కేవలం సినిమాల్లో మాత్రమే అలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంటాయి. .అమ్మాయి ప్రేమను పొందడానికి లేదంటే తన ప్రేమకు అడ్డు తగిలిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకునేందుకు హత్య చేయడం వంటివి చాలా అరుదుగా చూస్తాం. కాని గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad)పరిధిలోనే ఇంతటి దారుణంగా ఓ యువకుడ్ని మరో యువకుడు హత్య చేయడం ఉలిక్కిపడేలా చేసింది. హైదరాబాద్ శివారు ప్రాంతమైన పెద్ద అంబర్‌పేట్(Pedda Amberpet)లో ఈనెల 17వ తేదిన జరిగిన నవీన్(Naveen) అనే యువకుడి మర్డర్(Murder) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
లవ్ మర్డర్ కేసులో ట్విస్ట్ ..
తన ప్రేమ కోసం ఓ వ్యక్తిని అందులో స్నేహితుడ్ని ఇంత దారుణంగా హత్య చేశానని స్వయంగా నిందితుడు హరికృష్ణే పోలీసులకు విచారణలో వెల్లడించాడు. అబ్దుల్లాపూర్‌మెట్‌కి చెందిన హరికృష్ణ, మృతుడు నవీన్ ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరి మధ్య ఇంటర్ నుంచి ప్రెండ్‌షిప్ కొనసాగుతోంది. ఈనెల 17వ తేదిన నవీన్‌కు ఫోన్ చేసి పార్టీ ఉందని పిలిపించాడు హరికృష్ణ. అతడ్ని పెద్దఅంబర్‌పేటలోని నిర్మాణుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో అతి కిరాతకంగా హతమార్చాడు. చంపిన తర్వాత నవీన్ చేతి వేళ్లు, పెదవి, గుండెను కట్ చేసి తీశాడు. వాటిని ఫోటోలు తీసి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఓ విద్యార్థినికి మెసేజ్ చేశాడు. ఈవిషయాల్ని విచారణలో నిందితుడు హరికృష్ణనే స్వయంగా పోలీసుల ముందు అంగీకరించాడు.
అక్కసుతోనే కిరాతకం..
అయితే హరికృష్ణ నవీన్‌ని చంపడానికి ప్రేమ వ్యవహారమేనని తేల్చారు పోలీసులు. హరికృష్ణ ప్రేమించిన అమ్మాయి నవీన్‌తో క్లోజ్‌గా ఉండటం చూడలేకపోయాడు. నవీన్ తన ప్రియురాలిని వలలో వేసుకున్నాడనే అనుమానంతో క్లోజ్ ఫ్రెండ్‌ని అత్యంత క్రూరంగా హతమార్చాడు. అతని శరీర భాగాలను వేరు చేసి తన కసి తీర్చుకున్నాడు హరికృష్ణ.
పథకం ప్రకారమే నవీన్ మర్డర్..
నవీన్ హత్యకు గురైన తర్వాత తల్లిదండ్రులు తమ బిడ్డ కనిపించడం లేదని పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి హైదరాబాద్ శివారులోని కాలువలో నవీన్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పంపగా నవీన్‌ను కత్తితో పొడిచి చంపి, మృతదేహాన్ని ఛిద్రం చేసినట్లు నిర్ధారించారు. మహిళకు హరిహరకృష్ణ పంపిన మెసేజ్‌ల ఆధారంగా అతడ్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
ప్రాణం తీసిన ప్రాణస్నేహితుడు..
లవ్ మర్డర్‌గా మారిన ఈ కేసులో పోలీసులు పూర్తి వివరాల్ని అన్నీ కోణాల్లోంచి సేకరిస్తున్నారు. సాంకేతిక ఆధారాలతో కేసును విచారిస్తున్నారు. అయితే నవీన్‌ని హరికృష్ణ కిరాతకంగా చంపడం పథకం ప్రకారమే జరిగిందని ..ఒక వ్యక్తి వల్లే ఇదంతా సాధ్యమయ్యే విషయం కాదని పోలీసులు భావిస్తున్నారు. నవీన్‌కి ప్రాణ స్నేహితుడిగా ఉన్న హరికృష్ణ తమ బిడ్డను చంపాడని తెలిసి అతని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad crime, Love affiar, Telangana News