YS Sharmila: ష‌ర్మిళ పార్టీకి వ్యూహాక‌ర్త ఎవరో తెలుసా ? త్వరలోనే క్యాడ‌ర్ కు ప‌రిచ‌యం? ఆమె నేపథ్యం ఇదే 

షర్మిళ రాజకీయ వ్యూహకర్త ప్రియ

ys sharmila: తెలంగాణలో రాజకీయంగా బలపడాలి అనుకుంటున్న వైఎస్ షర్మిళ ఇప్పటికే దూకుడు పెంచారు. ఇందులో భాగంగా తన పార్టీ వ్యూలను ముందుకు తీసుకెళ్లేందుకు వ్యూహ కర్తను ఖరారు చేశారు. ఆమెను ఈ నెల 8నే పార్టీ కేడర్ కు పరిచయం చేస్తారనే ప్రచారం ఉంది? ఇంతకీ ఆమె నేపథ్యం ఏంటి.?

  • Share this:
    దేశ వ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్  ఇప్పుడు ట్రెండ్ సెట్టర్ అయ్యారు. ఆయన బాటలో కొత్త వారు ఎందరో తెరపైకి వస్తున్నారు. రాజ‌కీయ పార్టీల‌కు ఇప్పుడు వ్యూహాక‌ర్త‌లు అవసరంగా  మారిపోయారు. ఇటీవల దేశ వ్యాప్తంగా ఆసక్తి పెంచిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో..  ప‌శ్చిమ బెంగాల్ లో మ‌మ‌త, త‌మిళ‌నాడు లో స్టాలిన్ విజ‌యాల‌కు ఈ వ్యూహాక‌ర్త మెద‌డే ప‌ని చేసింది. అంత ఎందుకు 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహాన్ రెడ్డి అధికారంలోకి రావాడానికి కూడా స‌హాయం చేసింది ఈ వ్యూహార్త వ్యూహాలే. అందుకే రాజ‌కీయ పార్టీలకు వ్యూహాక‌ర్త‌లు ఇప్పుడు త‌ప్ప‌నిస‌రైపోయారు. కొత్తగా పార్టీ లు పెట్టి వారి నుంచి ప్ర‌తిప‌క్ష పార్టీల వ‌ర‌కు అందరూ ఇప్పుడు వ్యూహ‌క‌ర్త‌ల వేట‌లోను ఉంటున్నారు. త‌మ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే మొన‌గాడు ఎవ‌ర‌బ్బాఅని తెగ వెతికెస్తోన్నాయి. తాజా వైఎస్ ష‌ర్మిళ కూడా ఇప్పుడు ఇదే కోవాలోకి చేరిపోయారు అంటున్నాయి లోట‌స్ పౌండ్ వ‌ర్గాలు.

    ఈ నెల 8న పార్టీ జెండ, పేరు ప్ర‌క‌టించ‌డానికి సిధ్ద‌మ‌వుతున్న ష‌ర్మిళ అదే స‌మ‌యంలో తెలంగాణ‌లో త‌మ పార్టీని అధికారంలోకి తీసుకోచ్చేందుకు ఒక వ్యూహ‌క‌ర్తను కూడా  నియ‌మించుకోవాడానికి రెడీ అవుతున్నట్లు స‌మాచారం. ఇందుకోసం త‌న అన్న‌కు అధికారం క‌ట్ట‌బెట్టిన పీకే టీమ్ నుంచి ప్రియ అనే యువ‌తిని త‌న‌కు వ్యూహాక‌ర్త‌గా ఎంపిక చేసుకోవ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు స‌మ‌చారం. ప్రియా గ‌తంలో పీకే టీమ్ లో ప‌ని చేశారు త‌మిళనాడుకు చెందిన ఈ యువ‌తి తండ్రి డిఏంకే ఎమ్మెల్యే రాజేంద్ర‌న్. ఐప్యాక్ ప్రారంభం నుంచి ప్ర‌శాంత్ కిషోర్ టీమ్ లో ప‌ని చేసిన ప్రియ ఆయ‌న‌కు అత్యంత న‌మ్మ‌క‌మైన వ్య‌క్తిగా పేరు తెచ్చుకున్నారు.

    ఇదీ చదవండి: మంగళగిరికి బై బై.. వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్ పోటీ చేసే ప్లేస్ ఫిక్స్..! ఆ నేతను ఢీ కొడతారా.?

    మొదట ష‌ర్మిళ ప్ర‌శాంత్ కిషోర్ ను సంప్ర‌దించిన‌ప్ప‌టికి ఆయ‌న‌కు ఖాళీ లేక‌పోవ‌డంతో ఆయ‌నే ప్రియను ష‌ర్మిళకు ప‌రిచ‌యం చేసిన‌ట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల కితం ప్రియ హైద‌రాబాద్ లోటస్ పౌండ్ లో ష‌ర్మిళ‌తో స‌మావేశం కూడా అయ్యిన‌ట్లు స‌మాచారం. ఈ స‌మావేశంలో తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితిలు అనుస‌రించాల్సి వ్యూహాల‌కు సంబంధించి ష‌ర్మిళ‌తో చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న ష‌ర్మిళ పెట్ట‌బోయే కొత్త పార్టీకి ప్రియను వ్యూహాక‌ర్త‌గా నియ‌మించ‌డం ఖారారైపోయింద‌నే వార్త‌లు వినిపిస్తోన్నాయి.

    ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్.. సంక్షేమ పథకాల అమలుపై ఊహించని ట్విస్ట్

    ఈ నెల 8 న పార్టీ ప్ర‌క‌టించే స‌మ‌యంలో లేదా మ‌రోక సంద‌ర్భంలోనైన ష‌ర్మిళ ప్రియను పార్టీ వ‌ర్గాల‌కు ప్ర‌రిచ‌యం చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాలు సెర వేగంగా మారుతుండడంతో ఈ నేప‌థ్యంలో ఎలాంటి వ్యూహాలు తీసుకోవాల‌న్న వ్యూహాక‌ర్త పార్టీకి అవ‌స‌రమ‌ని భావించే ష‌ర్మిళ ప్రియాను వ్యూహాక‌ర్త‌గా నియ‌మించుకోవాడానికి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది.
    Published by:Nagesh Paina
    First published: