HYDERBAD POLICE FACED INTRESTING REQUEST FROM CYBER CRIMININALS VRY
Cyber crime : నగర పోలీసులకు వింత అనుభవం.. డబ్బు కావాలా... నిందితులు కావాలా.. అంటూ ఆఫర్..
ప్రతీకాత్మక చిత్రం
Cyber crime : ఆర్థిక నేరాలను విచారణ చేస్తున్న హైదరాబాద్ పోలీసులకు ఓ వింత సంఘటన ఎదురైంది. డబ్బును దోచుకున్న సైబర్ నేరగాళ్లు.. పోలీసులకు పట్టుబడడంతో ... కాళ్లబేరానికి వచ్చారు.. అరెస్ట్ చేస్తే ఏమస్తుంది... దోచుకున్న డబ్బును తిరిగి ఇస్తామంటూ అయిదు నిమిషాల్లో ఆ డబ్బును తీసుకువచ్చి ఇచ్చారు..
ఆర్థిక నేరాల్లో నిందితులకు శిక్షలకు శిక్షలు విధించడంతో పాటు.. వారి నుండి డబ్బులు రికవరి చేయడం పోలీసుల బాధ్యత... కాని ఒకవేళ డబ్బులు రికవరీ కాలేకపోయినా వారికి సరైన శిక్షల వేసేందుకు ప్రయత్నాలు చేస్తారు.. కాని సైబర్ క్రైంలో పట్టుబడిన నిందితులు ఎక్కువమంది ఉన్నారు.. వారు దోపిడి చేసింది 30 లక్షలు అందుకోసం 30 మంది వరకు పలు రకాలుగా బాధితులను మోసగించి డబ్బును దోచుకున్నారు.. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను పట్టుకోవడంతో.. పోలీసులకు , పట్టుబడ్డ నిందితులకు జరిగిన సంభాషణ చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించిన రాచకొండ పోలీసులు.. జార్ఖండ్ నుంచే
తతంగమంతా నడుస్తున్నట్టు రహస్యంగా సమాచారం సేకరించారు. రెండు బస్సుల్లో అక్కడికి వెళ్లి రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో బాధితుల డబ్బు కొల్లగొట్టిన 30 మందిని గుర్తించారు. వారందర్నీ అదుపులోకి తీసుకొని, హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా..
ఓ ఐదుగురు సభ్యుల గ్యాంగ్ లీడర్ పోలీసుల వద్దకు వచ్చి తమ వాళ్లను వదిలేయాలని అడిగాడు. కుదరదని, న్యాయబద్ధంగా చూసుకోవాలని పోలీసులు స్పష్టంచేశారు.దీంతో.. సర్ మీరు కేసులు పెట్టి జైలుకు పంపితే బాధితులకు న్యాయం జరుగదు. బాధితులకు న్యాయం జరగాలంటే మావాళ్లు కొట్టేసిన నగదును తిరిగి ఇచ్చేస్తామంటూ ఓ గ్యాంగ్ లీడర్ పోలీసులతో మంతనాలు జరిపాడు.. చాయిస్ మీదే అంటు చెప్పాడు.. డబ్బులు కావాలా ..? కేసులు కావాలా అంటూ పోలీసులతో చర్చించాడు.. దీంతో ఆలోచనలో పడిన పోలీసులు ఆ గ్యాంగ్ చేసిన నేరాలు, ఫిర్యాదులను పరిశీలించి, సేకరించిన ఆధారాలతో ఆ ఐదుగురు రూ.33 లక్షలు కొట్టేశారని పోలీసులు గుర్తించారు. విషయం చెప్పటంతో ఆ ముఠా గ్యాంగ్ లీడర్ ఐదు నిమిషాల్లోనే డబ్బంతా తీసుకొచ్చి పోలీసుల ముందు పెట్టాడు. బాధితులకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఆ డబ్బును రికవరీ చేసిన రాచకొండ పోలీసులు..
నేరాలకు సంబంధించిన సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మిగతా 25 మందిని నగరానికి తీసుకొచ్చి రిమాండ్‌కు పంపారు. దీనిపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కాగా గతంలో కూడా రాజస్థాన్‌కు చెందిన ఓ దోంగ పోలీసుతో ఏకంగా ఫోన్లో సంబాషన జరిపాడు.. పోలీసులకే సవాల్ విసిరాడు.. పోలీసులు రాజస్థాన్‌లో ఎక్కడ ఉంది.. ఎం చేస్తున్నది పూస గుచ్చినట్టు వివరించాడు. అంతే కాదు.. దొంగను వెతుకుంటూ వచ్చినందుకు తానే వారికి భోజనం పెట్టి్స్తానని ఆఫర్ కూడా ఇచ్చాడు.. మరోవైపు పోలీసులు వెతికితే తాను పట్టుబడనని ..తనకు తానుగా లోంగిపోతే తప్ప అరెస్ట్ చేయలేరని స్పష్టం చేశాడు దీంతో ఆ వార్త సైతం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.