హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: ట్రాఫిక్ పోలీసులు ఆపారనే కోపంతో బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ...వీడియో ఇదిగో

Hyderabad: ట్రాఫిక్ పోలీసులు ఆపారనే కోపంతో బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ...వీడియో ఇదిగో

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

Hyderabad: గీత దాటితే తాట తీస్తామని హెచ్చరించినప్పటికి కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అలాంటి వారిపై పోలీసులు నిర్దాక్షిణ్యంగా కేసులు నమోదు చేశారు. సిటీలోని అమీర్‌పేట చౌరస్తా మైత్రివనం దగ్గర ట్రాఫిక్ పోలీసులు బైక్‌ని ఆపారనే కోపంతో ఓ యువకుడు టూవీలర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అక్టోబర్(October) 3వ తేది నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్‌(Traffic rules)అమలు చేస్తామని ముందుగానే హెచ్చిరించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు(Hyderabad Traffic Police)సోమవారం రంగంలోకి దిగారు. ఉదయం నుంచే రోడ్లు, ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్స్ దగ్గర విధులు నిర్వహించారు. ఆపరేషన్ రోప్ చేపట్టడానికి రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు జంటనగరాల పరిధిలో విస్తృతంగా తనిఖీ చేపట్టారు. సిగ్నల్ జంప్స్, ట్రాఫిక్ లైన్‌ క్రాస్ చేసే వాళ్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని జరిమానాలు విధించారు. అయితే ఇలాంటి తనిఖీల్లోనే పోలీసులకు ఊహించని సంఘటన అమీర్‌పేట(Ameerpet)లో ఎదురైంది.

గీత దాటితే తాట తీస్తున్నారంతే..

గీత దాటితే తాట తీస్తామని హెచ్చరించినప్పటికి కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అలాంటి వారిపై పోలీసులు నిర్దాక్షిణ్యంగా కేసులు నమోదు చేశారు. సిటీలోని అమీర్‌పేట చౌరస్తా మైత్రివనం దగ్గర రాంగ్ రూట్లో వస్తున్న అశోక్ అనే వ్యక్తిని ఆపారు ట్రాఫిక్ పోలీసులు.బండి ఆపినందుకు ఆగ్రహంతో అశోక్ అనే యువకుడు రెచ్చిపోయాడు. ట్రాఫిల్ పోలీసుల తీరుపై కోపంతో పెట్రోల్ ట్యాంకును ఓపెన్ చేసి లైటర్‌తో నిప్పట్టించాడు. ఆదిత్య ఎంక్లేవ్ లో మొబైల్ షాప్ నిర్వహిస్తున్న వాహనదారుడు అశోక్‌పై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. బైకర్ చర్యతో షాకైన పోలీసులు ఎందుకిలా చేవని ప్రశ్నిస్తే వారితో వాగ్వాదానికి దిగాడు. పోలీసులు ఆపరనే కోపంతోనే తన బైక్‌ని తానే నిప్పటించుకున్నాడు. అయితే ఈ చర్యతో పోలీసులు సైతం పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. మరో నాలుగు రోజుల పాటు అవగాహన కల్పించిన తర్వాత నుంచి జరిమానాలు విధిస్తామని చెబుతున్నారు.

వాహనదారులపై కొరడా ...

ఇప్పటికే జంటనగరాల పరిధిలో పోలీసులు అనుమతి లేని చోట పార్కింగ్, ఫుట్‌పాత్‌లపై వాహనాలు నిలిపిన వారిపై కేసులు నమోదు చేశారు. ఉదయం నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద స్టాప్ లైన్ దాటితే రూ.100 ఫైన్‌ విధిస్తూ వస్తున్నారు. ఫ్రీలెఫ్ట్‌కు ఆటంకం కలిగేలా వాహనదారులు వ్యవహరిస్తే రూ.1,000 వరకు జరిమానా వేస్తున్నారు. ఒక్కరోజులో కేవలం మైత్రివనం జంక్షన్‌లో 472 మందికి జరిమానా విధించినట్లుగా ట్విట్టర్‌ ద్వారా రేవతి అనే ఓ సామాన్య పౌరురాలు పేర్కొన్నారు. ఆపరేషన్ రోప్‌ పేరుతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే బైకర్ తన వాహనాన్ని తగులబెట్టుకున్న ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడానికే ..

రోజు రోజుకు నగరంలో వాహనాల సంఖ్య పెరిగిపోవడం, ట్రాఫిక్ రూల్స్ ఎవరూ పాటించకపోవడంతో పాటుగా ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొనే పోలీసులు ఈ తరహా యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇవే కాదు ఫుట్‌పాత్‌లను ఆక్రమించి షాపులు, దుకాణాలు ఏర్పాటు చేసే వారికి కూడా భారీగానే జరిమానాలు విధిస్తున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Telangana News, Traffic police

ఉత్తమ కథలు