హోమ్ /వార్తలు /తెలంగాణ /

Khammam హైదరాబాద్ ఏయిర్ పోర్టులో.. కోవిడ్ టెస్టు పేరుతో దండుకుంటున్నారని ఓ ప్రయాణికుడి ఆవేదన.. !

Khammam హైదరాబాద్ ఏయిర్ పోర్టులో.. కోవిడ్ టెస్టు పేరుతో దండుకుంటున్నారని ఓ ప్రయాణికుడి ఆవేదన.. !

Khammam : కరోనా టెస్టుల పేరుతో జీఎంఆర్ ఎయిర్‌పోర్టు అధికారుల అక్రమ దందా...? బాధితుడి ఫిర్యాదు

Khammam : కరోనా టెస్టుల పేరుతో జీఎంఆర్ ఎయిర్‌పోర్టు అధికారుల అక్రమ దందా...? బాధితుడి ఫిర్యాదు

Khammam : అత్యవసరంగా వెళ్లే విమాన ప్రయాణికులు, హైదరాబాద్ ఎయిర్‌పోర్టు వైద్యాధికారులు, ప్రభుత్వ సెక్యూరిటి సిబ్బంది.. సంబంధిత ఎయిర్‌లైన్స్ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడంతో మానసిక ఆందోళనకు గురి అవుతున్నామని..,గుర్తింపు పొందిన ల్యాబ్‌ రిపోర్టులు కాదని.. స్పాట్‌లోనే టెస్టు కోసం ఒత్తిడి తెస్తున్నారంటూ ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇంకా చదవండి ...

  జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్‌, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా

  అమెరికా వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడు,  హైదారాబాద్ ఇంటర్‌నేషనల్ ఎయిర్ పోర్టులో  అధికారులు, కరోనా టెస్టు పేరుతో చేసిన హంగామాను మీడియాకు వివరించాడు. గుర్తింపు పొందిన ల్యాబ్‌ల నుండి కరోనా టెస్టు చేయించుకున్నా...వాటిని కాదని బలవంతంగా ఏయిర్‌పోర్టులోని వైద్య విభాగం చేత  తిరిగి టెస్టులు చేయిస్తూ...అధిక డబ్బులు గుంజుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బుతోపాటు మానసిక వేదనకు కూడా గురి చేస్తున్నట్టు ఆయన వెల్లడించాడు. అయితే...ఎయిర్‌పోర్టు లో చేసిన రిపోర్టులు కనీసం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కూడా చెల్లుబాటు కాకపోవడంపై.. ఆ ప్రయాణికుడు అనుమానాలు వ్యక్తం చేశాడు. మరోవైపు అమెరికా ఏయిర్‌పోర్టులో అయితే.. కనీసం టెస్టు రిపోర్టు కూడా అడగడం లేదని వివరించాడు..మొత్తం మీద ఏయిర్‌పోర్టులో వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం..ముఖ్యంగా సీఐఎస్ఎఫ్ , ఇండియన్ ఎయిర్ లైన్స్ విభాగాలతో  కరోనా టెస్టుల పేరు మీద ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ భాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

  దీంతో ఏయిర్‌పోర్టులోపల  జరిగిన అంశాలపై మీడియాకు ఆడియోతో పాటు అడియో రికార్డ్‌ను పంపాడు.

  బాధితుడి వివరాల ప్రకారం "నా పేరు బయ్యన బాబురావు ఖమ్మం జిల్లా,.. అమెరికాలో ఉంటున్నాను.  తన తల్లిని చూడ్డానికి ఇటివల ఖమ్మం చేరుకున్నాను. మళ్లీ తిరిగి యూఎస్‌ వెళ్లడానికి టికెట్‌ బుక్‌ చేసుకుని.. జూలై ఒకటిన నేను హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాను. అప్పటికే నేను ఇంటర్నేషనల్‌ ప్రయాణికులకు అవసరమైన ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ చేయించుకున్నా. నెగెటివ్‌ వచ్చింది. అదీ కూడా ఐసీఎంఆర్‌ గుర్తింపు ఉన్న ఖమ్మంలోని మమత జనరల్‌ ఆసుపత్రిలో టెస్ట్‌ చేయించుకున్నా. వాళ్లిచ్చిన రిపోర్టులో క్యూఆర్‌ కోడ్‌ కూడా ఇచ్చారు. ఎక్కడైనా దాన్ని చూసే వెసులుబాటు ఉంది. నేను ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్తూనే అక్కడి ఎయిర్‌ ఇండియా స్టాఫ్‌ డిమాండ్‌ మేరకు నా పాస్‌పోర్టు ఇంకా ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ రిపోర్టు చూపాను. రిపోర్టులోని క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయగానే వాళ్ల ఫోన్‌లోకి నా వివరాలు వచ్చాయి. కానీ.. పీడీఎఫ్‌ ఫార్మాట్‌లోకి రాలేదు.

  దీంతో నా రిపోర్టును వాళ్లు నిరాకరించారు. అవసరమైతే నా రిపోర్టు జెన్యూనిటీపై ఖమ్మంలోని ల్యాబ్‌ వాళ్లతో మాట్లాడిస్తానన్నా కాదన్నారు. కనీసం వాళ్ల పై అధికారులతో మాట్లాడుతనని చెప్పాను. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. పైగా ఇలాగైతే మిమ్మల్ని విమానంలోకి అనుమతించలేమని ఎయిర్‌లైన్స్ అధికారులు  బెదిరించారు. అవసరమైతే ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి ఉంటుందని భయానికి గురిచేశారు. దీంతో జీఎంఆర్‌లో ఉన్న ప్రభుత్వ  సెంటర్‌లో టెస్ట్‌ చేయించుకుంటే ముప్పావుగంటలో రిపోర్టు ఇస్తారని చెప్పారు. నాకు విధిలేని పరిస్థితుల్లో అక్కడ టెస్ట్‌ చేయించుకున్నాను. అక్కడే ఎందుకన్న ప్రశ్నకు సరైన వివరణ ఇవ్వలేదు. సరికదా మా దగ్గర చేయించుకున్న టెస్ట్‌లో నెగెటివ్‌ వస్తేనే ప్రయాణం సాధ్యమని తేల్చిచెప్పారు. వేరే దారిలేక నేను టెస్ట్‌కు రెడీ అయ్యాను. కానీ కేవలం ఐదొందలతో అయిపోయే టెస్ట్‌కు వాళ్లు మాత్రం ఆరువేలు ఛార్జి చేశారు.

  అదేంటి అంటే చెప్పే దిక్కులేదు. పైగా స్వాబ్‌ కూడా ముక్కు, నోటి నుంచి తీసుకోవాల్సి ఉన్నా.. కేవలం ఒక ముక్కు నుంచే సేకరించారు. అదీ ఏదో మమ అనిపించినట్టే నాకనిపించింది. ఇక ఈ హడావుడి అయిపోయి తీరా ఫ్లైట్‌ టేకాఫ్‌ అయి.. ఢిల్లీలో ల్యాండ్‌ అయినపుడు అక్కడి ఎయిర్‌ ఇండియా అధికారులకు నేను జీఎంఆర్‌ వాళ్లు చేసి ఇచ్చిన టెస్ట్‌ రిపోర్టును చూపాను. వాళ్లు నోనో.. ఇది కాదు. మీ దగ్గర ఇంకేమైనా ఉన్నాయా అంటూ వాకబు చేశారు. నేను ఖమ్మంలో చేయించుకున్న టెస్ట్‌ రిపోర్టు ఇవ్వగానే స్కాన్‌ చేసి.. దిసీజ్‌ గుడ్‌ అంటూ నన్ను ప్రోసీడ్‌ కానిచ్చారు. ఐసీఎంఆర్‌ గుర్తింపు ఉన్న ఖమ్మం ఆసుపత్రి వాళ్లు ఇచ్చిన రిపోర్టునే కన్సిడర్‌ చేశారు. అసలు జీఎంఆర్‌ వాళ్లు చేసిన టెస్ట్‌ను అంగీకరించలేదు.

  దీంతో నాకు ఏదో మోసం జరుగుతోందని అర్థం అయింది. కేవలం ఇంటర్నేషనల్‌ ప్రయాణికులను టార్గెట్‌ చేస్తూ వాళ్ల నుంచి తలా ఒక్కింటికి ఆరువేలు లాగేస్తున్నారు. ఇది దారుణం. మోసం. దగా. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్లాల్సి ఉంది. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. అసలు కేవలం ఐదొందలకు చేసే ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌కు అక్కడ ఆరువేలు తీసుకోవడం ఎంత దోపిడీ అనేది అర్థం చేసుకోవాల్సి ఉంది. పైగా ఇదంతా పూర్తిచేసుకుని నేను శాన్‌ఫ్రాన్సిస్కోలో (యూఎస్‌) ఫ్లైట్‌ దిగగానే మేమంతా రిపోర్టులు చేతుల్లో పట్టుకుని వరుసగా వెళ్తుంటే అక్కడి అధికారులు మా వద్ద ఉన్న ఏ రిపోర్టు అక్కర్లేదని నిక్కచ్చిగా చెప్పారు. మీరు మాకు ఎలాంటి రిపోర్టులు చూపక్కర్లేదని అనౌన్స్‌మెంట్‌ చేశారంటే ఇండియాలో ఏ రకంగా కరోనా టెస్ట్‌ల పేరిట దోపిడీ జరుగుతోందో అర్థం అవుతోంది.

  ఇదీ నాకు హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఎదురైన చేదు అనుభవం." ఒక ప్రభుత్వ సంస్థ గుర్తింపు ఉన్న ల్యాబ్‌ ఇచ్చిన రిపోర్టును రిజెక్ట్‌ చేసి.. పీడీఎఫ్‌ రాలేదని చెబుతూ మళ్లీ అక్కడ టెస్ట్‌ చేయించి ఆరువేలు వసూలు చేయడం నన్ను మానసికంగా చాలా బాధించింది. దీనిపై సంబంధిత అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. నాలాగా చాలామంది ఇలా వరుసలో నిలబడి ఆరువేలు చెల్లించి అక్కర్లేని టెస్టులు బలవంతంగా చేయించుకున్నారు. పైగా ఎయిర్‌ఇండియాకే చెందిన మరొక అధికారి వాళ్ల వద్ద ఉన్న రిపోర్టులు సరిపోతాయంటూ అక్కడ ఉన్న వాళ్లతో ఆర్గ్యుమెంట్‌ కూడా చేశారు. అయినా అక్కడి వాళ్లు వినలేదు. దీన్ని బట్టి ఇది ఆర్గనైజ్డ్‌గా నడుస్తోందని అర్థం అవుతోంది.


  దీనిపై ప్రభుత్వం సత్వరం విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలి. ఇంటర్నేషనల్‌ ట్రావెల్‌ చేసే ప్రయాణికులను దోపిడీకి గురికాకుండా కాపాడాలి. ఇక్కడ డబ్బు కోణం మాత్రమే కాదు.. ఎంతటి హైరానాకు గురిచేశారంటే చెప్పలేను. రిపోర్టును కాదని ఒకరు.. ఓకే అని మరొకరు మాట్లాడుతూ కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నారు. పేరుకు ఆర్టీపీసీఆర్‌ అని ఆరువేలు వసూలు చేసి.. చేసేది మాత్రం ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్.. ఇచ్చేది కూడా జెన్యూన్‌ రిపోర్ట్‌ కాదని అర్థం అవుతోంది. ఇది క్షంతవ్యం కాదు. దీనిపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇలా ఎయిర్‌పోర్ట్‌లో జరుగుతున్న అక్రమాలపై నేను స్పందించాను.

  అయితే ..  "జీఎంఆర్ ఎయిర్ పోర్టులో చేస్తున్న  కోవిడ్ టెస్టులకు, జీఎంఆర్ యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేదని ,జీఎంఆర్  కార్పోరేట్ కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ ఇంచార్జ్..  సంగీత స్పష్టం చేశారు." కోవిడ్ నిబంధనలకు సంబంధించిన టెస్టులు ఏయిర్ పోర్టులోని  వైద్యవిభాగంతోపాటు సంబంధిత ఎయిర్‌లైన్స్ కు చెందిన వ్యవహారం అని ఆమె పేర్కోన్నారు.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Khammam

  ఉత్తమ కథలు