హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: హయత్ నగర్ పాప మృతి కేసులో బిగ్ ట్విస్ట్..ఆ కారు ఎస్సైదే..కానీ..!

Hyderabad: హయత్ నగర్ పాప మృతి కేసులో బిగ్ ట్విస్ట్..ఆ కారు ఎస్సైదే..కానీ..!

పాప మీదకు తీసుకెళ్తున్న కారు

పాప మీదకు తీసుకెళ్తున్న కారు

Hyderabad: హైదరాబాద్ హయత్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ సెల్లార్ లో పడుకున్న రెండేళ్ల పాపపైకి కారు దూసుకెళ్లడంతో మృతి చెందిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. పాపను గమనించని కారు నడుపుతున్న వ్యక్తి పాప తలపై నుంచి పోనీయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఈ కారు ఓ మహిళా ఎస్సైది తెలుస్తుండగా..కారు నడిపింది ఆ ఎస్సై భర్తగా పోలీసులు గుర్తించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Hyderabad: హైదరాబాద్ హయత్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ సెల్లార్ లో పడుకున్న రెండేళ్ల పాపపైకి కారు దూసుకెళ్లడంతో మృతి చెందిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. పాపను గమనించని కారు నడుపుతున్న వ్యక్తి పాప తలపై నుంచి పోనీయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఈ కారు ఓ మహిళా ఎస్సైది తెలుస్తుండగా..కారు నడిపింది ఆ ఎస్సై భర్తగా పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కారులో పోలీసు క్యాప్ ను గమనించిన పోలీసులు కారు నడిపింది హరిరామకృష్ణగా గుర్తించారు. పాప బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా పాప మృతికి కారణమైన TS07 JR 9441 నెంబర్ గల కారు కేశమోని స్వప్న పేరుతో రిజిస్టర్ అయింది. స్వప్న ఎక్సైజ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తుంది. ప్రమాద సమయంలో కారులో ఉన్న క్యాప్ ను గుర్తించిన అధికారులు కారు నెంబర్ ఆధారంగా ఎవరిదన్నది గుర్తించారు. అయితే ఆ సమయంలో కారు నడిపింది స్వప్న కాదని..ఆమె భర్త హరిరామకృష్ణగా పోలీసులు గుర్తించారు. దీనితో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజిలో రికార్డ్ అవ్వడంతో పోలీసుల దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చింది.

అయితే హరిరామకృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత 41 సిఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. దీనితో పాప కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. 'రోజులాగే హరిరామకృష్ణ కార్ పార్క్ చేశాడు. ఎండ ఎక్కువగా ఉందని సెల్లార్ లో పాపను తల్లి పడుకోబెట్టింది. పాపను గమనించకుండా హరిరామకృష్ణ కారును ముందుకు నడిపాడు. పాప అరుపులు విని అందరం కిందికి వచ్చాం. హుటాహుటీన ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు పాప చనిపోయిందని' ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

Viral Video: కారు డ్రైవర్ నిర్లక్ష్యం..టైర్ల కింద రెండేళ్ల చిన్నారి..వీడియో ఇదిగో

కర్నాటకకు చెందిన కవిత, రాజు దంపతులు లెక్చరర్స్‌ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్ దగ్గర భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. కవిత దంపతులకు మూడేళ్ల వయసున్న కొడుకు, కూతురు ఉన్నారు. పని చేస్తున్న పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ పార్కింగ్ ప్రదేశంలో తన పాపను పడుకోబెట్టింది. అయితే అదే సమయంలో కారులో సెల్లార్ కు వచ్చిన వ్యక్తి పాపను చూసుకోలేదు. దాంతో కారు ..ఆమె శరీరంపై నుంచి పోయింది. కారు నడిపిన వ్యక్తి నిర్లక్ష్యానికి ఖరీదుగా చిన్నారి ప్రాణం పోయింది. చిన్నారి మృతితో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది.

First published:

Tags: Crime, Hyderabad, Telangana

ఉత్తమ కథలు