హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఫ్లాష్: కేసీఆర్ కుటుంబంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..నాకేం జరిగిన వారిదే బాధ్యత అంటూ..

ఫ్లాష్: కేసీఆర్ కుటుంబంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..నాకేం జరిగిన వారిదే బాధ్యత అంటూ..

షర్మిల ఫైర్

షర్మిల ఫైర్

నర్సంపేటలో YSRTP అధినేత్రి వైఎస్ షర్మిలపై జరిగిన దాడిని తెలంగాణ గవర్నర్ తమిళి సైని కలిసి ఆమె వివరించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ..టీఆర్ఎస్ సర్కార్ పై, కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. YSRTPకి ఆదరణ పెరగడంతో టీఆర్ఎస్ భయపడుతుంది. అందుకే పాదయాత్రను అడ్డుకోవాలని కుట్ర చేశారు. కావాలనే శాంతిభద్రతల సమస్య తీసుకొచ్చారు. నన్ను అరెస్ట్ చేస్తే తప్ప పాదయాత్ర ఆపలేమని అనుకున్నారు. పాదయాత్రను ఆపాలని అనుకోకపోతే రిమాండ్ ఎందుకు అడిగారని షర్మిల ప్రశ్నించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే రిమాండ్ కు పంపిస్తారా అని మండిపడ్డారు. కేసీఆర్ డైరక్షన్ లోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. దేశంలో అత్యంత ధనిక కుటుంబం కేసీఆర్ దే. కవిత, కేటీఆర్ ఇళ్లపై రైడ్స్ చేయాలి. ప్రగతి భవన్ లో దాడి చేస్తే వేల కోట్లు దొరుకుతాయి. కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల ల్యాండ్ వుంది. కాంట్రాక్టు పేరుతో వేల కోట్లు దోచుకున్నారన్నారు. లిక్కర్ స్కాంలో కవిత పేరు ఉందని షర్మిల చెప్పుకొచ్చారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

నర్సంపేటలో YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల (Ys Sharmila)పై జరిగిన దాడిని తెలంగాణ గవర్నర్ తమిళి సైని కలిసి ఆమె వివరించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ..టీఆర్ఎస్ సర్కార్ పై, కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. YSRTPకి ఆదరణ పెరగడంతో టీఆర్ఎస్ భయపడుతుంది. అందుకే పాదయాత్రను అడ్డుకోవాలని కుట్ర చేశారు. కావాలనే శాంతిభద్రతల సమస్య తీసుకొచ్చారు. నన్ను అరెస్ట్ చేస్తే తప్ప పాదయాత్ర ఆపలేమని అనుకున్నారు. పాదయాత్రను ఆపాలని అనుకోకపోతే రిమాండ్ ఎందుకు అడిగారని షర్మిల (Ys Sharmila) ప్రశ్నించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే రిమాండ్ కు పంపిస్తారా అని మండిపడ్డారు. కేసీఆర్ డైరక్షన్ లోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. దేశంలో అత్యంత ధనిక కుటుంబం కేసీఆర్ దే. కవిత, కేటీఆర్ ఇళ్లపై రైడ్స్ చేయాలి. ప్రగతి భవన్ లో దాడి చేస్తే వేల కోట్లు దొరుకుతాయి. కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల ల్యాండ్ వుంది. కాంట్రాక్టు పేరుతో వేల కోట్లు దోచుకున్నారన్నారు. లిక్కర్ స్కాంలో కవిత పేరు ఉందని షర్మిల (Ys Sharmila) చెప్పుకొచ్చారు.

Pawan vs Niranjan Reddy: ఆ విషయం పవన్ కు తెలియదా..? జనసేనానికి తెలంగాణ మంత్రి కౌంటర్..!

నా గతం..వర్తమానం..భవిష్యత్తు ఇక్కడే..

ఇక నేను ఆంధ్రా అని ఆమెకు ఇక్కడ ఏం పని అని అంటున్నారు. నేను చదువుకున్నది, పెరిగింది, పెళ్లి చేసుకున్నది, కొడుకును కన్నది ఇక్కడే. నా గతం..వర్తమానం..భవిష్యత్తు కూడా ఇక్కడే అన్నారు. కేటీఆర్ గారి భార్య ఎక్కడి నుండి వచ్చారు. ఆంధ్రా కాదా అని ప్రశ్నించారు. అంతమాత్రాన మేము విడకులు తీసుకోమని అడుగుతున్నామా అని అన్నారు. ఈ సందర్బంగా కేసీఆర్ , కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత గతంలో చేసిన వ్యాఖ్యలను మీడియా ముందు చూయించారు. ఇక మునుగోడు, హుజురాబాద్ లో టీఆర్.ఎస్ ఎంత ఖర్చు చేసింది. దానిపై ప్రతి ఎమ్మెల్యే, మంత్రి, టీఆర్.ఎస్ నేతలపై విచారణ జరగాలన్నారు. కేసీఆర్ తాళి బన్ ల వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇక నేను పెద్ది సుదర్శన్ రెడ్డిని ఏమనలేదు. ఆయన మగతనంతో నాకేం పని అని చెప్పుకొచ్చారు. తాను కేవలం ట్రాక్టర్ డ్రైవర్ అని మాత్రమే అన్నానన్నారు.

Flash News: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం..ఆ ముగ్గురికి బెయిల్..కానీ..

హైకోర్టు, కేంద్ర హోం శాఖ, సుప్రీంకోర్టుకు లేఖలు..

తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై హైకోర్టు, కేంద్ర హోం శాఖ, సుప్రీంకోర్టు నాయ్యమూర్తులకు లేఖ రాస్తాం అన్నారు. పాదయాత్రలో నాపై కానీ నా మనుషులకు ఏమైనా జరిగితే దానికి కారణం కేసీఆర్ అని ఆరోపించారు. కాగా ఇప్పటికే పాదయాత్రలో జరిగిన దాడిపై గవర్నర్ తమిళి సైకి కూడా లేఖ ఇచ్చినట్లు తెలిపారు.

గవర్నర్ కు షర్మిల లేఖ

వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర నర్సంపేటలో కొనసాగుతుండగా ఆమెపై, ప్రచార రథంపై కూడా టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో ఈ రచ్చ మొదలయింది. ఆ దాడి ఘటనతో పోలీసులు షర్మిలను అరెస్ట్ చేసి లోటస్ పాండ్ లో వదిలేశారు. అయితే ఆతరువాత ఆమె ప్రగతి భవన్ కు వెళ్లే ప్రయత్నం చేయడం, పోలీసులు అడ్డుకోవడం, ఆమె కారులో ఉండగానే క్రేన్ తో పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అనంతరం ఆమెను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. ఆ తరువాత బెయిల్ పై ఆమె బయటకు వచ్చారు. దాడికి సంబంధించి వివరాలను తెలంగాణ గవర్నర్ కు షర్మిల విచారించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

First published:

Tags: CM KCR, Hyderabad, Telangana, Trs, YS Sharmila

ఉత్తమ కథలు