• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • HYDERABAD YS SHARMILA HUNGER STRIKE AT INDIRA PARK TODAY VS

ఉద్యోగ దీక్ష : వైఎస్ షర్మిల దీక్ష..ప్రభుత్వం దిగివస్తుందా..?

ఉద్యోగ దీక్ష :  వైఎస్ షర్మిల దీక్ష..ప్రభుత్వం దిగివస్తుందా..?

నేడు ఇందిరాపార్క్ వద్ద షర్మిల దీక్ష

ఇందిరాపార్క్ వద్ద వైఎస్ షర్మిల చేపట్టనున్న రిలే దీక్షకు పోలీసుల నుండి అనుమతి లభించింది. నేడు ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు ఆమె దీక్ష కొనసాగించనున్నారు.

  • Share this:


వైఎస్ షర్మిల చేపట్టనున్న నిరాహార దీక్షకు పోలీసుల అనుమతి లభించడంతో.. నేడు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలవరకు దీక్ష కొనసాగనుంది. ఇందిరాపార్క్ వద్ద ఆమె ఒక్కరోజు రిలే దీక్షలో కూర్చోనున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు రాష్ట్ర్రంలో ఉన్న లక్ష ఉద్యోగాలను భర్తి చేయాలని కోరుతూ దీక్ష చేయనున్నట్టు షర్మిల ఖమ్మం సంకల్ప సభలో ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇటివలే జరిగిన ఖమ్మం సభలో తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన షర్మిల మరో ప్రాణం పోకముందే ప్రభుత్వం స్పందించి ఉద్యోగాలు కల్పించాలని ఆమె సభలో డిమాండ్ చేశారు. అందుకోసమే దీక్ష చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో భాగంగానే ఇందిరా పార్క్ వద్ద మూడు రోజులపాటు దీక్ష చేసేందుకు అనుమతిని కోరారు..అయితే పోలీసులు మాత్రం ఒక్కరోజు దీక్షకు మాత్రమే అనుమతి ఇచ్చారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నించేందుకు పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే.. దీక్షకు ఒక్కరోజు ముందు అనుమతి రావడంతో దీక్ష ఏర్పాట్లు హడవిడిగా పూర్తి చేశారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి దీక్షను చేపడతామని , ఈ దీక్షలో పాల్గోని ప్రజలు విజయవంతం చేయాలని నేతలు కోరారు.
Published by:yveerash yveerash
First published:

అగ్ర కథనాలు