హోమ్ /వార్తలు /తెలంగాణ /

Business Ideas: బొరుగులకు ఏడాది పొడవునా డిమాండ్.. ఇలా చేస్తే రూ.3 లక్షల ఆదాయం గ్యారంటీ

Business Ideas: బొరుగులకు ఏడాది పొడవునా డిమాండ్.. ఇలా చేస్తే రూ.3 లక్షల ఆదాయం గ్యారంటీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Business Ideas: మీ మర్మరాల యూనిట్ నుంచి ఏడాదికి 200 క్వింటాళ్లు ఉత్పత్తి చేశారనుకుందాం. కిలోకు రూ.30 లెక్కేసినా..మొత్తం రూ.6,00,000 వస్తాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగం కన్నా.. సొంతంగా వ్యాపారంపై దృష్టి సారిస్తున్నారు. జీతంలో పోల్చితే తక్కువ డబ్బులు వచ్చినా సరే ప్రశాంతంగా జీవించాలని అనుకుంటున్నారు. అందుకే సొంతంంగా ఏదైనా వ్యాపారం చేయాలని భావిస్తున్నారు. మీరు కూడా అదే ఆలోచనలో ఉన్నారా? ఐతే మీలాంటి వారి కోసమే మరో బిజినెస్ ఐడియా (Business Ideas)ను తీసుకొచ్చాం. మర్మరాల (Murmura)ను మన దేశంలోని ఎక్కువగా వినియోగిస్తారు. కొన్నిచోట్ల బొరుగులు, బొంగులు కూడా అంటారు. గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల వరకు అంతటా మర్మాలను తింటారు. ఉగ్గాని, భేల్ పురి వంటి వంటకాలను చేసుకొని..ఇష్టంగా లాగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో దేవుడికి నైవేద్యంగా కూడా పెడతారు. అందుకే దీనికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది.

రూ.12,000 డిస్కౌంట్, ఉచితంగా రిజిస్ట్రేషన్.. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే వారికి బంపరాఫర్

రోడ్డుపక్కన ఉంటే చిన్న దుకాణతో పాటు పెద్ద పెద్ద మాల్స్‌లో కూడా మర్మరాలు ఈజీగా లభ్యమవుతున్నాయి. రిటైల్ స్టోర్లలో ప్యాకేజింగ్‌లో లభిస్తుంది. ఈకామర్స్ సైట్లలో కూడా విక్రయిస్తున్నారు. మీరు కూడా ఈ వ్యాపారం ప్రారంభిస్తే.. మంచి లాభాలు వస్తాయి. తక్కువ పెట్టుబడితోనే మర్మరాల తయారీని ప్రారంభించి.. భారీగా ఆదాయం పొందవచ్చు.

ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) గ్రామ పరిశ్రమల ఉపాధి పథకం కింద ముర్మురా తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఒక ప్రాజెక్ట్‌ను సిద్ధం చేసింది. ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం ముర్మురా తయారీ యూనిట్ ఏర్పాటుకు మొత్తం రూ.3.55 లక్షలు ఖర్చు అవుతుంది. వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీ వద్ద నిధులు లేకుంటే, మీరు PM ముద్ర లోన్ స్కీమ్ ద్వారా లోన్ తీసుకోవచ్చు. ప్రాజెక్ట్ నివేదిక ఆధారంగా, మీరు బ్యాంకు నుండి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ రూపొందించిన ప్రాజెక్ట్ ప్రొఫైల్ రిపోర్ట్ ప్రకారం.. మర్మరాల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే మీకు సొంత భూమి ఉండాలి. లేదంటే లీజుకైనా తీసుకోవచ్చు. 1000 చదరపు అడుగుల భవనం షెడ్డు నిర్మాణానికి మొత్తం రూ. 2,00,000 ఖర్చు అవుతుంది. యంత్రాలకు మర రూ. 1,00,000 కావాలి. ముడి సరుకు రూ.50వేల వరకు ఖర్చవుతుంది. మొత్తంగా రూ.3,50,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీ వద్ద అంత డబ్బులు లేకుంటే.. ముద్ర స్కీమ్ కింద లోన్ కూడా తీసుకోవచ్చు. మీ ప్రాజెక్టు రిపోర్టు ఆధారంగా బ్యాంకు రునం కోసం దరఖాస్తు చేయొచ్చు.

మీ మర్మరాల యూనిట్ నుంచి ఏడాదికి 200 క్వింటాళ్లు ఉత్పత్తి చేశారనుకుందాం. కిలోకు రూ.30 లెక్కేసినా..మొత్తం రూ.6,00,000 వస్తాయి. ఇందులో ముడి సరుకు, ఇతర ఖర్చులకు రూ.3 లక్షలు పోయినా.. మరో రూ. 3 లక్షలు మిగులుతాయి. ఐతే ఇది ప్రాంతాన్ని, మీ యూనిట్ సామర్థ్యం బట్టి మారుతుంటుంది. పెద్ద మొత్తంలో ప్రారంభించి.. బాగా మార్కెటింగ్ చేసుకోగలిగితే ఇంకా ఎక్కువ లాభాలే వస్తాయి.

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

First published:

Tags: Business Ideas, Hyderabad, Local News

ఉత్తమ కథలు