హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG: నిర్మాత బన్నీవాసు నన్ను మోసం చేశాడు..గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు యువతి అర్ధనగ్న ప్రదర్శన

OMG: నిర్మాత బన్నీవాసు నన్ను మోసం చేశాడు..గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు యువతి అర్ధనగ్న ప్రదర్శన

Photo Credit:Twitter

Photo Credit:Twitter

Hyderabad:టాలీవుడ్ ప్రొడ్యూసర్ బన్నీవాసు తనను శారీరకంగా వాడుకొని వదిలేశాడని..బోయ సునీత అనే యువతి అర్ధనగ్నప్రదర్శకు దిగింది. హైదరాబాద్‌ గీతా ఆర్ట్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగిన యువతిని పోలీసులు స్టేషన్‌కి తరలించారు. యువతి బన్నీవాసుపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఇది ఐదోసారి కావడం విశేషం.

ఇంకా చదవండి ...

సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని మోసం చేశాడంటూ గతంలో ఓ సారి నిర్మాత బన్నీవాసు(Bunnyvasu)పై ఆరోపణలు చేసిన బాధితురాలే మరోసారి వినూత్న రీతిలో ఆందోళనకు దిగింది. సునీత బోయ(Sunitha Boya)అనే జూనియర్ ఆర్టిస్ట్, జనసేన(Janasena)యాక్టివిస్ట్ గీతా ఆర్ట్స్ ఆఫీస్(Geeta Arts Office)ముందు అర్ధనగ్న(Half naked)ప్రదర్శనకు దిగింది. ఫేస్‌బుక్‌(Facebook)లో తనతో చాటింగ్ చేసిన బన్నీవాసు..ఆ పరిచయంతోనే తనను శారీరకంగా వాడుకున్నాడని..అవకాశాల పేరుతో తనను మోసం చేశాడంటూ నిరసన చేపట్టింది. తనకు జరిగిన అన్యాయంపై నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind), అల్లు అర్జున్(Allu Arjun)స్పందించాలని న్యాయం చేయాలని డిమాండ్ చేసింది బోయ సునీత. నడిరోడ్డుపై అర్ధనగ్నంగా ఆందోళనకు దిగడంతో గీతా ఆర్ట్స్ ఆఫీస్ దగ్గర ఎవరూ లేకపోవడంతో పోలీసులకు విషయం తెలిసి స్వయంగా వచ్చి ఆమెను అదుపులోకి తీసుకొని జూబ్లిహిల్స్ (Jubileehills) పోలీస్ స్టేషన్‌(Police Station)‌కి తరలించారు. గత ఎన్నికల సమయంలో జనసేన పార్టీ తరపున సోషల్ మీడియా యాక్టివిస్ట్‌గా కూడా పనిచేసింది. పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)పోటీ చేసిన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంది బోయ సునీత. తాను జనసేన పార్టీకి పని చేసినందువల్లే టార్గెట్ చేసి సోషల్ మీడియా(Social media)లో వేధిస్తున్నారని ఆరోపిస్తోంది బోయ సునీత. బోయ సునీత అనే యువతి గతేడాది జులై నెలలో కూడా ఇదే తరహాలో గీతా ఆర్ట్స్‌ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళనకు చేపట్టింది. బన్నీ వాసు తనను వాడుకున్నారని న్యాయం చేయమని అడిగితే బెదిరిస్తున్నాడని ఆత్మహత్యకు పాల్పడుతానంటూ జూబ్లీహిల్స్‌ లోని గీతా ఆర్ట్స్‌ కార్యాలయం వద్ద సునీత బోయ అనే మహిళ ఆరోపించింది. మలక్‌పేటకు చెందిన సునీత కొన్ని సినిమాల్లో చిన్న, చితక క్యారెక్టర్లు చేసింది.

అర్ధనగ్న ప్రదర్శన..

నిర్మాత బన్నీ వాసు ఇప్పటికే నాలుగుసార్లు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది బోయ సునీత. ఇది ఐదోసారి కావడం విశేషం. రెండు సార్లు జైలుకు కూడా వెళ్లారు. ఇప్పుడు తాజాగా మరోసారి సునీత గీతా ఆఫీస్ దగ్గర హల్ చల్ చేయడంతో ఆఫీస్ మరోసారి వార్తలెక్కింది. అయితే టాలీవుడ్ నిర్మాతపై బోయ సునీత చేస్తున్న ఆరోపణల నేపధ్యంలో ఆమెను న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని, మానసిక ఆస్పతికి తరలించాలనీ జూబ్లీహిల్స్‌ పోలీసులు న్యాయమూర్తిని కోరారు.

శ్రీరెడ్డి తరహాలోనే మరొకరు..

గతంలో కూడా రెండుసార్లు మానసిక సమస్యలతో సునీత ఎర్రగడ్డలోని ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు తెలుస్తోంది. అంతే కాదు దాదాపు రెండున్న సంవత్సరాల నుంచి ఇదే విషయంలో వేర్వేరు పద్దతుల్లో నిరసనలు చేస్తూ వస్తోంది బాధితురాలు. బోయ సునీత ఆరోపణల్లో నిజమెంత ఉందనే విషయంపై ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఎవరూ స్పందించడం లేదు. మరి ఈసారి ఇలా అర్ధనగ్నంగా నిరసనకు దిగిన తర్వాతైనా నిర్మాత బన్నీవాసు స్పందిస్తారో లేదో చూడాలి.

Published by:Siva Nanduri
First published:

Tags: Bunny vas, Love cheating, Tollywood

ఉత్తమ కథలు