Home /News /telangana /

HYDERABAD YOUTH HAS BEEN ARRESTED FOR PHYSICALLY ABUSING MINOR GIRL IN OLD CITY HYDERABAD SNR

Hyderabad : ఓల్డ్ సిటీలో సేల్స్‌ గర్ల్స్‌పై అత్యాచారం .. నయవంచనకు గురైన మైనర్‌ గర్ల్‌

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad | crime news: హైదరాబాద్‌లో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. జూబ్లిహిల్స్, మొఘల్‌పూరా అత్యాచార ఘటనలు మర్చిపోక ముందే కాలాపత్తర్‌లో మరో యువకుడు మైనర్‌ని చెరబట్టాడు. బాధితురాలి ద్వారా విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో నిందితుడ్ని అరెస్ట్ చేశారు ఓల్డ్ సిటీ పోలీసులు.

ఇంకా చదవండి ...
ఆడపిల్లలు కనిపిస్తే చాలు కాటేయకుండా వదలడం లేదు కామాంధులు. తెలంగాణలో గత కొద్దిరోజులుగా వరుసగా మైనర్‌పై లైంగిక దాడి, అమాయక యువతులపై సామూహిక అత్యాచారాలు ఘటనలు మర్చిపోక ముందే మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌(Hyderabad)ఓల్డ్‌సిటీలోని కాలాపత్తర్(Kalapathar)ప్రాంతానికి చెందిన 16సంవత్సరాల(16Years girl) బాలికను ఓ యువకుడు పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి అత్యాచారం చేశాడు. వారం రోజుల క్రితం జరిగిన ఈదారుణ ఘటన మైనర్ బాలిక అనారోగ్యానికి గురవడంతో బయటపడింది.

మైనర్‌ బాలికపై ఓల్డ్‌ సిటీలో అత్యాచారం..
కాలాపత్తర్‌ ప్రాంతానికి చెందిన 16సంవత్సరాల మైనర్ బాలిక చార్మినార్‌ ప్రాంతంలోని ఓ బట్టల దుకాణంలో సేల్స్‌ గర్ల్‌గా పని చేస్తోంది. లంగర్‌హౌజ్ మొఘల్‌నగర్ రింగ్‌ రోడ్డు ప్రాంతానికి చెందిన 21సంవత్సరాల మహ్మద్ సుఫియాన్ అనే కుర్రాడు యువతికి మాయ మాటలు చెప్పాడు. ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న సుఫియాన్..మే 30 తేదిన బాలికను లంగర్‌హౌజ్‌లో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రేమిస్తున్నానని..త్వరలోనే పెళ్ల చేసుకుంటానని చెప్పి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

వరుసగా మూడో కేసు..
సుఫియాన్‌ మైనర్‌ బాలికను మరుసటి రోజు అంటే మే 31వ తేదిన ఆమె పని చేస్తున్న వస్త్ర దుకాణం దగ్గర వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఆదే రోజు అమ్మాయికి తన ఫోన్‌ నెంబర్‌ ఇచ్చి వెళ్లిపోయాడు. సుఫియాన్‌ చేతిలో అత్యాచారానికి గురైన మైనర్ బాలికకు కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను నిలదీశారు. దాంతో విషయం బయటపడింది. గత నెల 30వ తేదిన సుఫియాన్‌ ఇంటికి తీసుకెళ్లి తనపై లైంగిక దాడికి పాల్పడిన విషయాన్ని చెప్పింది. బాధితురాలి ద్వారా నిజం తెలుసుకున్న తల్లి వెంటనే కాలాపత్తర్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మైనర్‌గా ఉన్న తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుడు సుఫియాన్‌పై కిడ్నాప్, లైంగికదాడి కేసులు నమోదు చేసిన కాలాపత్తర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు బాధితురాలికి ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా అరెస్ట్ చేసారు. అతనిపై మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపారు. జూబ్లిహిల్స్‌లో యువతిపై అత్యాచారం, ఆ తర్వాత మొఘల్‌పూరాలో మైనర్‌ బాలికపై లైంగిక దాడి..ఈ సంఘటనలు మర్చిపోక ముందే కాలాపత్తర్‌లో మైనర్‌ బాలికను ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువకుడు మోసం చేసి అత్యాచారానికి పాల్పడటంతో పోలీస్ శాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Published by:Siva Nanduri
First published:

Tags: Hyderabad crime, Minor girl raped

తదుపరి వార్తలు