Home /News /telangana /

HYDERABAD YOUNG MAN ARRESTED FOR HARASSING A GIRL IN THE NAME OF LOVE FULL DETAILS HERE HSN

హైదరాబాద్ లో యువతితో అయిదేళ్ల స్నేహం తర్వాత యువకుడి లవ్ ప్రపోజల్.. ఆమె తల్లికే వాట్సప్ మెసేజ్ పంపడంతో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆ వ్యక్తి ఎలాగోలా ఆమె తల్లి ఫోన్ నెంబర్ ను కనుక్కోగలిగాడు. ఆమెకు నేరుగా వాట్సప్ లో ఓ మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ ను చూసిన ఆమె కంగుతింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    మహిళలపై జరుగుతున్న ఘోరాలకు అంతే లేకుండా పోతోంది. చదువుకునే కాలేజీల్లోనూ, ఉద్యోగం చేసే ఆఫీసుల్లోనూ స్త్రీలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. చివరకు సొంత కుటుంబ సభ్యుల మధ్య కూడా రక్షణ లేకుండా పోతోంది. కన్న తండ్రి, తోడబుట్టిన అన్నలే దారుణాలకు తెగిస్తున్న ఘటనలు కోకొల్లలు. తాజాగా ఓ యువతిపై ప్రేమిస్తున్నానంటూ ఓ వ్యక్తి వేధింపులకు దిగబోయాడు. ఆమె తెలివిగా అతడి ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేసేసింది. అతడితో మాట్లాడటమే మానేసింది. దీంతో ఆ వ్యక్తి ఎలాగోలా ఆమె తల్లి ఫోన్ నెంబర్ ను కనుక్కోగలిగాడు. ఆమెకు నేరుగా వాట్సప్ లో ఓ మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ ను చూసిన ఆమె కంగుతింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరకు అతడిని కటకటాల్లోకి నెట్టింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    హైదరాబాద్ లోని బైరామల్ గూడకు చెందిన గుజ్జ శ్రీధర్ రెడ్డి అనే యువకుడికి 2012వ సంవత్సరంలో బస్టాప్ లో ఓ ఇంటర్ చదివే యువతి పరిచయం అయింది. పలుమార్లు బస్టాప్ లోనే కలవడంతో ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. వారిద్దరూ ఫోన్ నెంబర్లను ఇచ్చి పుచ్చుకున్నారు. స్నేహం మాటునే ఆమెతో మాట్లాడుతూ ఫొటోలు, వీడియోలను సేకరించగలిగాడు. అయిదేళ్ల పాటు స్నేహం నటించాడు. 2017వ సంవత్సరంలో ప్రేమిస్తున్నానంటూ, పెళ్లి చేసుకుందామంటూ ప్రపోజల్ పెట్టాడు. దీంతో ఆ యువతి అతగాడి ప్రపోజల్ ను తిరస్కరించింది. అతడి నిజస్వరూపం తెలియడంతే అతడి ఫోన్ నెంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది.
    ఇది కూడా చదవండి: చేయని నేరానికి 20 ఏళ్లు జైల్లోనే మగ్గిపోయిన విష్ణు.. 43 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యాక ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే..

    ఆమెతో మాట్లాడటం కుదరకపోవడంతో శ్రీధర్ కు పిచ్చెక్కినట్టయింది. ఎలాగోలా కష్టపడి ఆ యువతి తల్లి ఫోన్ నెంబర్ ను సంపాదించగలిగాడు. ‘నీ కూతురు నన్నే ప్రేమించాలి. కాదని ఇంకెవరిని ప్రేమించినా, పెళ్లి చేసుకున్నా, దాని పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయి. నా దగ్గర మీ అమ్మాయి ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. వాటిని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతా. మీ పరువు తీస్తా. నన్ను కాదంటే మీ అమ్మాయికి పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తా‘ అంటూ ఆ యువతి తల్లి వాట్సప్ నెంబర్ కు యువకుడు బెదిరింపు మెసేజ్ ను పంపాడు. దాన్ని చూసిన ఆమె కంగుతింది. కూతురిని అడిగి అసలు విషయం కనుక్కుంది. ఆ తర్వాత రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు శ్రీధర్ ను అరెస్ట్ చేశారు. అతగాడి వద్ద ఉన్న ఫొటోలు, వీడియో ఆధారాలను ధ్వంసం చేశారు. అతడిని రిమాండ్ కు పంపించారు.
    ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, CYBER CRIME, Hyderabad, Illegal affairs, Love marriage

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు