Home /News /telangana /

YS sharmila : జగనన్నకు రాఖీ కట్టని వైఎస్ షర్మిల... ట్విట్టర్‌లో శుభాకాంక్షలు...కారణం ఇదేనా...?

YS sharmila : జగనన్నకు రాఖీ కట్టని వైఎస్ షర్మిల... ట్విట్టర్‌లో శుభాకాంక్షలు...కారణం ఇదేనా...?

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో )

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో )

YS sharamila : వైఎస్ షర్మిల జగన్‌కు షాకిచ్చింది..రాఖీ పండగ సంధర్భంగా నేరుగా రాఖీ కట్టకుండా.. ఆయనకు శుభాకాంక్షాలు మాత్రమే తెలిపింది..జగన్‌తోపాటు నమ్మిన సిద్దంతం కోసం తనతోపాటు కలిసి నడుస్తున్న వారందరికి రాఖీపండగ శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది..

ఇంకా చదవండి ...
    రాజకీయాలు వేరు..రక్త సంబంధం వేరు..అయినా...సొంతగా రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ షర్మిల కనీసం తన అన్న ముఖం కూడా చూడానికి ఇష్టపడనంతగా వ్యవహరిస్తోంది..ఈ నేపథ్యంలోనే గతంలో జగన్‌కు రాఖీ కట్టిన షర్మిల ఈ సంవత్సరం మాత్రం రాఖీ కట్టలేదు..అయితే ట్విట్టర్ ద్వారా మాత్రం "నా తోడ బుట్టిన జగనన్నకు రాఖీ శుభాకాంక్షలు" అని తెలిపింది..

    తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం అంటూ వైఎస్ఆర్‌టీపి స్థాపించిన వైఎస్ షర్మిల తెలంగాణ సమస్యలపై పోరాడుతున్న విషయం తెలిసిందే..అయితే ఆమె రాజకీయా పార్టీ ఏర్పాటుకు కారణం అన్నా,చెల్లెలు మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. కాని, ముందుగా ఎవరు ఈ ప్రచారాన్ని నమ్మలేకపోయారు..

    అయితే షర్మిల రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుండి జరగుతున్న పరిణామాలు వాటిని బలపరుస్తున్నాయి..నిజంగానే ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని రుజువు చేస్తున్నాయి..ముఖ్యంగా మొదట్లోనే వైఎస్ షర్మిల, జగన్ సొంత మీడియా సంస్థపై కూడా బహిరంగానే కామెంట్స్ చేసింది..మీరు మాకు కవరేజ్ ఇవ్వరులే అంటూ వ్యాఖ్యానించింది..దీంతో అప్పుడు అంతా ఒక్కసారిగా అవాక్కాయ్యారు..అయితే ఇదంతా రాజకీయ స్టంట్ అంటూ కొట్టి పారేశారు.

    కాని రాను రాను ఇద్దరి మద్య దూరం పెరుగుతున్న సంధర్భాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి..ముఖ్యంగా రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత జగన్‌తో నేటి వరకు సమావేశం కాని షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సంధర్భంగా కూడా తల్లి విజయమ్మతో కలిసి మాత్రమే ఇడుపులపాయకు వెళ్లారు...ఆ ఆర్వాత ముఖ్యమంత్రి జగన్ వెళ్లి నివాళులు అర్పించారు..


    ఇక తాజాగా నేటి రాఖీ పౌర్ణమి సంధర్భంగా కూడా షర్మిల ఇదే వైఖరిని ప్రదర్శించింది..రాజకీయాలు వేరుగా ఉన్నా.. కుటుంబ సంబంధాలు కొనసాగించే వారు చాలా మందే ఉన్నారు..ఒకే ఇంట్లో మూడు నాలుగు పార్టీల ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు..అయినా కుటుంబ సంధాల్లో మాత్రం ఎలాంటీ విభేదాలు లేకుండా ఉన్నవారు ఉన్నారు..కాని షర్మిల మాత్రం ఇలా వ్యవహరించలేదని చెప్పవచ్చు..దీంతో రాజకీయ కారణాలు కాకుండా కుటుంబ సంబంధమైన కారణాలు కూడా వారి విబేధాలకు కారణం అయి ఉంటాయని చెబుతున్నారు.

    ఏది ఏమైనా రాజకీయ పరంగా ఇది షర్మిలకు కలిసివచ్చే అంశమే అయినా...కుటుంబపరంగా కొంత విమర్శలు ఎదురయ్యె అవకాశాలు కనిపిస్తున్నాయి..మరోవైపు అన్నయ్యకు షర్మిల రాఖీ కడుతుందనుకున్న అభిమానులకు కూడా కొంత నిరాశ ఎదురవుతోంది..

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Telangana News, Ys jagan, YS Sharmila

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు