అమ్మాయి ప్రేమ కోసం తల్లీ, కూతుళ్లపై కత్తితో ప్రేమోన్మాది దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయిపడిన మహిళ మృతి చెందింది. హైదరాబాద్hyderabad మియాపూర్‌లోని ఆదిత్యనగర్‌లో నివాసముంటున్న శోభా (Shobha)అనే 45ఏళ్ల మహిళతో పాటు ఆమె కూతురు వైభవి (Vaibhavi)ని కూరగాయలు కట్ చేసే కత్తితో దాడి చేశాడు సందీప్(Sandeep). అటుపై తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మంగళవారం(Tuesday)స్థానికంగా కలకలం రేపిన ఈసంఘటనలో తీవ్రంగా గాయపడిన తల్లి,కూతురిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శోభ బుధవారం మరణించింది.
పెళ్లికి ఒప్పుకోలేదని..
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకుకు చెందిన సందీప్ హైదరాబాద్ మియాపూర్‌లో నివాసముంటున్న శోభ కుమార్తె వైభవి ప్రేమించుకున్నారు. పెద్దలు పెళ్లికి నిశ్చితార్ధం కూడా చేశారు. అయితే సందీప్, వైభవి మధ్య మనస్పర్దలు రావడంతో నిశ్చితార్ధం రద్దు చేసుకొని ఫ్యామిలీ హైదరాబాద్‌కు షిప్ట్ అయ్యారు. హైదరాబాద్‌లో బ్యూటిషియన్ కోర్సు చేస్తున్న వైభవికి మరో వ్యక్తితో నిశ్చితార్ధం జరిపించింది తల్లి శోభ. ఆ విషయం తెలసుకున్న సందీప్ వైభవితో తనకు వివాహం చేయడం లేదనే కోపంతో గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. కోపంతో రగిలిపోయి ఇంట్లోని కత్తితో తల్లీ, కూతురుపై విచక్షారహితంగా దాడి చేశాడు.
ప్రియురాలి తల్లిని చంపిన యువకుడు..
ప్రేమోన్మాది సందీప్ మొదట యువతి వైభవిపై కత్తితో దాడి చేస్తుండగా అడ్డుగా వెళ్లిన ఆమె తల్లి శోభను కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన శోభ పొత్తి కడుపు, ఛాతి భాగంలో గాయలవడంతో ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈసంఘటనలో యువతి వైభవి కూడా గాయపడింది. క్షణికావేశంలో కత్తితో గాయపరిచిన సందీప్ అనంతరం అదే కత్తితో తన గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా పోలీసులు తెలిపారు.
కత్తితో ప్రేమోన్మాది దాడి..
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈసంఘటన స్థానికంగా కలకలం రేపింది. 19ఏళ్ల వైభవి ప్రేమోన్మాది చేతిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సందీప్ కూడా గాయపడినట్లుగా పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Hyderabad, Women died