హోమ్ /వార్తలు /తెలంగాణ /

వీడియో కాల్ లో బ‌ట్ట‌లిప్ప‌మంది.....క‌ట్ చేస్తే ల‌క్ష కోట్టేసింది.. కిలేడీ మాములుగా లేదుగా..            

వీడియో కాల్ లో బ‌ట్ట‌లిప్ప‌మంది.....క‌ట్ చేస్తే ల‌క్ష కోట్టేసింది.. కిలేడీ మాములుగా లేదుగా..            

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dating app: యువకుడికి కాల్ చేసింది. హస్కీగా మాట్లాడింది. ఇద్దరు కలిసి కొంత కాలం చాటింట్ చేసుకున్నారు. ఈ క్రమంలో అమ్మాయి న్యూడ్ గా మాట్లాడదామనడంతో మనోడు కక్కుర్తి పడ్డాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

M.Balakrishna, News18, Hyderabad.


డేటింగ్ యాప్ ల మోజులో పడి నిండా ములుగుతున్నారు యువత, కేవలం యువతే కాకుండా,  చిన్న వాళ్ల నుంచి, పెద్ద వాళ్ల  వరకు వారి విక్నేస్ నే పెట్టుబడిగా పెట్టి నిండా ముంచుతున్నారు కిలాడీలు.  వీరంతా..  న్యూడ్ వీడియో కాల్స్ అండ్ డేటింగ్ అంటూ బాధితుల అకౌంట్స్ లో అందినకాడికి దోచుకుంటున్నారు. బాధితులతో సెక్స్ చాట్ చేసి న్యూడ్ కాల్స్ రికార్డ్ చేసిన తరువాత వాటిని అడ్డు పెట్టుకొని బాధితులను బ్లాక్ మైయిల్ చేసి అకౌంట్ లో వరకు దోచుకుంటున్నారు నేరగాళ్లు. తాజాగా ఈ తరహా కేసులు నగరంలో పెరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ కు చెందిన 25 ఏళ్ల విద్యార్థి డేటింగ్ యాప్‌లో పరిచయమైన ఓ మహిళ ద్వారా సెక్స్ చాట్ అండ్ కాల్స్ ద్వారా ఏకంగా 98,400 పోగొట్టుకున్నాడు.


ఆ వ్యక్తితో వీడియో కాల్‌లో మహిళ బాధితుడితో బట్టలు విప్పించి, అతని ముఖం కనిపించేలా కాల్‌ను రికార్డ్ చేసింది. ఆ తర్వాత వీడియోను వైరల్ చేస్తానని బెదిరించింది  దోచుకుంది. అయితే ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నప్పటికి చాలా తక్కువ వరకు మాత్రమే బయటకు వస్తాయని అంటున్నారు అధికారులు. ఇలాంటి సందర్భాల్లో చాలా వరకు బాధితులు బయటకు రావడానికి ఇష్టపడరని అంటున్నారు పోలీసులు. తాజాగా రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌కు చెందిన బాధితుడు ఆగస్టు 20న తెలుగు డేటింగ్ యాప్‌ అయిన నీతో అంజలి అనే యాప్ లో ఒక  అమ్మాయిని కలుసుకున్నాడు.



ఆ అమ్మాయితో కొన్ని రోజులు సెక్స్ చాట్ చేసిన తరువాత ఒక రోజు న్యూడ్ వీడియో కాల్ చేయాలని ఆ అమ్మాయి కోరడంతో చాలా ఉత్సహాంతో వీడియా కాల్ చేసి అడ్డంగా బుక్కైయ్యాడు బాధితుడు. "ఆమెతో కొన్ని సార్లు చాట్ చేసిన తర్వాత,నేను ఆ అమ్మయి మా వాట్సాప్ నంబర్‌లను మార్చుకున్నాము. తరువాత కొన్ని రోజులు ఆమెతో సెక్స్ చాట్ చేశాను ఒక రోజు ఆమె నాకు వీడియో కాల్ చేయమని కోరడంతో అలా చేశాను తను కూడా అదే వీడియో కాల్ లో ఆమె బట్టలు విప్పేసి, నా ముఖం కనిపించే వీడియోను రికార్డ్ చేసింది.


ఆ తర్వాత నన్ను రూ. 22,500 బదిలీ చేయమని కోరింది. నా ఫేస్‌బుక్ స్నేహితుల జాబితాను తన దగ్గర ఉందని ఇప్పుడు రికార్డుచేసిన వీడియోను నా ప్రెండ్స్ అందరికి సెండ్ చేస్తానని బెదిరించి పలు దఫాలుగా మొత్తం లక్ష రూపాయిలు వ‌ర‌కు నా నుంచి తీసుకుందాని తెలిపాడు బాధితుడు.  తొలుత భయంతో ఆమెకు 18,400 పంపాడు బాధితుడు. డ‌బ్బులు పంపిన  తర్వాత కూడా ఆ వీడియోను మా కుటుంబానికి పంపిస్తానని చెప్పి బ్లాక్‌మెయిల్ చేస్తూనే ఉండ‌డంతో బాధితుడు పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు.  ప్ర‌స్తుతం కేజు న‌మోదు చేసిన పోలీసులు చీటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ల కింద రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

First published:

Tags: Crime news, CYBER FRAUD, Telangana News

ఉత్తమ కథలు