• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • HYDERABADEE BOOKED IN DATING WEBSITE AND LOST RS 5 45 LAKHS NK

డేటింగ్ పేరుతో చీటింగ్... అందమైన అమ్మాయిలను వల వేసి...

డేటింగ్ పేరుతో చీటింగ్... అందమైన అమ్మాయిలను వల వేసి...

మూడేళ్ల క్రితం ఆమె భర్త చనిపోయాడు. దీంతె ఇద్దరు పెద్ద అమ్మాయిలను తన దగ్గర ఉంచుకొని మూడో కూతురూ ఆశ(పేరు మార్పు) తన తల్లిగారింట్లో పెట్టింది. అమ్మమ్మ దగ్గర ఉంటున్న చిన్న కూతురు బీఏ చదువుతోంది.

Hyderbad Crime : అమ్మాయిల ఫొటోలు చూడగానే... సమ్మర్‌లో ఐమ్ క్రీమ్‌లా కరిగిపోయాడు. అతని వీక్‌నెస్‌ని వాడేసుకుంటూ... క్యాష్ కొట్టేశారు.

  • Share this:
డేటింగ్ వెబ్‌సైట్ల గురించి మీకు తెలిసే ఉంటుంది. ఓ అందమైన అమ్మాయిని వెబ్‌సైట్ మెయిన్ పేజీపై ఉంచి... మీకు నచ్చిన అమ్మాయిని ఎంచుకోండి, ఫ్రెండ్షిప్ చెయ్యండి, డేటింగ్‌కి వెళ్లండి అంటూ ఊరిస్తాయి. ఇలాంటి చూసీ చూసీ ఇవన్నీ చీటింగ్ వెబ్‌సైట్లు అని జనం ఏనాడో వాటిని పక్కన పెట్టేశారు. హైదరాబాద్... నల్లగండ్లలోని ఆ ప్రభుత్వ ఉద్యోగి మాత్రం ఇదివరకెప్పుడూ ఇలాంటి సైట్లను చూడకపోవడంతో... అడ్డంగా బుక్కైపోయాడు. అసలేం జరిగిందంటే... ఓ డేటింగ్ వెబ్ సైట్ నుంచీ ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. రోజూ ఉద్యోగం చేసి అలసిపోతున్నారా... రిలాక్స్ కావాలా... అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేసే ఛాన్స్, డేటింగ్‌కి కూడా వెళ్లొచ్చు... ఇలాంటి ఛాన్స్ అందరికీ రాదు... మీరే డైరెక్టుగా అమ్మాయిలతో మాట్లాడి డేటింగ్‌కి వెళ్లొచ్చని కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు. మొదట వద్దంటూనే... అలాంటి కాల్స్ రెండు మూడు వచ్చాక... కనెక్ట్ అయ్యాడాయన.

గురుడు లైన్‌లోకి వచ్చాడని డిసైడైన గ్యాంగ్... ముందుగా తమ వెబ్‌సైట్‌లో సైన్ ఇన్ అవ్వాలని చెప్పింది. తీరా అందులోకి వెళ్లాక... రిజిస్ట్రేషన్ కోసం రూ.1,030 చెల్లించాలంటూ ఓ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇచ్చారు. తనకు వచ్చే శాలరీతో పోల్చితే రూ.1030 పెద్ద ఎక్కువేమీ కాదులే అనుకున్నాడు. డబ్బు పంపాడు. రెండు గంటల తర్వాత ఈమెయిల్ వచ్చింది. మీ రిజిస్ట్రేషన్ పూర్తైంది. మీకు నచ్చిన అమ్మాయిని ఎంచుకోండి... అంటూ కొందరు అమ్మాయిల ఫొటోలు పంపారు. ఓ అమ్మాయిని ఎంచుకున్నాడు. కత్తి లాంటి అమ్మాయిని ఎంచుకున్నారు మీరు. మీ టేస్ట్ అదిరింది. అంటూ... మీకు ఐడీ కార్డ్ ఇస్తున్నాం... దాని వల్ల మీరు రెగ్యులర్‌గా వేర్వేరు అమ్మాయిలను ఎంచుకోవచ్చు అన్నారు. నిజమే అనుకున్నాడు. ఐడీ కార్డ్ కోసం రూ.29,900 వేలు అడిగారు. లీగల్ డీల్ కదా... ఓ ఏడాది పాటూ వేర్వేరు అమ్మాయిలను ఎంచుకోవచ్చు అనుకున్నాడు. ఆ డబ్బు కూడా చెల్లించాడు.

అమ్మాయిలతో మీరు డేట్‌కి వెళ్తే, పోలీసులు లేనిపోని కేసులు పెట్టే ఛాన్స్ ఉంది. ఏ హోటల్ లోనో మీరు అమ్మాయితో దొరికితే... మీ నుంచీ 2, 3 లక్షలు లాగేస్తారు. మీకు అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తాం. అందుకోసం రూ.53వేలు ఇవ్వండి. మా దగ్గర ప్రత్యేక నెట్ వర్క్ పనిచేస్తుంది. మీకు ఏ సమస్యా రానివ్వదు అని అన్నారు. నిజమే పోలీసులకు దొరికితే ఇబ్బందే అనుకున్న ఆయన... ఆ డబ్బు కూడా చెల్లించాడు. అంతా అయిపోయింది. చివరిగా మీరు ఎక్కువ కాలం డేటింగ్ చేస్తారన్న గ్యారెంటీ ఉండాలి. మీ కోసం మేం చేయాల్సింది చాలా ఉంటుంది. సో, కన్ఫర్మేషన్ కోసం మీరు ఫైనల్‌గా రూ.37,500 ఇవ్వండి అని అడిగితే... ఇన్నిసార్లు ఎందుకడుగుతున్నారు... ఇదిగో... ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇక ఒక్క రూపాయి కూడా ఇవ్వను అంటూ ఆ డబ్బు కూడా ఇచ్చాడు.

మూడ్రోజుల్లో మొత్తం రూ.5.45 లక్షల రూపాయలు లాగేశారు. డబ్బు చెల్లించాక, కాల్ చేస్తే, స్విచ్ఛాఫ్ అని వచ్చింది. ఆ వెబ్ సైట్ కూడా క్లోజ్ అయిపోయింది. బాధితుడికి మైండ్ బ్లాంకైంది. ఇలా ఎందుకు చేశారంటూ మెయిల్ పంపితే... డీల్ కేన్సిల్ చేసుకోవాలంటే మరో రూ.65 వేలు ఇవ్వండి అని అడిగారు అవతలి నుంచీ హ్యాకర్లు. అప్పటికి అర్థమైంది ఆయనకు తాను మోసపోయానని. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును డీల్ చేస్తున్నారు. బట్... మోసగాళ్లు హ్యాకర్లు కావడం వల్ల వాళ్లు దొరుకుతారన్న గ్యారెంటీ లేదు. అసలు వాళ్లు ఇండియాలో లేకపోతే, ఇక వాళ్లను పట్టుకోవడం చాలా కష్టం. డేటింగ్ వెబ్‌సైట్లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.
Published by:Krishna Kumar N
First published:

అగ్ర కథనాలు