హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: భర్త ఆ సినిమాకి వద్దన్నాడని కోపంతో భార్య అంత పని చేసింది..

Hyderabad: భర్త ఆ సినిమాకి వద్దన్నాడని కోపంతో భార్య అంత పని చేసింది..

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

OMG:ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఆ ఒక్క కారణంతో శాశ్వతంగా విడిపోయింది. వాళ్ల కొత్త కాపురాన్ని ఆ ఒక్క మాట కూల్చేసింది. పెళ్లై మూడు నెలలు గడవక ముందే ప్రియుడి మీదే కోపం వచ్చేలా చేసింది ఏంటో తెలుసా.

ప్రేమించింది. ప్రియుడ్నే పెళ్లి చేసుకుంది. పట్టుమని వంద రోజులు కూడా కాపురం చేయకుండానే మొగుడిపై అలిగి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడిపై ఎందుకు అలిగిందో...ఆమెను అంతగా మనస్థాపానికి గురి చేసిన అంశం ఏమిటో తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. హైదరాబాద్(Hyderabad)శివారు శంకర్‌పల్లి(Shankarpalli)లో మున్సిపాలిటీ కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. భవనీనగర్‌ కాలనీ(Bhavnagar Colony)లో ఉంటున్న 25సంవత్సరాల వయసు కలిగిన స్వాతి (Swathi)అనే నవ వధువు new bride ఇంట్లో ఫ్యాన్‌కి ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. మూడు నెలల క్రితమే భవానీనగర్‌ కాలనీకి చెందిన రాజు(Raju) స్వాతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మృతురాలి స్వస్థలం ముంబై(Mumbai). రాజు స్థానికంగా ఉంటున్న ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీళ్లిద్దరి కొత్తకాపురంలో చిచ్చు పెట్టింది రీసెంట్‌గా రిలీజైన కేజీఎఫ్‌2(KGF2) సినిమా. మృతురాలు స్వాతి బుధవారం(Wednesday)సెకండ్‌ షో సినిమాకు తీసుకెళ్లమని భర్త రాజును కోరింది. అతనికి మార్నింగ్ డ్యూటీ(Duty)ఉండటంతో ఇప్పుడు కుదరదని చెప్పాడు. కేవలం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సినిమాకి వద్దనడంతో మనస్తాపానికి గురైంది స్వాతి. తెల్లవారుజామునే భర్త రాజు డ్యూటీకి వెళ్లడం, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఫ్యాన్‌(Fan‌)కి ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది.

భర్త సినిమాకి వద్దన్నాడంట..

ఉదయాన్ని చుట్టుపక్కల వాళ్లు వచ్చి తలుపు తట్టినా, పిలిచినా స్వాతి తలుపు తెరవకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూశారు. స్వాతి ఫ్యానుకు వేలాడుతూ కనిపించడంతో భర్త రాజు సమాచారం చేరవేశారు. వెంటనే అతను ఇంటికి చేరుకొని వెంటనే పోలీసులకు విషయం తెలియపరచడంతో హుటాహుటిన ఘటన స్తలానికి చేరుకొని తలుపులు పగలగొట్టి లోపలున్న మృతదేహాన్ని దింపారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వామ్మో అంత పని చేసింది ఆ ఇల్లాలు..

స్వాతి ఆత్మహత్య చేసుకున్న భర్త ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటిని పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో స్థానికులు, భర్త రాజును విచారించారు పోలీసులు. సినిమాకు తీసుకెళ్లనని భర్త చెప్పడం వల్లే స్వాతి మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లుగా నిర్ధారించారు. భర్త కొట్టినందుకో, తిట్టినందుకో పుట్టింటికి వెళ్లడం, భర్తతో గొడవపడటం చూశాం... సినిమాకు వద్దని చెప్పినందుకు ప్రాణాలు తీసుకోవడం ఏమిటని స్వాతి చేసిన పనికి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.

First published:

Tags: Rangareddy, Woman suicide

ఉత్తమ కథలు