌ టర్బో జనరేటర్‌లో హఠాత్తుగా హైడ్రోజన్‌ గ్యాస్ లీకైంది. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇంజినీర్లు, సిబ్బంది, ఇతర ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. ఊహించని ఈ పరిణామంతో చాలామంది భయపడి అక్కడి నుంచి పరుగులు తీశారు. మరికొందరు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. అయితే గ్యాస్ లీకేజీ పాయింట్‌ను గుర్తించి మరమ్మత్తులు చేస్తున్నారు. అసలు గ్యాస్ లీకేజీ ఎందుకు జరిగిందనే దానిపై కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

    తెలంగాణ రాష్ట్రానికే తలమానికం లాంటి కేటీపీఎస్‌లో పది యూనిట్ల ద్వారా విద్యుత్‌ ఉత్పాదన చేస్తున్నారు. ఇక్కడ వేల మంది సిబ్బంది షిఫ్టుల్లో పని చేస్తుంటారు. ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా సంస్థ అంతర్గత మోనిటరింగ్‌ జరుగుతునే ఉంటుంది. అయితే తాజాగా జరిగిన ఈ ఘటన ఉద్యోగులను తీవ్ర ఉలికిపాటుకు గురిచేసింది. గత రెండు నెలలుగా మరమ్మతులు చేస్తుండడంతో, అక్కడే విషవాయువు లీకైనట్టు చెబుతున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Gas leak, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు