పోర్న్‌ వెబ్‌సైట్‌లో యవతి ఫోన్ నంబర్ ను అప్ లోడ్ చేశాడు.. ఆరోజు నుంచి ఆమెకు ఒక్కటే ఫోన్లు.. చివరకు ఏం జరిగిందంటే..

మాధవ్

Hyderabad Crime: ఓ యువతి ఫోన్ నంబర్ ను పోర్న్ వెబ్ సైట్ లో అప్ లోడ్ వేధించాడు. విపరీతంగా ఫోన్లు రావడంతో ఆ యువతి విసుగుచెంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ యువకుడిని రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.

 • Share this:
  ట్యూషన్ లో అతడికి ఓ యువతి పరిచయం అయ్యింది. ఆ పరిచయంతోనే ఓ రోజు అతడు ఆమెకు ఇన్‌స్ట్రాగామ్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించాడు. తెలిసిన వారే కదా అని ఆమె ఆ రిక్వెస్ట్ ను అంగీకరించింది. దీంతో అప్పటి నుంచి ఇద్దరు ఒకరినొకరు ఫోన్ నంబర్లు కూడా మార్చుకున్నారు. వాట్సాప్ లో చాటింగ్ మొదలైంది. కొంత కాలం వరకు బాగానే చాట్ చేస్తూ ఉండేవాడు. తర్వాత అతడి ప్రవర్తనలో మార్పు కనిపించింది. అసభ్య కరంగా చాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఆమె అతడి నంబర్ ను బ్లాక్ లో పెట్టేసింది. ఆగ్రహానికి గురైన అతడు ఆమెపై పగ పెంచుకున్నాడు. ఏదో ఒక విధంగా పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. అదే క్రమంలో ఆమె ఫోన్ నంబర్ ను పోర్న్ వెబ్ సైట్ లో పెట్టాడు. వెబ్‌సైట్‌లో పెట్టి కాల్‌గర్ల్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.

  అప్పటి నుంచి ఒకటే ఫోన్లు వస్తుండటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లోని సఫిల్‌గూడకు చెందిన ముముడి సాయి మాధవ్‌(19) విద్యార్థి. ఓ యువతితో అతడికి ట్యూషన్‌లో పరిచయం ఏర్పడింది. ఓ రోజు ఇన్‌స్ట్రాగామ్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాడు. ఆ తర్వాత ఆమె తెలిసిన వారే కదా అని అంగీకరించింది. కొంత కాలం ఆమెతో మామూలుగా చాట్‌ చేసేవాడు. అతని విచిత్ర ప్రవర్తన కారణంగా కొంత కాలం తర్వాత అతడిని బ్లాక్‌ చేసింది.

  దీంతో నిందిడుతు ఆమెపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా పగ తీర్చుకోవాలని పన్నాగం పన్నాడు. బాధితురాలి మొబైల్‌ నంబర్‌ను పోర్న్‌ వెబ్‌సైట్‌లో పెట్టి కాల్‌గర్ల్‌గా అప్‌లోడ్‌ చేశాడు. ఫోన్లతో విసుగుచెందిన సదరు యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ యువతి ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
  Published by:Veera Babu
  First published: