HYDERABAD YOUNG MAN ARREST FOR VOICE MESSAGE TO MOVIE ACTRESS WITH OBSCENE WORDS SB
Hyderabad: అసభ్య పదాలతో ప్రముఖ సినీ నటికి.. వాయిస్ మెసేజ్ చేసిన యువకుడు
ప్రముఖ సినీ నటికి వేధింపులు
ఓ యాప్ ద్వారా సినీ నటి నెంబర్ సంపాదించిన యువకుడు.. ఆమెకు మెసేజులు పెట్టడం ప్రారంభించాడు. ఫోన్ చేసి ఆమెను బెదిరించాడు, తనకు నచ్చినట్లుగా ఉండాలని.. వార్నింగ్ కూడా ఇచ్చాడు.
అమ్మాయిల ఫోన్ నెంబర్స్ తీసుకోవడం. వారికి అన్ నౌన్ నెంబర్స్ నుంచి కాల్ చేయడం... అసభ్యపదాలు.. అసభ్యకరమైన ఫోటోలను పంపించి వేధింపులకు గురి చేయడం వంటివి చేస్తే... అలాంటి వారిని వెంటనే గుర్తించి కటకటాల వెనక్కి పంపుతున్నారు పోలీసులు. తాజాగా ఓ నటికి కూడా ఇలాంటి వేధింపులే ఎక్కువయ్యాయి. తెలుగు ఇండస్ట్రీలో ఓ పేరున్న నటిని ఓ యువకుడు వేధింపులకు గురి చేశాడు. స్టార్మేకర్స్ యాప్ ద్వారా ఆమె ఫోన్ నంబరు సేకరించిన యువకుడు.. ఆమెకు మెసేజులు పంపడం ప్రారంభించాడు.
నటికి అసభ్య పదజాలంతో వాయిస్ మేసేజ్‌లు పంపాడు. కొద్దిరోజుల తర్వాత ఫోన్ చేసి ఆమె ఫొటోలు తన వద్ద ఉన్నాయని, వాటిని మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో ఉంచుతానంటూ బెదిరింపులకు గురి చేశాడు ప్రభుద్ధుడు. తాను చెప్పినట్టు నడుచుకోవాలంటూ మరోవేదనకు గురిచేశాడు. తనకు నచ్చినట్లే ఉండాలని కండిషన్స్ పెట్టాడు. దీంంతో బాధితురాలు వాట్సాప్ ద్వారా షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయటంతో మాదాపూర్ షీటీమ్స్ ఆ యువకుడిని గుర్తించి రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మరోవైపు సైబరాబాద్ షీటీమ్స్ డెకాయ్ ఆపరేషన్స్ ద్వారా మహిళలను వేధిస్తున్న ఆకతాయిలకు ముకుతాడు వేశారు. అధికశాతం బాధితులు లైంగిక వేధింపులకు గురైన వారే ఉన్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో వాట్సాప్, హాక్ ఐ, ఈమెయిల్ తదితర మాధ్యమాల ద్వారా బాధితుల నుంచి 355 ఫిర్యాదులు అందినట్టు సైబరాబాద్ డీసీపీ (షీ టీమ్స్) అనసూయ శనివారం తెలిపారు. అధికంగా వాట్సాప్ ద్వారా 269 ఫిర్యాదులు వచ్చాయన్నారు.
ఈ ఫిర్యాదుల్లో ఫోన్ వేధింపులు 141 ఉన్నట్టు చెప్పారు. 81 కేసుల్లో 18 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. 119 మందిని పద్ధతి మార్చుకోమంటూ హెచ్చరించారు. 319 మంది ఆకతాయిలకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. 2 నెలల వ్యవధిలో 1003 డెకాయి ఆపరేషన్, 834 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని షీ టీమ్స్ అధికారులు తెలిపారు. వేధింపులపై డయల్ 100, వాట్సాప్ నంబర్ 94906 17444 కు ఫిర్యాదు చేయాలని డీసీపీ సూచించారు. ఎవరైనా ఇలాంటి వేధింపులకు గురైతే.. వెంటనే షీ టీమ్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. షీ టీమ్ పోలీసులు ఎప్పుడు అండగా ఉంటామని డీసీపీ అనసూయ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.