• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • HYDERABAD YS SHARMILA HUNGER STRIKE CLOSED TODAY AT LOTUS POND AFTER CONTINUING 72 HOURS VS

Lotuspond strike :ముగిసిన వైఎస్ షర్మిల దీక్ష.. అనంతరం మరో ట్విస్ట్.. ఉద్యోగ నోటిఫికేషన్లకు వచ్చే వరకు దీక్షలు ఆగవని హెచ్చరిక

Lotuspond strike :ముగిసిన వైఎస్ షర్మిల దీక్ష.. అనంతరం మరో ట్విస్ట్.. ఉద్యోగ నోటిఫికేషన్లకు వచ్చే వరకు దీక్షలు ఆగవని హెచ్చరిక

వైఎస్ షర్మిల

hyderabad గత మూడు రోజులుగా ఉద్యోగాలు భర్తి చేయాలని దీక్ష చేస్తున్న వైఎస్ షర్మిల దీక్ష విరమించారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంభ సభ్యులు షర్మిలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు

  • Last Updated:
  • Share this:
గత మూడు రోజులుగా ఉద్యోగాలు భర్తి చేయాలని దీక్ష చేస్తున్న వైఎస్ షర్మిల దీక్ష విరమించారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంభ సభ్యులు షర్మిలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కాగా 2017లో చనిపోయిన మురలియాదవ్, 2021 ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకున్న కొప్పు రాజు అనే నిరుద్యోగి కుటుంభసభ్యులు ఆమెకు నిమ్మరసం ఇచ్చారు. ఇద్దరు కూడ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన వారు గమనార్హం. ప్రస్థుతానికి దీక్ష విరమించినా.. జిల్లాల్లోని కార్యకర్తలు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే దీక్షలు కొనసాగిస్తారని ఆమె చెప్పారు.

కాగా రాష్ట్ట్రంలో ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలను భర్తి చేయాలని కోరుతూ గత గురువారం ఉదయం ఇందిరాపార్క్ వద్ద షర్మిల దీక్ష చేపట్టారు. అయితే మూడు రోజుల పాటు దీక్ష చేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరిన నేపథ్యంలో పోలీసులు మాత్రం ఒక్క రోజు మాత్రమే దీక్షకు అనుమతించారు. అయితే గురువారం సాయంత్రమే పోలీసుల ఆదేశాల మేరకు లోటస్‌పాండ్‌కు చేరుకునేందుకు షర్మిలను మార్గమధ్యలోనే పోలీసులు అరెస్ట్ చేశారు.దీంతో తాను పోలీస్ స్టేషన్‌లోనే దీక్ష కొనసాగిస్తానని చెప్పడంతో అరెస్ట్ అనంతరం తిరిగి లోటస్ పాండ్‌లోని ఇంటి వద్ద వదిలిపెట్టి వచ్చారు.

ys sharmila


అనంతరం ఇంటివద్దే ఏర్పాటు చేసిన దీక్ష శిభిరంలో ఆమె దీక్షను కొనసాగించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తు దీక్ష చేపట్టిన షర్మిల ఆరోగ్యం కొంత క్షీణించినట్టు వైద్యులు శనివారం ప్రకటించారు. దీక్ష విరవింప చేయాలని సూచించారు. కాని 72 గంటలపాటు దీక్ష చేస్తానని అప్పటి వరకు దీక్ష విరమించేది లేదని ఆమె స్పష్టం చేశారు.

(Image-twitter)


ఇక దీక్ష విరమించిన తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడుతూ మరోసారి సీఎం కేసిఆర్ పై విరుచుకుపడ్డారు.నిరుద్యోగులు చేసుకున్నది హత్యలా, ఆత్మహత్యాల అనేది తెలంగాణ ప్రజలు అలోచించాలి .నిరుద్యోగుల ఆత్మహత్యలన్ని కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్యలేనని విమర్శించారు. ఎందుకంటే .ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం సీఎం కేసీఆర్‌కు చిటికేలో పని అన్నారు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ రంగంతో పాటు, ప్రైవేటు రంగంలో కూడ లక్షల ఉద్యోగాలు కల్పించాడని గుర్తు చేశారు.

ys sharmila


సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగ యువతకు అనేక హమీలు ఇచ్చారని, కాని వాటిని అమలు చేయడంలో విఫలం అయ్యాడని ఆమె విమర్శించారు. ఇక ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే టీఎస్‌పీఎస్‌సీ లో మొత్తం 11 మంది సభ్యులు ఉంటే..అందులో కేవలం ఒక్క సభ్యుడితోనే కొనసాగిస్తున్నారని అన్నారు.
Published by:yveerash yveerash
First published: