లోటస్‌పాండ్ : రెండో రోజు దీక్ష కొనసాగిస్తున్న షర్మిల

sharmila

వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష రెండో రోజు లోటస్‌పాండ్ వద్ద కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే నేడు ఉదయం వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని పరీక్షించారు.

  • Share this:
తెలంగాణలో ఉద్యోగాలను భర్తి చేయాలని కోరుతూ వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష రెండో రోజు లోటస్‌పాండ్ వద్ద కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే నేడు ఉదయం వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని పరీక్షించారు. దీక్ష వేదికపై షర్మిల ఒక్కరే దీక్ష చేస్తుండగా ఆమె తల్లి విజయమ్మ మద్దతు తెలిపారు. గురువారం
ఇందిరా పార్క్ వద్ద దీక్ష ప్రకటించిన షర్మిల సాయంత్రం ఆకస్మిక ప్రకటన చేశారు. తాను ముందుగా ప్రకటించిన ప్రకారం మూడు రోజుల పాటు దీక్ష చేస్తానని ప్రకటించారు.

షర్మిల ప్రకటనతో అలర్ట్ అయిన షర్మిలను అడ్డుకుని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. దీంతో కొంత తోపులాట జరిగింది. చివరకు ఆమెను అరెస్ట్ చేసినా..తాను పోలిస్ స్టేషన్‌లో కూడ దీక్ష చేస్తానని తెగేసి చెప్పడంతో తిరిగి ఆమెను లోటస్‌పాండ్‌లోని తన నివాసం వద్ద పోలీసులు దిగబెట్టారు.
దీంతో ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు.
Published by:yveerash yveerash
First published: