ఫేస్‌బుక్ లో పరిచయమైన యువతికి తన నగ్న వీడియోలు పంపాడో హైదరాబాద్ కుర్రాడు.. చివరకు అతడి పరిస్థితి ఇదీ..!

ప్రతీకాత్మక చిత్రం

కుర్రాళ్లయితే ఎవరో తెలియని అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే చాలు, ఆగమేఘాల మీద ఆవురావురుమంటూ యాక్సెప్ట్ చేస్తున్నారు. నెట్టింట పరిచయమైన అమ్మాయిలతో తెగ చాటింగ్ చేస్తున్నారు. వ్యక్తిగత వివరాలను కూడా పంచుకుంటున్నారు.

 • Share this:
  కుర్రాళ్లూ.. జర జాగ్రత్త.. అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నా సరే యువతరం అంతా సోషల్ మీడియా మత్తులో పడి మునిగిపోతోంది. ఉదయం నిద్ర లేచింది మొదలుకుని, రాత్రి పడుకునే వరకు ఫోన్ పక్కనే పెట్టుకుంటున్నారు. వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టా.. ఇలా ఒక్కటేమిటి అన్నంటిలోనూ యమా యాక్టివ్ గా ఉంటున్నారు. కొత్త కొత్త వాళ్లతో స్నేహాలను పెంచుకుంటున్నారు. ఇక కుర్రాళ్లయితే ఎవరో తెలియని అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే చాలు, ఆగమేఘాల మీద ఆవురావురుమంటూ యాక్సెప్ట్ చేస్తున్నారు. నెట్టింట పరిచయమైన అమ్మాయిలతో తెగ చాటింగ్ చేస్తున్నారు. వ్యక్తిగత వివరాలను కూడా పంచుకుంటున్నారు. తాజాగా అలాంటి చేష్టలకు పోయే ఓ హైదరాబాద్ కుర్రాడు చిక్కుల్లో పడ్డాడు. అసలేం జరిగిందంటే..

  హైదరాబాద్ కు చెందిన ఓ కుర్రాడికి ఫేస్ బుక్ లో ఓ రాజస్థాన్ యువతి పరిచయం అయింది. వారిద్దరి మధ్య మాటల ప్రవాహం సెలయేరులా సాగిపోయింది. ఒకరినొకరు ఎడతెగని ముచ్చట్లతో రోజులను క్షణాల్లా గడిపేశారు. కుటుంబ సభ్యుల వివరాల నుంచి వ్యక్తిగత విషయాలన్నింటి వరకు షేర్ చేసుకున్నారు. తమ అభిరుచులను చెప్పుకున్నారు. మాటల మధ్యలోనే ఆ కుర్రాడి ఫోన్ నెంబర్ ను ఆ యువతి తీసుకుంది. మంచి రోజు చూసుకుని వాట్సప్ వీడియో కాల్ చేస్తా అన్నది. అన్నట్టుగానే కొద్ది రోజుల తర్వాత ఓ రోజు రాత్రి అతడికి వాట్సప్ వీడియో కాల్ చేసింది. ఆమె అందాన్ని వీడియో కాల్ లో చూసిన మనోడికి మతిపోయింది.
  ఇది కూడా చదవండి: బయటపడ్డ అసలు నిజం.. గంటకో కట్టుకథ చెబుతూ ముప్పతిప్పలు.. పోలీసులకు డౌట్ రాకుండా ప్రియుడిని భయ్యా అని పిలిస్తూ..

  ఆ యువతి కూడా కుర్రాడిని హస్కీ మాటలతో, సెక్సీ పదాలతో రెచ్చగొట్టింది. చివరకు ఆమె వలలో పడిపోయిన కుర్రాడు ఆమె అడిగిన విధంగా తన నగ్న వీడియోలను పంపాడు. ఆ వీడియోలు తన వద్దకు వచ్చిన తర్వాత ఆ యువతి తన అసలు రూపాన్ని ప్రదర్శించింది. ఆ వీడియోలను ఫేస్ బుక్ లో పెడతాననీ, పరువు తీస్తానని బెదిరించింది. దీంతో భయపడిపోయిన హైదరాబాద్ కుర్రాడు పలు దఫాలుగా రెండు లక్షల రూపాయల వరకు ఆమెకు సమర్పించాడు. అయినప్పటికీ ఆమె అతడిపై బెదిరింపులను ఆపకపోవడంతో చివరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేస్తున్నారు.
  ఇది కూడా చదవండి: నాకు పిల్లను వెతికి పెళ్లి చేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో.. అంటూ ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాసిన 26 ఏళ్ల కుర్రాడు
  Published by:Hasaan Kandula
  First published: