హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sharmila on Jagan: పార్టీ ప్రకటన తొలి రోజే జగన్ కు షర్మిల రివర్స్ పంచ్.. అన్నపై విమర్శలు..!

Sharmila on Jagan: పార్టీ ప్రకటన తొలి రోజే జగన్ కు షర్మిల రివర్స్ పంచ్.. అన్నపై విమర్శలు..!

రేపే హైదరాబాద్ లో వైఎస్ సంస్మరణ సభ

రేపే హైదరాబాద్ లో వైఎస్ సంస్మరణ సభ

YS Sharmila On Jagan: వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన తొలి రోజే అన్నయ్య సీఎం జగన్ ను టార్గెట్ చేసిందా..? ఇకపై జగన్ పై మాటల దాడి ఇంకాస్త పెంచనున్నారా..?.. చెల్లిపై సీఎం జగన్ పరోక్ష విమర్శలు చేస్తే.. ఆమె నేరుగా అన్నకు కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది..

ఇంకా చదవండి ...

Sharmila Vs Jagan: వైఎస్ రాజకీయ వారసులైన అన్నా చెల్లెల మధ్య వార్ మొదలైందా.. ఇప్పటి వరకు ఇద్డరి మధ్య విబేధాలు ఉన్నాయని వారు వీరు అనడేమే తప్పా.. నేరుగా ఒకరిని ఒకరు విమర్శించుకున్నది కానీ.. పరోక్షంగా కామెంట్లు చేసినది కాని లేదు. కానీ వైఎస్ జయంతి రోజు ఇద్దరి మధ్య విబేధాలు బహిర్గతమయ్యాయి. గత రెండేళ్ల వరకు కలిసి తండ్రికి నివాళులర్పించే అన్నా.. చెల్లి ఇప్పుడు ఎదురెదురు పడడానికి కూడా ఇష్టపడలేదు. అయితే అందుకు వేరే కారణాలున్నాయని వైసీపీ నేతలు విబేధాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేశారు. కానీ ఇటు జగన్, అటు షర్మిల పరోక్ష వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య విబేధాలు నిజమే అని తేలిపోయింది. మొదట తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై తొలిసారి స్పందించిన సీఎం జగన్ పరోక్షంగా షర్మిలపై వ్యాఖ్యానించారు. పక్కరాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టడం ఇష్టం లేదని.. అసలు తెలంగాణ రాజకీయాల్లో తనకు వేలు పెట్టడం ఇష్టం లేదంటూ చెల్లి పార్టీపై పరోక్షంగా విమర్శించారు. ఆ వెంటనే దానికి కౌంటర్ అన్నట్టు షర్మిల కూడా పార్టీ ఆవిర్భావం రోజే అన్నకు పంచ్ లు విసిరారు..


తెలంగాణలో వైఎస్ షర్మిల ఏర్పాటు చేసిన కొత్త రాజకీయ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ వేడుక సందర్భంగా ఆమె అధికార పార్టీపై తీవ్రమైన విమర్శలు చేశారు. అలాగే తన అజెండా ట్రిబుల్ ఎస్ అని చెప్పుకొచ్చారు. అంటే సంక్షేమం, స్వయం సమృద్ది, సమానత్వం అనేదే తన నినాదం అన్నారు. అలాగే ..అప్పులు లేకుండా స్వయం సమృద్ది సాధించడమే పార్టీ లక్ష్యమన్నారు. అయితే ఈ వ్యాఖ్య కేవలం సీఎం కేసీఆర్ ను ఉద్దేశించే కాదు.. అన్న జగన్ కు కూడా వర్తించేలా కామెంట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అప్పులపైనే నమ్ముకుంది. సంక్షేమ పథకాలకు కూడా అప్పులు చేస్తోంది. అందుకే ఆమె ఆ వ్యాఖ్యలు చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అక్కడికే ఆమె పరిమితం అవ్వలేదు. ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై స్పందిస్తూ నేరుగా ఏపీ సీఎం జగన్ కు వార్నింగ్ ఇచ్చారు..

ఇదీ చదవండి: తెలంగాణలో షర్మిల పార్టీపై జగన్ పరోక్ష స్పందన.. ఆయన ఏమన్నారంటే..?

ఏపీ తెలంగాణ మధ్య ప్రస్తుతం జరుగుతున్న నీటి వివాదంపై కూడా షర్మిల స్పందించారు. పార్టీ ఆవిర్భావ వేడుకలో కృష్ణా నదీ జలాల గురించి షర్మిల మాట్లాడారు. కృష్ణా నదిపై రెండు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతూ ఉంటే ఇక్కడ కేసీఆర్ ఇప్పుడే తెలివిలోకి వచ్చారా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటికి ఆహ్వానించి, కౌగిలించుకొని, భోజనాలు పెట్టి, స్వీట్లు తినిపించుకోవచ్చా అని ప్రశ్నించారు. ఇద్దరు కలిసి ఉమ్మడి శత్రువును ఓడించనూ అంటూ చంద్రబాబు పేరును పరోక్షంగా ప్రస్తావించారు. కానీ, నదీ జలాల పంచాయితీపై రెండు నిమిషాలు కూర్చొని మాట్లాడుకోలేరా? రెండు రాష్ట్రాల సీఎంలతో, రెండు నదుల రివర్ బోర్డులతో మీటింగులు తరచూ జరుగుతూనే ఉంటాయి. అయినా ఫలితం లేదు. ఈ పంచాయితీతో సంబంధం ఉన్న వారందరినీ కూర్చొబెట్టి సమస్య పరిష్కరించే బాధ్యత కేంద్రానికి లేదా? అసలు ప్రయత్నం చేయకపోతే వారిని ఎలా నమ్మాలి అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: షర్మిల పొలిటికల్ ఎంట్రీ.. రేవంత్ టీపీసీసీ పదవిపై పవన్ తొలి స్పందన ఇదే..

అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలు కాదా? రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములుగా కలిసుండాలని అనుకున్నాం కదా. మరి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామనే ఉద్దేశం మీకు లేదా? అని నిలదీశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఖరి ఏంటంటే.. గోదావరి నదిపై ఉన్న ప్రాణహిత నుంచి పోలవరం వరకూ... కృష్ణానదిపై ఉన్న జూరాల నుంచి పులిచింతల వరకూ ఏ ప్రాజెక్టు విషయంలోనైనా న్యాయబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చక్క నీటి బొట్టును కూడా మేం వదులుకోం అంటూ అన్నకు జలక్ ఇచ్చారు. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా మేం అడ్డుకోబోమన్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Ys jagan, YS Sharmila, YSR

ఉత్తమ కథలు