YS Sharmila : వైఎస్ పాలన తెలంగాణలో .. సాధ్యమేనా..? నేటి నుండి షర్మిల పాదయాత్ర..!

YS Sharmila : వైఎస్ పాలన తెలంగాణలో .. సాధ్యమేనా..? నేటి నుండి షర్మిల పాదయాత్ర..!

YS Sharmila : వైఎస్ షర్మిల నేటి నుండి పాదయాత్ర కొనసాగించనున్నారు. చేవెళ్లలో ఉదయం పదిన్నర గంటలకు ఆమె పాదయాత్ర ప్రారంభం కానుంది. కాగా మొత్తం 90 నియోజకవర్గాల్లోని సుమారు 400 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించేందుకు రూట్ మ్యాప్ రూపోందించారు.

  • Share this:
    తెలంగాణలో మరో రాజకీయా పార్టీ పాదయాత్ర కొనసాగించనుంది. నేటి నుండి వైఎస్ఆర్‌టీపి అధినేత వైఎస్ షర్మిల పాదయాత్ర చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ పాలన కోసం పాదయాత్ర చేయనున్నట్టు ఆమె ప్రకటించారు. అందుకోసమే మొత్తం తెలంగాణలోని 90 నియోజకవర్గాల్లోని 4000 కిలోమీటర్ల పాటు ఆమె పాద యాత్ర చేసేందుకు వ్యుహం రచించారు. ఈ క్రమంలోనే నేడు ఉదయం చేవెళ్లలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆనంతరం పాదయాత్ర చేవేళ్ల, శంశాబాద్, మహేశ్వరం, కందుకూరు,ఇబ్రహిం పట్నం, మంచాల యాచారం మీదుగా ఆమె పాదయాత్ర కొనసాగనుంది.

    ఇందుకోసం మంగళవారం సాయంత్రం వైఎస్ షర్మిల తల్లి విజయమ్మతో కలిసి వైఎస్ సమాధి వద్ద ఘన నివాళులు అర్పించారు. ముఖ్యంగా వైఎస్ పాలనను తెలంగాణలో తేవడమే లక్ష్యంగా పాదయాత్ర కొనసాగించనున్నట్టు ఆమె స్పష్టం చేశారు. నీళ్లు, నిధులు సాధనే లక్ష్యంతో పాటు తెలంగాణ ప్రజల క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర ఉపయోగపడుతుందని ఆమె చెప్పారు. కాగా పార్టీ ఏర్పాటు తర్వాత నిరుద్యోగ పోరాటం చేసిన షర్మిల తాజాగా పార్టీ నిర్మాణం చేసుకుని నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు. పాదయాత్రల ద్వారానే ప్రజలకు చేరువయ్యే అవకాశాలు ఉండడంతో ఆమె ఇందుకోసం రంగం సిద్దం చేసుకున్నారు. ఇక ఆమె పాదయాత్ర కోసం ప్రముఖ రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం డైరక్షన్‌లో పాదయాత్ర కొనసాగనుంది.

    ఇది చదవండి : అక్టోబరు 20 రాశి ఫలాలు.. ఈ రాశి నిరుద్యోగులు శుభవార్త వింటారు.


    అయితే ఇప్పటికే తెలంగానలో కాంగ్రేస్ పార్టీ తోపాటు బీజేపీ తమ పట్టు సాధించడం కోసం తీవ్ర కృషి చేస్తున్నాయి.. జాతీయ స్థాయి పార్టీలు ఓ వైపు అధికారం కోసం ప్రయత్నలు చేస్తుంటే.. మరోవైపు కొత్త పార్టీ పెట్టి అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో షర్మిల ముందుకు సాగుతున్నారు. ఇక అధికార టీఆర్ఎస్ సైతం తమ అధికారానికి ఢోకా లేదని విశ్వాసం వ్యక్తం చేస్తున్ననేపథ్యంలోనే షర్మిల పాదయాత్ర ఏమేరకు సక్సెస్ సాదిస్తుందో వేచి చూడాలి. అయితే వైఎస్ కూడా చేవెళ్ల నుండి పాదయాత్ర చేపట్టి రెండు సార్లు అధికారం చేపట్టినా.. అప్పటి రాజకీయ పరిస్థితులకు తాజా రాజకీయాలకు చాలా తేడా ఉండడంతో ఎలాంటీ పరిణామాలు కొనసాగుతయనేది వేచి చూడాలి.
    Published by:yveerash yveerash
    First published: