తెలంగాణలో ఉద్యోగాలను భర్తి చేయాలని కోరుతూ వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష మూడో రోజు లోటస్‌పాండ్ వద్ద కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే నేడు ఉదయం వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని పరీక్షించారు. దీక్ష వేదికపై షర్మిల ఒక్కరే దీక్ష చేస్తుండగా పలువురు నేతలు వచ్చి మద్దతు తెలిపారు. అయితే కరోనా నేపథ్యంలోనే కార్యకర్తలు ఇతర నేతలను స్టేజి వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డకుంటున్నారు. మరోవైపు శుక్రవారం మాస్క్ లేకుండానే దీక్షలో కూర్చున్న షర్మిల నేడు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్‌తో దీక్ష కొనసాగిస్తున్నారు.
గురువారం ఇందిరా పార్క్ వద్ద దీక్ష ప్రకటించిన షర్మిల సాయంత్రం ఆకస్మిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే... తాను ముందుగా ప్రకటించిన ప్రకారం మూడు రోజుల పాటు దీక్ష చేస్తానని ప్రకటించారు. షర్మిల ప్రకటనతో అలర్ట్ అయిన షర్మిలను అడ్డుకుని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. దీంతో కొంత తోపులాట జరిగింది. చివరకు ఆమెను అరెస్ట్ చేసినా.. తాను పోలిస్ స్టేషన్లో కూడ దీక్ష చేస్తానని చెప్పడంతో తిరిగి ఆమెను లోటస్‌పాండ్‌లోని తన నివాసం వద్ద పోలీసులు దిగబెట్టారు. దీంతో ఆమె రెండు రోజులుగా లోటస్‌పాండ్ వద్ద దీక్ష కొనసాగిస్తున్నారు. మొత్తం మూడు రోజుల పాటు దీక్ష కొనసాగిస్తానని చెప్పిన నేటి సాయంత్రం దీక్షను విరమించనుంది.