హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad : అర్ధరాత్రి అమ్మాయిలను సీక్రెట్‌గా వీడియో తీశాడు .. వాళ్లకు తెలియడంతో పారిపోవాలని ట్రై చేసి..

Hyderabad : అర్ధరాత్రి అమ్మాయిలను సీక్రెట్‌గా వీడియో తీశాడు .. వాళ్లకు తెలియడంతో పారిపోవాలని ట్రై చేసి..

HYDERABAD YOUTH DIED

HYDERABAD YOUTH DIED

Hyderabad: హైదరాబాద్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో చేసిన పనికి దారుణమైన శిక్షపడింది. స్నేహితుడి గదికి వెళ్లి మద్యం తాగిన తర్వాత థర్డ్‌ ఫ్లోర్‌లో నిద్రపోతున్న అమ్మాయిలను కిటికీలోంచి సెల్‌ఫోన్‌తో వీడియో తీస్తుండగా ఏం జరిగిందో తెలుసా.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్‌(Hyderabad)లో ఓ యువకుడు మద్యం మత్తులో చేసిన నీచమైన పనికి దారుణమైన శిక్షపడింది. స్నేహితుడి గదికి వెళ్లి మందు తాగిన తర్వాత పై ఫ్లోర్‌లో అద్దెకు ఉంటున్న అమ్మాయిల గదికి వెళ్లాడు. ఇద్దరు యువతులు నిద్రపోతున్న దృశ్యాలను తన సెల్‌ఫోన్‌(Cell phone)లో కిటికీలోంచి చిత్రీకరిస్తుండగా ఫ్లాష్ లైట్‌(Flash light)పడటంతో అమ్మాయిలు అతడ్ని గుర్తించారు. వెంటనే అపార్ట్‌మెంట్‌(Apartment)లో ఉంటున్న వారికి ఫోన్ చేయడంతో యువకుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. వేరే అపార్ట్‌మెంట్‌లోకి దూకేందుకు ప్రయత్నించగా కాలు జారి థర్డ్ ఫ్లోర్(Third Floor) నుంచి కిందపడ్డాడు. తలకు బలమైన దెబ్బ తగలడంతో చనిపోయాడు. మద్యం మత్తులో చేసిన దుశ్చర్యకు మరణశిక్ష పడటం చూసి స్థానికులు విచారం వ్యక్తం చేశారు.

Nagarkurnool: పుష్ప సినిమా స్టైల్లో కర్నాటక మద్యం తరలింపు .. నాగర్‌కర్నూలు జిల్లాలో ఇల్లీగల్ దందాకు చెక్అమ్మాయిలను ఫోన్‌లో చిత్రీకరిస్తూ...

హైదరాబాద్‌ చిలకలగూడలో రెండ్రోజుల క్రితం ఓ సంఘటన జరిగింది. అర్ధరాత్రి సమయంలో బౌద్ధనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ పైనుంచి దిలీప్‌ అనే యువకుడు కిందపడి చనిపోయాడు. అయితే దిలీప్ ఎందుకు బిల్డింగ్‌పై నుంచి పడి చనిపోయాడని ఆరా తీసిన పోలీసులకు షాకింగ్ న్యూస్ తెలిసింది. మృతుడు దిలీప్‌ది హిమాయత్‌నగర్‌. బౌద్ధనగర్‌లో ఉంటున్ సాయితేజ అనే యువకుడు దిలీప్‌కి స్నేహితుడు కావడంతో శనివారం రాత్రి అతని రూమ్‌కి వచ్చాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉంటున్న సాయితేజ రూమ్‌ నుంచి దిలీప్‌ థర్డ్ ఫ్లోర్‌కి వెళ్లాడు.

తాగిన మత్తులో యువకుడి చేష్టలు..

అర్ధరాత్రి 1:15 గంటలకు మద్యం మత్తులో దిలీప్‌ మూడో అంతస్తు టెర్ర్‌సపైకి ఎక్కాడు. అదే భవనం మూడో అంతస్తులోని పోర్షన్‌లో ఇద్దరు యువతులు అద్దెకు ఉంటున్నారు. ఆ సమయంలో యువతులు నిద్రిస్తుండగా దిలీప్‌ కిటికీలోంచి వారిని సెల్‌ఫోన్‌తో వీడియో తీయడం ప్రారంభించాడు. అయితే చీకటి కావడంతో మొబైల్ ఫ్లాట్ లైట్ ఆన్ చేశాడు. ఆ వెలుతురికి యువతుల ముఖాలపై పడటంతో నిద్రలేచి దిలీప్‌ని గుర్తుపట్టారు. వెంటనే అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఉమేశ్‌ అనే వ్యక్తికి ఫోన్‌ చేసి విషయాన్ని చెప్పారు.

Crime news : మద్యం తాగొచ్చి కూతుర్ని కాటేసిన తండ్రి .. ఇంతటి దారుణం ఎక్కడ జరిగిందో తెలుసా..?పారిపోతూ ప్రాణాలు పోగొట్టుకున్న వైనం..

స్థానికులతో కలిసి ఉమేష్ టెర్రస్‌పైకి వెళ్లి దిలీప్‌ చేతిలోని సెల్‌ఫోన్‌ లాక్కొని పగలగొట్టారు. అదే సమయంలో స్థానికులు తనకు దేహశుద్ధి చేస్తారనే భయంతో దిలీప్ అక్కడి నుంచి పారిపోయేందుకు పక్కనే ఉన్న మరో బిల్డింగ్‌లోకి దూకేందుకు ప్రయత్నించగా జారి కిందపడ్డాడు. థర్డ్ ఫ్లోర్ నుంచి కిందకు పడిపోవడంతో తలకు బలమైన దెబ్బ తగిలింది. దిలీప్‌ను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూనే దిలీప్ మృతి చెందాడు. జరిగిన ఘటనపై పోలీసులు అమ్మాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Crime news, Hyderabad news

ఉత్తమ కథలు