Home /News /telangana /

HYDERABAD YOUNG MAN CANCELLED A MARRIAGE WITH ONE MESSAGE ABOUT HIS ONE SIDE LOVE HSN

బ్రదరూ.. నువ్వు పెళ్లి చేసుకోబోతున్న పిల్ల నాది.. నేరుగా వరుడికే మెసేజ్ పెట్టిన ప్రియుడు.. వధువును నిలదీస్తే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మరో రెండు నెలల్లో పెళ్లి. కాబోయే భార్యతో తన భవిష్యత్ జీవితం గురించి ఆ యువకుడు కలలు కంటున్నాడు. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లను ఒక్కొక్కటిగా చేసుకొస్తున్నాడు. ఇంతలోనే అతడికి ఓ మెసేజ్..

    మరో రెండు నెలల్లో పెళ్లి. కాబోయే భార్యతో తన భవిష్యత్ జీవితం గురించి ఆ యువకుడు కలలు కంటున్నాడు. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లను ఒక్కొక్కటిగా చేసుకొస్తున్నాడు. పెళ్లి కార్డుల దగ్గర నుంచి పెళ్లి విందులో ఉండాల్సిన ఆహార పదార్థాల వరకు అన్నింటినీ లిస్ట్ చేసుకుంటున్నాడు. ఇంతలో సడన్ గా అతడికి ఇన్ స్టాగ్రామ్ లో ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి ఆ యువకుడు కంగుతిన్నాడు. మొదట ఆ మెసేజ్ ను లైట్ తీసుకున్నాడు. కానీ పదే పదే అవే సందేశాలు రావడంతో అతడి కుటుంబ సభ్యులంతా నివ్వెరపోయారు. చివరకు ‘మీ అమ్మాయితో పెళ్లికి మేం సిద్ధంగా లేము. పెళ్లిని రద్దు చేసుకుంటున్నాం’ అంటూ చెప్పేశారు. అసలేం జరిగిందో తెలిసిన అమ్మాయి తరపు వాళ్లు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు.

    నిజామాబాద్ కు చెందిన 24 ఏళ్ల వివేక్ అనే కుర్రాడి కుటుంబం హైదరాబాద్ లోని బేగం బజార్ లో స్థిరపడింది. ఆ యువకుడు మల్కాజిగిరి సఫిల్ గూడలో ఉండే తన బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. ఇంతలోనే ఆ యువతి తల్లిదండ్రులు బేగం బజార్ కు చెందిన ఓ యువకుడితో ఆమె పెళ్లిని నిశ్చయం చేశారు. మరో రెండు నెలల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఈక్రమంలోనే ఆమెతో పెళ్లి నిశ్చయం అయిన యువకుడికి ఇన్ స్టాగ్రాంలో వివేక్ ఓ మెసేజ్ పంపాడు. ‘నువ్వు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి నాది. నేను ఆమెను గాఢంగా ప్రేమించాను. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నన్ను కాదని నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటే చంపేస్తా. వెంటనే ఈ పెళ్లిని రద్దు చేసుకో‘ అంటూ వివేక్ ఆ యువకుడికి మెసేజ్ పంపాడు.
    ఇది కూడా చదవండి: చేయని నేరానికి 20 ఏళ్లు జైల్లోనే మగ్గిపోయిన విష్ణు.. 43 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యాక ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే..

    దీన్ని చూసిన ఆ యువకుడు మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ పదే పదే అవే మెసేజ్ లు వస్తుండటంతో అతడు తన తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. వాళ్లు అది విని నివ్వెరపోయారు. వెంటనే వధువు తల్లిదండ్రుల వద్దకు వెళ్లి విషయం చెప్పి పెళ్లిని రద్దు చేసుకున్నారు. కుమార్తె పెళ్లి రద్దు కావడానికి బంధువుల కుమారుడైన వివేకే కారణమని తెలిసి వాళ్లు ఆశ్చర్యపోయారు. ఈ విషయమై ఆ యువతిని తల్లిదండ్రులు నిలదీశారు. అయితే ఆ యువతి మాత్రం తనకు ఏమీ తెలియదనీ, అతడిని తానేమీ ప్రేమించడం లేదని వాపోయింది. దీంతో ఈ ఘటనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. నువ్వు ప్రేమించిన విషయం ఆ అమ్మాయికి చెప్పావా? అని వివేక్ ను పోలీసులు అడిగితే.. లేదని సమాధానం ఇచ్చాడు. ‘నాది వన్ సైడ్ లవ్వు. త్వరలోనే ఆ యువతికి ప్రపోజ్ చేద్దామనుకున్నాను. కానీ ఇంతలోనే పెళ్లి కుదిర్చారు.’ అని తాపీగా సమాధానమిచ్చాడా వివేక్.
    ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, CYBER CRIME, Hyderabad, Illegal affairs, Love affair

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు