హోమ్ /వార్తలు /తెలంగాణ /

Breaking News: పాదయాత్ర కొనసాగింపుపై Ys షర్మిల కీలక నిర్ణయం..ఆ రోజే నుంచే ప్రారంభం

Breaking News: పాదయాత్ర కొనసాగింపుపై Ys షర్మిల కీలక నిర్ణయం..ఆ రోజే నుంచే ప్రారంభం

షర్మిల

షర్మిల

లోటస్ పాండ్ లో కార్యకర్తలతో YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల (Ys Sharmila) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పాదయాత్ర కొనసాగింపుపై షర్మిల  (Ys Sharmila) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 4 నుంచి 14 వరకు పాదయాత్రను యథావిధిగా కొనసాగించాలని ఆమె నిర్ణయించారు. బెదిరించిన..కొట్టినా..చంపినా కూడా పాదయాత్ర ఆపేది లేదని షర్మిల  (Ys Sharmila) స్పష్టం చేశారు. ఆపదలో తన వెంట ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటా..మీరంతా మా కుటుంబం అని షర్మిల  (Ys Sharmila) వ్యాఖ్యానించారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

లోటస్ పాండ్ లో కార్యకర్తలతో YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల (Ys Sharmila) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పాదయాత్ర కొనసాగింపుపై షర్మిల  (Ys Sharmila) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 4 నుంచి 14 వరకు పాదయాత్రను యథావిధిగా కొనసాగించాలని ఆమె నిర్ణయించారు. బెదిరించిన..కొట్టినా..చంపినా కూడా పాదయాత్ర ఆపేది లేదని షర్మిల  (Ys Sharmila) స్పష్టం చేశారు. ఆపదలో తన వెంట ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటా..మీరంతా మా కుటుంబం అని షర్మిల  (Ys Sharmila) వ్యాఖ్యానించారు.

డైరెక్షన్ ఇవ్వడానికి మీరెవరు..సిట్ అధికారిపై ఏసీబీ కోర్టు ఆగ్రహం..క్షమాపణ చెప్పిన గంగాధర్

వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర నర్సంపేటలో కొనసాగుతుండగా ఆమెపై, ప్రచార రథంపై కూడా టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో ఈ రచ్చ మొదలయింది. ఆ దాడి ఘటనతో పోలీసులు షర్మిలను అరెస్ట్ చేసి లోటస్ పాండ్ లో వదిలేశారు. అయితే ఆతరువాత ఆమె ప్రగతి భవన్ కు వెళ్లే ప్రయత్నం చేయడం..పోలీసులు అడ్డుకోవడం..ఆమె కారులో ఉండగానే క్రేన్ తో పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం  ఆమెను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. ఆ తరువాత బెయిల్ పై ఆమె బయటకు వచ్చారు. దాడికి సంబంధించి వివరాలను తెలంగాణ గవర్నర్ కు షర్మిల విచారించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

Egg Price: ఒక్క గుడ్డు 7 రూపాయలు.. కోడి గుడ్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

YSRTPకి ఆదరణ పెరగడంతో టీఆర్ఎస్ భయపడుతుంది. అందుకే పాదయాత్రను అడ్డుకోవాలని కుట్ర చేశారు. కావాలనే శాంతిభద్రతల సమస్య తీసుకొచ్చారు. నన్ను అరెస్ట్ చేస్తే తప్ప పాదయాత్ర ఆపలేమని అనుకున్నారు. పాదయాత్రను ఆపాలని అనుకోకపోతే రిమాండ్ ఎందుకు అడిగారని షర్మిల (Ys Sharmila) ప్రశ్నించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే రిమాండ్ కు పంపిస్తారా అని మండిపడ్డారు. కేసీఆర్ డైరక్షన్ లోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. దేశంలో అత్యంత ధనిక కుటుంబం కేసీఆర్ దే. కవిత, కేటీఆర్ ఇళ్లపై రైడ్స్ చేయాలి. ప్రగతి భవన్ లో దాడి చేస్తే వేల కోట్లు దొరుకుతాయి. కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల ల్యాండ్ వుంది. కాంట్రాక్టు పేరుతో వేల కోట్లు దోచుకున్నారన్నారు. లిక్కర్ స్కాంలో కవిత పేరు ఉందని షర్మిల (Ys Sharmila) చెప్పుకొచ్చారు.

ఇక నేను ఆంధ్రా అని ఆమెకు ఇక్కడ ఏం పని అని అంటున్నారు. నేను చదువుకున్నది, పెరిగింది, పెళ్లి చేసుకున్నది, కొడుకును కన్నది ఇక్కడే. నా గతం..వర్తమానం..భవిష్యత్తు కూడా ఇక్కడే అన్నారు. కేటీఆర్ గారి భార్య ఎక్కడి నుండి వచ్చారు. ఆంధ్రా కాదా అని ప్రశ్నించారు. అంతమాత్రాన మేము విడకులు తీసుకోమని అడుగుతున్నామా అని అన్నారు. ఈ సందర్బంగా కేసీఆర్ , కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత గతంలో చేసిన వ్యాఖ్యలను మీడియా ముందు చూయించారు. అయితే పాదయాత్ర ప్రారంభంపై షర్మిల ఎలాంటి ప్రకటన చేయలేదు. దాదాపు 4 రోజుల పాటు పాదయాత్రకు బ్రేక్ వచ్చింది. ఈ క్రమంలో నేడు కార్యకర్తలతో సమావేశం అయిన షర్మిల పాదయాత్రపై క్లారిటీ ఇచ్చారు.

First published:

Tags: Hyderabad, Telangana, YS Sharmila

ఉత్తమ కథలు