Home /News /telangana /

HYDERABAD YOU ARE FAT NOT BEAUTIFUL SHE COMMITTED SUICIDE AFTER BEING HARASSED BY HER HUSBAND FOR MARRYING SOMEONE ELSE VB

Hyderabad Crime: అందంగా లేవంటూ భర్త వేధింపులు.. వేరే పెళ్లికి సిద్ధపడిన భర్త.. చివరకు ఆమె ఏం చేసిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabd Crime: లావుగా ఉన్నావు.. అందంగా లేవంటూ ఓ భర్త ఆమెను తీవ్రంగా వేధింపులకు గురిచేశాడు. అంతేకాకుండా వేరొకరితో పెళ్లి చేసుకునేందుకు ఆమె అత్తామామ కూడా అతడికి మద్దతు పలకడంతో తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    ప్రతీ రోజు ఆమెను నువ్వు లావుగా ఉన్నావు.. అందంగా లేవంటూ ఓ భర్త తన భార్యను వేధింపులకు గురిచేశాడు. అంతే కాకుండా తాను వేరే పెళ్లి చేసుకుంటానని ఆమెను మానసికంగా హింసించాడు. వేరే పెళ్లి తన అత్తామామ కూడా మద్దతు తెలిపారు. వీటన్నింటిని తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఎస్సార్‌నగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన హలీమాబేగం (25) కు బోరబండ స్వరాజ్‌నగర్‌కు చెందిన అబ్దుల్‌ హాసిఫ్‌ (32) తో 2018 జూన్‌ 30న వివాహమైంది. వివాహం జరిగి దాదాపు మూడు సంవత్సరాలు అయింది. ఈ దంపతులకు రెండున్నరేళ్ల కుమారుడున్నాడు. ఈ క్రమంలో హాసిఫ్ అందంగా లేవని, మరో పెళ్లి చేసుకుంటానని కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు.

    అత్త బీబీ ఫాతీమా, మామ అబ్దుల్‌ జానీమియా సైతం సూటిపోటి మాటలతో హలీమాబేగంను ఇబ్బందులకు గురిచేశారు. ఈ విషయాన్ని హలీమా పుట్టింటి వారి దృష్టికి తీసుకెళ్లింది. అత్తింటి వారితో వారు మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో.. విడాకులు ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారని.. తనను తీసుకెళ్లాలని గురువారం ఉదయం హలీమా తల్లికి ఫోన్‌ చేసి చెప్పింది. ఆ తర్వాత ఆమె చున్నితో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తరువాత ఫోన్‌ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి.. ల్యాండ్‌లైన్‌కు ఫోన్‌ చేసింది. ఫోన్ ఎత్తి మాట్లాడిన తోటికోడలు హలీమాబేగం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పింది.

    Crime: లగ్జరీ బస్సులో ఘోరం.. మైనర్ బాలికపై అత్యాచారం.. ఆ పనికి సహకరించిన తన సోదరి..


    దీంతో హలీమా కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. నగరానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమార్తె మరణానికి భర్త, అత్తామామ వేధింపులే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు హలీమా తల్లిదండ్రుల నుంచి పలు వివరాలను సేకరించారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Attempt to suicide, Crime, Telangana crime news, Wife

    తదుపరి వార్తలు