హైదరాబాదీ వైసీపీ యువనేతకు టీటీడీలో కీలక పదవి...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ సిటీ యూత్ లీడర్ అమిత్ ఠాకూర్‌ను సలహా కమిటీలో సభ్యుడిగా ఎంపిక చేశారు.

news18-telugu
Updated: March 18, 2020, 6:28 PM IST
హైదరాబాదీ వైసీపీ యువనేతకు టీటీడీలో కీలక పదవి...
తిరుమల శ్రీవారి ఆలయం
  • Share this:
హైదరాబాద్‌కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేతకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక పదవిని ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజరీ కమిటీ - హైదరాబాద్‌‌లో సలహా కమిటీలో సభ్యుడిగా ఎంపిక చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ సిటీ యూత్ లీడర్ అమిత్ ఠాకూర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. మొత్తం 11 మంది సభ్యులను సలహా కమిటీలో ఎంపిక చేశారు. ఆ కమిటీలో తనను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అమిత్ ఠాకూర్ నేడు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటికే హైదరాబాద్‌లో టీటీడీకి ఓ సలహా కమిటీ ఉంది. వారికి అదనంగా ఈ 11 మంది కూడా కమిటీలో సభ్యులుగా ఉంటారు. హైదరాబాద్‌లో టీటీడీ తరఫున చేపట్టబోయే కార్యక్రమాలపై ఈ కమిటీ సలహాలు, సూచనలు అందిస్తూ ఉంటుంది. స్థానిక కమిటీల పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.
First published: March 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading