Home /News /telangana /

HYDERABAD YS VIJAYAMMA INVITE TO ALL KEY LEADERS WHO WILL BE CLOSE ASSOCIATED TO YS RAJASEKHAR REDDY WHAT IS THE REASON BEHIND NGS

YS Vijayamma: వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది..? వైఎస్ హయాంలో మంత్రులకు విజయమ్మ ప్రత్యేక ఆహ్వానం

వైఎస్ కేబినెట్ మంత్రులు, సహచరులకు విజయమ్మ ఆహ్వానం

వైఎస్ కేబినెట్ మంత్రులు, సహచరులకు విజయమ్మ ఆహ్వానం

YS Family Politics: తెలుగు రాజకీయాల్లో కీలక పరిణమాలు చోటు చేసుకోబోతున్నాయా..? తాజాగా వైఎస్ విజయమ్మ తీసుకున్న ఆ నిర్ణయం సంచనాలకు వేదిక అవుతోందా..? అసలు వైఎస్ ఫ్యామిలో ఏం జరుగుతోంది..?

  YSR Family Politics: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ప్రస్తుతం వైఎస్ ఫ్యామిలీ (YS Family) రాజకీయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఏ చిన్న పరిణామం జరిగిన వెనుక ఏదో రాజకీయ కారణం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. అందుకు ప్రస్తుతం జరుగుతున్న ఘటనలే కారణం. ఒకప్పుడు అన్నచెల్లెళ్ల బంధానికి ప్రత్యేక నిర్వచనంగా ఉండేవారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy).. వైఎస్ షర్మిల (YS Sharmila).. కానీ గత కొంతకాలంగా ఇద్దరి మధ్య విబేధాలు మొదలయ్యాయి. అన్న వదిలిన బాణంగా చెప్పుకునే షర్మిల.. అన్న కాదు అన్నా.. ఆయన్ను
  వ్యతిరేకించి తెలంగాణ (Telangana)లో రాజకీయ పార్టీ పెట్టారు. అంతేకాదు నేరుగా జగన్ పైనే విమర్శలు చేశారు. అంతేకాదు తండ్రి వైఎస్ ఆర్ జయంతి (YSR Jayanthi) రోజు జగన్-షర్మిల ఒకరిని ఒకరు ఎదురు పడడానికి కూడా ఇష్ట పడలేదు. ఒకరు అక్కడ ఉన్నారని తెలిసి మరొకరు తమ ప్రోగ్రామ్ ను మార్చుకోవాల్సి వచ్చింది. ఆ వివాదం అక్కడతోనే ముగియలేదు.. ఇద్దరి మధ్య విబేధాలు ఎలా ఉన్నా కచ్చితంగా రాఖీ పండుగ రోజైనా ఇద్దరూ కలుస్తారని వైఎస్ఆర్ అభిమానులు ఆశించారు. కానీ ఇటీవల రక్ష బంధన్ రోజు కూడా షర్మిల నేరుగా జగన్ కు రాఖీ కట్టలేదు. కేవలం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పి చేతులు దులుపుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు నిజమే అని మరోసారి రుజువు అయ్యింది. అయితే ఇదే సమయంలో వైఎస్ విజయమ్మ (YS Vijayamma) నిర్ణయం రాజకీయాల్లో పెను ప్రకంపనలకు వేదిక అవుతుంది అంటూ చర్చలు మొదలయ్యాయి.

  గతంలో ఎన్నడూ లేని విధంగా.. మాజీ సీఎం రాజశేఖర రెడ్డి (YS Rajasekhar Reddy) సతీమణి విజయలక్ష్మి కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ హయంలో మంత్రులుగా పనిచేసిన నేతలకు సమావేశానికి ఆహ్వానం పంపారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వచ్చే సెప్టెంబరు 2న వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా విజయమ్మ హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ సమావేశానికి మాజీ మంత్రులకు ఆహ్వానాలు కూడా అందినట్లుగా తెలుస్తుంది. పార్టీలకు అతీతంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నామని విజయమ్మ ఆహ్వానాలలో తెలపగా వైఎస్ హయాంలో పనిచేసిన మంత్రులతో పాటు సహచరులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది.

  కేవలం కేబినెట్ మంత్రులే కాకుండా.. వైఎస్ కు అత్యంత ఆప్తులు, నమ్మకస్తులు కూడా ఆమె ఆహ్వానించినట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు (KVP Ramachandra Rao), ఉండవల్లి అరుణ్‌కుమార్‌ (Vundavalli Arun Kuarm), ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ (D srinivas) తో పాటు వైఎస్ మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులకు కూడా విజయమ్మ స్వయంగా ఫోన్‌చేసి ఆహ్వానిస్తున్నట్టు తెలిసింది. 2009లో వైఎస్ఆర్ చనిపోగా ఇప్పటి వరకు
  ఆయన వర్ధంతి రోజున జరిగే కార్యక్రమాలకు గతంలో వైఎస్‌తో కలిసి పనిచేసివారిని ప్రత్యేకంగా ఆహ్వానించ లేదు. ఇలా ఆహ్వానించడం ఇదే తొలిసారి. ఇదే ఇప్పుడు పలు రాజకీయ ఊహాగానాలకు అవకాశంగా మారింది.

  ఇదీ చదవండి: ఫోటోలకు పోజులు కాదు.. టీచర్‌గా మారిన ఎమ్మెల్యే రోజా.. విద్యార్థులకు ఏం చెప్పారంటే..?

  వైఎస్ కుటుంబంలో విభేదాలున్నాయని.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో విభేదించి చెల్లి షర్మిల తెలంగాణలో సొంత పార్టీని ఏర్పాటు చేశారని రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చలు జరుగుతుండగా ఇలాంటి సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విజయమ్మ భర్త వర్ధంతి రోజున సమావేశానికి ఆహ్వానాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఉంటూనే విజయమ్మ తెలంగాణలో షర్మిల పార్టీకి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆవిర్భావ సభలో కూడా విజయమ్మ కాంగ్రెస్ పార్టీపై పలు విమర్శలు చేయగా ఇప్పుడు ఆహ్వానం పంపిన వారిలో ఎక్కువ శాతం ఆ పార్టీ నేతలే ఉన్నారు. ఈ సమావేశం ఎలాంటి రాజకీయ
  ప్రకంపనలు సృష్టించనుందన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ షర్మిల పార్టీని బలోపేతం చేయడమే ఈ సమావేశం ముఖ్య ఎజెండానా.. లేకా జగన్ బెయిల్ రద్దు అవుతుందని ఊహాగానాల నేపథ్యంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నారా అన్నదానిపై ఎవరికి వారు కథనాలు అల్లుకుంటున్నారు. వైసీపీ నేతలు మాత్రం ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Ys jagan, YS Vijayamma

  తదుపరి వార్తలు